గౌరవ మంత్రి వర్యులు శ్రీ బొత్సా సత్యనారాయణ గారికి,

గౌరవ మంత్రి వర్యులు శ్రీ బొత్సా సత్యనారాయణ గారికి,

వైఎస్సార్ ప్రభుత్వంలో మీరు బొంబాయి కబుర్లు చెప్పేవారు వోక్స్ వాగన్ వస్తోంది అని. అంతలోనే అపరిచితుడు సినిమాలోలా బోరుమనేవారు సొమ్ములు పోనాయి అని. మీరు అప్పుడు అర్థం అయ్యేవారు కాదు.

తరువాత ఆయన పోయాక మీరు వైఎస్ గురించి చెబుతూ బ్రాందీ లేనిది ఆయన నిద్రపోయేవారు కాదని చెప్పేవారు. అంటే వాంతి చేసుకోక ముందు ప్రక్కనే వుండి, ఆయన చెప్పింది విని, వోక్స్ వాగన్ వస్తోంది అని వాగి, తరువాత పోయింది అని వాగేవారని అర్థం చేసుకోలేకపోయాం.

ఇప్పుడు బొంబాయి కబుర్లు బొత్తిగా ఆపేసి, వరుసగా అమరావతి గురించి రోజు రోజుకూ అవాకులూ చవాకులు మాట్లాడుతున్నారు. తాజాగా అమరావతి చిరునామా కనిపించడం లేదని గెజిట్ ఎక్కడని ఘొల్లుమంటున్నారు.

గెజిట్ జీఓ ప్రభుత్వం దగ్గరే వుంది. అడగండి అధికారులను, కాపీ ఇస్తారు. నీకు ఇది ఎక్కడ వుందో చెప్పడానికి కూడా చంద్రబాబు కావాలా?

అన్ని విభాగాలు అమరావతిలో వున్నాయి కదా. ఇక్కడ లేనిది, ఉమ్మడి రాజధాని నుండి రానిది ఏముంది, ఒక్క సిబిఐ కార్యాలయం & కోర్టు తప్ప.

మీ తాజా నాయకుడు జగన్ రెడ్డి, ఏ దేశానికి ప్రయాణం పెట్టుకొన్నా అక్కడి నుండి పర్మిషన్ తెచ్చుకొంటాడాని, శుక్రవారం సెలవు కావాలన్నా లీవు లెటర్ అక్కడికే పంపుతాడాని, నాంపల్లి సిబిఐ కోర్టును మన అధికార రాజధాని సచివాలయం అని అనుకొంటున్నారా.

ఇన్నేళ్లుగా ప్రమాణస్వీకారాలు, పాలన, ప్రధాని వచ్చి శాంఖూస్థాపన, సభలు జరిగింది అడ్రస్ లేని అమరావతిలోనే అని మీకు కనిపించలేదా. మీకు కనిపించక రోజూ మిమ్మల్ని చెరో వైపు ఎవరన్నా నడిపించుకొని వచ్చి మనం అమరావతిలో వుంటున్నామని చెప్పడం లేదా?

అయినా దేశంలో రాజధాని లేకుండా విభజనా అని అనడానికి కాంగ్రెస్ లో మంత్రిగా నాలుక మందం చేసిందా?

100 రోజులలో జగన్ ఎన్నో పందేరం చేశారని పొగిడి అలసిపోతున్నావు. ఈ నూరు రోజుల్లో అమరావతి గురించి నోరు తెరవని ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పారు. మీకు చెవుడు లేదు కదా. అమరావతి విషయంలో జగన్ రెడ్డి గారు ఎందుకు మూగలా నటిస్తున్నాడో అడగవచ్చు కదా. సచివాలయంలో మీ ప్రక్కనే ఆయన కార్యాలయంలోకి అనుమతిలేదా, లేదా ఎవరూ మిమ్మల్ని చెరో రెక్కా పట్టుకొని తీసుకుపోవడం లేదా?

హాన్స్ ఇండియా వాళ్ళు ఆర్టీఐ ద్వారా మీ బండారం బయటపెట్టారు చూడండి. అమరావతికి అప్పిచ్చే విషయంలో ప్రపంచ బ్యాంకు సంప్రదించినా కేంద్రం ఎన్నిసార్లు లేఖలు వ్రాసినా మీ ప్రభుత్వం స్పందించలేదని. మీ సభానాయకుడు సభలో సెలవిచ్చిన బాషలో చెప్పాలంటే, స్పందించాల్సిన మీ అందరూ గాడిదలు కాశారా.

మీ కపట నాటక కుట్రలు అప్పుడే పగలడం మొదలయ్యింది.

అమరావతి విషయంలో ఓ వైపు ఆయన మౌనం, మరో వైపు నువ్వు నోటికొచ్చింది పేలడం ధర్మం గమనిస్తోంది. దానికి దయ వుండదు. నిర్దాక్షిణ్యంగా అది మీ ప్రభుత్వాన్ని కాలరాస్తుంది. ఇప్పటికే అనుభవించినా ఇంకా అదే కుట్రలంటే ప్రజలు అసహాయులు అవ్వొచ్చు, వ్యవస్థ ఆలస్యం చెయ్యచ్చు, కానీ ధర్మం సమయం ఇవ్వదు.

ఎందుకంటే ఈ ఆంధ్రా, చరిత్ర పుటలకంటే ప్రాచీనమైంది. పురాణాలలో కూడా దీని ప్రస్తావన వుంది. శ్రీశైల శక్తి స్థలం, ప్రమాణాల కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారు, దక్షిణ కాశీ కాళహస్తి ఈశ్వరుడు, దుర్గమ్మ, పానకాల స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, మంగళగిరి, కదిరి, కర్నూలు, సింహాచలం & అంతర్వేదిలలో వెలసిన నరసింహ స్వాములు, ద్రాక్షరామాలు ఇలా ఎంతో మంది దేవతల ఆవాసాలు పుణ్య గడ్డ ఆంధ్రా. ప్రకృతి మాత పరవళ్లు త్రోక్కే నదులతో, నల్లమల గట్రా అడవుల ఆలవాలయం.

అధర్మం ఆవాలిస్తూనే వుంటే ధర్మం ఎలా నెలకొల్పాలో ప్రకృతి చూసుకొంటుంది. మన వికటాట్ట పరిహాసాలలో నిశ్శబ్దంగా వచ్చే దాని జాడ తెలియక పోవచ్చు. తస్మాత్ జాగ్రత్త. ..చాకిరేవు.

ప్రకటనలు

వీక్షణలు

  • 916,932

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2019
సో మం బు గు శు
« ఆగ    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: