నంద్యాల సమాధానం చెబుతుంది

బ్రాహ్మణుడు అయినా ఆ గడ్డ వాడు కాకపోయినా అత్యధిక మెజారిటీతో దేశ ప్రధాని గా నరసింహా రావును గౌరవించి మురిసి పోయింది నంద్యాల.  సంస్కరణల నారసింహుడు గా చేసిన సేవలు కూడా మరిచి నిత్య గాయత్రీ మంత్రోపాసకుడి మహాప్రస్థనం లో మన మహనేత సోనియా మెప్పుకోసం అవలంభించిన కుసంస్కారం కుక్కలు గుమికూడేలా శవాన్ని కాల్చీ కాలనీయకుండా అవమానించడం .

అటు అహోభిల నరసింహుడు మధ్య నంద్యాల ఇటు పావురాల్ల గుట్ట మీద అచ్చం అలాగే బతికుండగనే కాలీ కాలని చావు తో అదే సంస్కారం పొందలేదా మహానేత.

ఇక కొడుకు

నంద్యాలలో గెలిచిన భూమా నాగిరెడ్డి, బంధువు ఒకే సామాజిక వర్గం, కుటుంబం మొత్తాన్ని పార్టీ సేవలకు వాడుకొని ఆయన మరణిస్తే, అమరావతి శాసన సభ మొత్తం నివాళి అర్పిస్తుంటే, అక్కడే మరణ శోకంతో ఆయన కుమార్తె వుండగా శ్రద్దాంజలిని కూడా బహిష్కరించిణ మహా నేత కొడుకు.

రోశయ్య గారు ముఖ్యమంత్రిగా మంత్రి మండలి సమావేశం జరుపుతుంటే మంత్రులను ఇంటికి పిలిపించుకొని చూపించిన అహంకారం నంద్యాల గడ్డలో కొత్తగా వైశ్యులు మీద చూపిస్తున్న ప్రేమతో మరిచిపోతారా?

మైనారిటీలకు ఎం ఎల్ సి ఇస్తా అని చెప్పి టోపీ పెట్టి వారిని వేధించిన శిల్పాకు ఓటేయమని వారి వస్త్రధారణ వేషం వేస్తే మైమరిచిపోతారా?

కర్మ ఫలితం అనుభవించక తప్పదు

ఆ గడ్డ సేవలో కన్నుమూసిన భూమాకు నివాళి విషయం లో చేసిన రాజకీయానికి ఆ భూమి ఖచ్చితంగా తగు సమాధానం చెబుతుంది.

0 స్పందనలు to “నంద్యాల సమాధానం చెబుతుంది”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,928

తడి ఆరని ఉతుకులు

ఆగస్ట్ 2017
సో మం బు గు శు
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి