Archive for the 'Uncategorized' Category

చంద్రబాబు పెంచిన ఫించన్ ను వైకాపా తమకు అనుకూల అస్త్రంగా మలచుకొంటోంది

చంద్రబాబు పెంచిన ఫించన్ ను వైకాపా తమకు అనుకూల అస్త్రంగా మలచుకొంటోంది

చంద్రబాబు మీద పదే పదే విశ్వసనీయత అస్త్రం ప్రయోగించేది వైకాపా. దానినే వాడుకొని అప్పు చేసైనా చెప్పింది చేసుకుపోతున్నాడు. ఆ క్రమంలో ఒక్క సారిగా ఫించనీలు డబుల్ చేసి, ఫిబ్రవరి లో అందుకొనే పెద్దలను పిలిచి, భోజనం పెట్టి పెంచిన 2000, జనవరి లో పెంచిన బ్యాలన్స్ కలిపి 3000 చేతుల్లో పెట్టమని బాబు ఆదేశాలు ఇచ్చాడు. ఆ ఏర్పాట్లు చేసుకొని తలమునకలు అయిన తెలుగుదేశాన్ని దెబ్బకొట్టడానికి వైకాపా దానినే అస్త్రంగా మలుస్తోంది.

ఐదు ఎకరాలకు పైన, శ్రీమంతులకు, చెవి రెడ్డి గారి నాన్న లాంటి పెద్దలకు ఫించనీలు ఇవ్వడం లేదు. ఇలా ఇవ్వని వారిని & రైతులను కలిసి, ఫించనీ రెండు వేలు చేసి ఇస్తే, పొలాలకు కూలీలు ఎవరు వస్తారని? చాప క్రింద నీరులా రెచ్చగొడుతున్నారు.

జిలా కేంద్రాలకు, దేవాలయాలకు, రోడ్డు పనులకు దూరంగా వుండే పల్లెల్లో దళితులు, పేదలు, వెనుకబడిన వర్గాలకు పొలం పనులు లేక పోతే పస్తులే. తుఫానులు వచ్చినా, కరువులు వచ్చినా, మరే కారణం చేతైనా పొలాల పనులు లేకపోతే వారికి చాలా ఇబ్బందే. ఎవరూ ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు. ఖర్మగాలి మంచాన బడితే ఇల్లుగడవడం కష్టం. అయినా వైకాపా కూడా పెంచుతామన్న విషయం వీరి దగ్గర దాచి ఇలా చెబుతుంది.

ఇప్పుడు ఫించనీ అందుకొనే వారి దగ్గర చేరి పెద్ద మొత్తంలో అందరికీ ఫించను ఇస్తామని చెబుతుంది. అంటే మనిషికి మనిషికీ ఓ మాట చెబుతోంది, వారికి తగ్గట్టు.

అసలే రైతులు మరో రెండు రుణమాఫీ వాయిదాల కోసం ఎదురు చూస్తున్నారు. సమయం చూసి మొత్తం మీద రైతులను రెచ్చగోడుతోంది.

కానీ వారి రుణమాఫీ బకాయిలు ఒకేసారి ఇచ్చేలా చంద్రబాబు నిధుల కోసం కసరత్తులు చేస్తూ ఒక కొలిక్కి తెచ్చినట్టు వుంది. అదే సమయంలో తిరుగులేని పథకం ఏదో చంద్రబాబు మనసు ఆలోచనల్లో సుడులు తిరుగుతోంది అని తెలుస్తోంది. రుణమాఫీలు ఇచ్చాక ఆ పథకం మీద ప్రకటన చేసే అవకాశం వుంది. అప్పుడు చంద్రబాబు మీద విశ్వసనీయత పెరిగే అవకాశం వుంది. ఎందుకంటే ఎంత కష్టం లో అయినా ఎలాగో ఒకలా మనకు ఇచ్చాడు. జగన్ అయితే? అనే ఆలోచనతో, అమ్మో జీతాలు కూడా ఇవ్వలేడు అనే చర్చల వరకు దారితీయవచ్చు. ఏతవతా, జగన్ చేసిన విశ్వసనీయత బాణాన్నే జగన్‌ను చేధించే లక్ష్యంగా బాబు చేసుకుపోతున్నాడు. ముందులా సంక్షేమ పథకాల విషయంలో ముక్కు సూటిగా ఇంటి పెద్దలా గట్టిగా ఇవ్వను అనండం లేదు. చేతికి వెన్నెముక లేనట్టు ఒకదాని వెనుక ఇంకొకటి చేస్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఆర్థిక వేత్తలు, విద్యావంతులు ఈ విపరీత సంక్షేమం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు చెయ్యడానికి సాహసం చెయ్యడం లేదు.

పద్దతిగా వున్న బాబును, చెడగొట్టింది వైఎస్ & కెసీఆర్ ప్రవేశ పెట్టిన పప్పు బెల్లాల పథకాలే. ఎంత కష్టపడి అభివృద్ధి చేసినా ఎన్నికల్లో జనం కక్కుర్తి తీర్చేవి సంక్షేమ పథకాలే, గెలిపించేవీ అవే. ఆచరణ సాధ్యం అయ్యే పథకాలు మరెన్ని చేస్తాడో చంద్రబాబు అని ప్రత్యర్థులు వణికిపోతున్నారు.

నిజం చెప్పాలి అంటే ఆర్థిక క్రమ శిక్షణ పాటించాల్సిన అవసరం వుంది ఆంధ్రా లాంటి రాష్ట్రం. కానీ ఆలోచన లేని & గెలిపించలేని రాష్ట్రంలో మడికట్టుకొంటే మొదటికే మోసం వస్తుంది. జగన్ లాంటి వారి చేతుల్లో రాష్ట్రం పడితే, హైదరాబాదులో ఆస్తులు వేలం వేసి జలయజ్ఞం లాంటి పనుల పేరు చెప్పి ఆ మొత్తాన్ని పనులు చేయకుండా తినేసిన వైఎస్ లా, ఆంధ్రా ఆస్తులకు కూడా ఎసురుపెట్టడానికి జగన్ సంకోచించడు. అదే జరిగితే కరడు గట్టిన ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్, ఆంధ్రానే కర్పూర హారతి ఇచ్చేస్తాడు.

కాబట్టి భరించక తప్పదు. ఆంధ్రాని సమాంతరంగా అభివృద్ధి చేసుకుపోక తప్పదు అని సర్దిచెప్పుకోవాల్సిందే. …చాకిరేవు.

ప్రకటనలు

ట్విటర్ కబుర్లు

  • ఆంధ్రాకి ఏమిస్తే అది మాగ్గావాలె అనండం తప్ప విభజన చట్టం చదివి తెలంగాణాకు ఏమి రావాలో కైపులో లేకుండా ఎప్పుడన్నా అడి… twitter.com/i/web/status/1… 14 hours ago

వీక్షణలు

  • 879,786

తడి ఆరని ఉతుకులు

జనవరి 2019
సో మం బు గు శు
« డిసెం    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: