ఫిబ్రవరి 18th, 2021ను భద్రపఱచు

శభాష్ పెద్దిరెడ్డి, అభినందనలు.

శభాష్ పెద్దిరెడ్డి, అభినందనలు.

నీకున్న కేంద్ర బిజెపి అండ (వారి చేత పంపబడిన గత ఇసి అధికారి గోపాల క్రిష్ణ నీ శాఖలో అధికారి), జగన్ రెడ్డి తరహా పాలనా బలగం, మీ కంపెనీకి వస్తున్న కాంట్రాక్టులతో కొదవలేని డబ్బులు, ఎక్కడికక్కడ ఇసుక డంపుల సామంతులతో సమన్వయం.. అటు శత్రువు చూస్తే.. అభ్యర్థి పెడితే పెట్టుకొన్నట్లు, లేదంటే నయ్యాపైసా విదల్చలేని ధైన్యం. ప్రతి ఊరిలో సిమెంటు రోడ్ల నుండి పనులు చేసి, ఆ డబ్బులు రాక, వస్తుందనే ఆశలు వదిలేసి, నిర్వేదంలో వున్న శత్రు పార్టీ శిబిరాలు.

నీ తడాఖా & ప్రతాపం చూపి, నాయుడి ఇలాకా కుప్పంలో ఆ పార్టీని కంగుతినిపించావనే పేరుతో అటు ప్రస్తుత మీ పార్టీ వైకాపాలో & ఢిల్లీలో మీ అబ్బాయి తోడుగా వస్తే గాని మీ పార్టీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వని కేంద్ర బిజెపిలో ఆనందోత్సవాలను నింపావు.

మీ లక్ష్యం ఏమిటో మీ నియోజకవర్గం & మీ జిల్లాలే కాకుండా, కడపలో వైకాపా కార్యకర్తలను కదిపినా.. కాబోయే సిఎం పెద్ది రెడ్డి అని చెబుతారు.

తాజాగా మీ జిల్లా మంత్రి & రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ “జగనన్న తరహాలోనే ప్రజలు పెద్దిరెడ్డిని ప్రేమిస్తునారు. జగనన్న ఓసారి ప్రధాని కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా..” అని అన్నారు. మీరు సిఎం కావాలని అని కూడా చెప్పేవారే, కానీ గొంతులో దిగమింగుకొన్నారు.

మీరు మీ లక్ష్యం చెప్పకపోయినా.. మీ అభిమానుల నోట నుండి తన్నుకు వస్తోంది.

మీరు కూడా సీమ నుండి సిఎంలైన వైఎస్సార్, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి సమకాళీకులే. వారిలా మీ ప్రయత్నం ఫలించాలని ఆశించడంలో తప్పులేదు.

ఇప్పుడు ఇలా చర్చ జరగకముందే అప్పట్లో మీరు సిఎం అవ్వాలని అదే కుప్పం నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పోటీగా పాదాయాత్ర చేశారు. కుప్పం నుండి పెద్ది రెడ్డి పోటీ పాదయాత్ర అనేది అప్పట్లో సంచలనం అయ్యింది. మీ పార్టీలో పెద్ద దుమారమే రేగింది. అప్పుడే మీరు వైఎస్సార్ చేత దూరంగా పెట్టబడ్డారు.

తన లక్ష్యం అయిన సిఎం పదవి కోసం, అసంతృప్తి వాదం వినిపించి వినిపించి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అప్పటి రెడ్డి సిఎంల మార్పుకు కారణం అయ్యాడు. తన తోటి స్నేహితుడు చంద్రబాబు కూడా సిఎం అయిపొయాడని, మళ్లీ రెండోసారి కూడా సిఎం అయ్యాడు, ఇక 20 ఏళ్లు చంద్రబాబు ఆ పదవి నుండి దిగడు అని తన సెక్యూరిటీ గార్డుల దగ్గర కూడా వాపోయేవారు వైఎస్సార్.

తాను ఒళ్లువంచకపోతే ఈ జన్మలో ఇక కుదరని పని అని, ఆంధ్రాలో మొట్టమొదటి సుధీర్ఘ పాదయాత్రను, తన మీద నమ్మకం లేక, జనంలో నమ్మకం కలిగించడానికి మొదలెట్టాడు.

ఆ సమయంలో మీరు పోటీపడ్డారు. కేంద్ర కాంగ్రెస్స్ అధిష్టానం ఏమి చెప్పిందో, మిమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు.

మీ జిల్లా నుండి నాయుడికి గురువులు & శత్రువులులా పోటీపడిన రాజకీయ కుటుంబాల నుండి గల్లా అరుణకుమారిని మంత్రి చెయ్యడమే కాకుండా, కడప ఇంచార్జ్ బాధ్యతలు కూడా ఇస్తూ, మీ వైరి రాజకీయ కుటుంబం నుండి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చి విప్ పదవి ఇచ్చి, సభాపతి వరకు ఎదిగేలా చేసి, తన కుమారునికి రాజకీయ ఆరోపణా ఇబ్బందులు వచ్చినప్పుడల్లా కాపాడే బాధ్యత ఇచ్చారు వైఎస్సార్.

మిమ్మల్ని మాత్రం అస్సలు పట్టించుకోలేదు.

కానీ అంతకు ముందు నాయుడు ప్రభుత్వంలో నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు వద్దకు కూడా మొహమాటలేకుండా వెళ్లి మీరు కలిసేవారు. నాయుడు కూడా మిమ్మల్ని చూసీ చూడనట్లు వదిలేశారు.

మీ వైరి కుటుంబం నుండి నల్లారి కిరణ కుమార్ రెడ్డికి సిఎం పదవి ఇచ్చే సరికి, తనకు రావాల్సింది అలా ఇస్తారా అని మండిపడిన జగన్ రెడ్డితో జోడీ కుదిరింది. అక్కడ కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆయన అండ సంపాయించారు. బిజెపితో చెలిమి కుదిరి, అప్పటి ఆంధ్రా ఇసి గోపాల క్రిష్ణ వద్దకు మీ అబ్బాయిని పంపినా కలిసే సహకారం కుదిరింది. జగన్ రెడ్డి సిఎం అయ్యారు. మీరు నాయుడు గారి అబ్బాయి లోకేశ్ నిర్వహించిన పంచాయితీ రాజ్ శాఖ తీసుకొని, శత్రు పార్టీ నాయకులకు రావాల్సిన బిల్లులు ఆపేశారు. కానీ లోకేశ్ లా పనులు చెయ్యడంలో చేతల్లో చూపలేకపోయారనే పేరు వచ్చింది. పైగా వేలాదిగా నాయుడు అధికారంలో వుండగా కట్టిన భవనాలకు వైకాపా రంగులు వేసి & జగన్ రెడ్డి బొమ్మలు చిత్రీకరించి నవ్వుల పాలు చేసి, కోర్టు వివాదాలకు కారణం అయ్యి, ఇసి చెప్పినా & కోర్టులు చెప్పినా వెయ్యడం మానలేని పంతాలకు పోయారు.

ఆఖరికి ఈ ఎన్నికల్లో ఇసి తప్పించిన అధికారులకు మంచి మంచి పోస్టులు ఇప్పించి, ఇసి మాటలు వినే అధికారులకు ఇబ్బందులు తప్పవని బహిరంగంగా బెదిరించి, ఇసి హౌసె అరెస్ట్ మీద కోర్టుకు వెళ్లి, మీడియాతో మాట్లాడకూడదు అనే వరకు పరిమితం చేసుకొని, పనిగట్టుకొని మీరు అప్పట్లో మొదలెట్టిన కుప్పాన్ని ఎంచుకొని, మీ విశ్వరూపాన్ని చాటారు వైకాపాకు & బిజెపికి.

ఇక తరువాయి సంభవించే రాజకీయ పరిణామాలలో మీ స్థానం ఏమిటో సత్తా చాటుకొన్నారు. కానీ బిజెపి ఎప్పుడు ఎలా చేస్తుందో ఎవరికీ తెలియదు. అందకపోతే నాయుడి చెయ్యిని మోడీ లాగి కుర్చీలో కూర్చోపెడతాడు, అందితే ఆయనకు జాతీయ స్థాయిలో పోటీ వున్నాడనే అక్కసుతో నాయుడిని ఎంత కుదించాలో ఆలోచిస్తారు.

మోడీ మిత్రుడు ట్రంప్ దిగి బైడన్ రాంగానే బిజెపిలో కలవరం మొదలయ్యింది. కరోనా రాకను ఎవరూ ఊహించలేదు. అన్నదాతల ఉద్యమాన్ని అహంకారంతో కుర్చీ క్రిందకు తెచ్చుకొన్నారు. రాబోయే రోజుల్లో, జనం దారిద్యానికి తోడు ఏ ఉద్యమాలు వస్తాయో, ఎవరు తెరమీదకు వస్తారో.. ఎదురుగాలి వీస్తే.. అప్పుడు బిజెపి మళ్లీ ఎలా మిత్రులను చేరదీస్తుందో తెలియదు. వైకాపాలో షర్మిల తెలంగాణాకు మళ్లడం మీకు & బిజెపికి లాభించేదే. కానీ తన ఇమేజ్ బిల్డింగ్ కోసం విజయ సాయి రెడ్డి, తెలంగాణా ప్రొఫెషర్ ను తన మనుషులతో మాట్లాడించారని చెప్పారు. కుటుంబం నుండి భార్యను పెడుతారు అనే చర్చలు ఎన్నో ఊహాగానాలు జరుగుతున్నాయి. కొన్ని కేసుల తాలూఖూ వాటికి యజమానిగా వుంది ఆవిడ. శశికళ అన్న భార్య ఇలవరసి కుట్రలో పాలుపంచుకోకపోయినా కొన్ని ఆస్తులు ఆమె పేరున వున్నాయని కోర్టు ఆవిడకు శిక్ష వేసింది. ఇవన్నీ బిజెపి సర్కిల్స్ లో మాట్లాడుతూ వుంటారు. మీరూ విని ఆనందిస్తూ వుంటారు.

మీకు ప్రస్తుతానికి అడ్డంకులు లేవు. కానీ తనకు వస్తుంది అనుకొన్న పదవి కాంగ్రెస్స్ జగన్ రెడ్డికి ఇవ్వనట్లు ఏమన్నా జరగవచ్చు, రాజకీయాలలో. మీ వైరి వర్గం నల్లారి కుటుంబంలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో మళ్లీ కర్చీఫ్ వేశారు. ఆయన తమ్ముడు టిడిపిలో వున్నారు. మీరు బిజెపికి పావుగా వున్నారు. బిజెపి వున్నంతవరకు ప్రస్తుతానికి మీకు ఇబ్బందులు లేవు. తరువాత ఏమిటి అనేది కాలం చెప్పాలి.

మీరు సాటి రాజకీయ నాయకులకు సౌమ్యుడిగా కంపిస్తారు గాని ఇటీవల ఇసి మీద మాటలతో ఆ పేరు పోయింది. మీ ఇలాకాలో పాలు ఎవరికి పొయ్యాలి, మామిడికాయలు ఏ మండీకి తోలాలి అనేది కూడా మీ అనుచరుల కనుసన్నలలో జరుగుతుంది అనే విషయం రాష్ట్రానికి తెలియదు.

మీరు ఆంధ్రా బిజెపి అధ్యక్షుడిగా అవ్వవచ్చు. రాజకీయాలలో పెద్ద ఆశ్చర్యపోనక్కరలేదు. వైఎస్సార్ మిత్రులు జగన్ రెడ్డికి దూరం అవుతామని ఆయన శత్రువైన మీరు ఆంతరంగిక మిత్రుడిగా మారతారని రాజకీయాలలో ఎవరు ఊహించారు.

నాయుడు చంద్రగిరిలో ఓడిపోయారు. కానీ ఆ ఓటమి ఆయన సిఎం పదవికి అడ్డంకిగా మారలేదు. కుప్పంలో ఆయన పార్టీ సర్పంచ్ అభ్యర్థుల ఓటమి నాయుడి రాజకీయ ఏమరుపాటు & వైఫల్యం. కానీ ఆంధ్రా అంతటా 151 స్థానాలకు తగ్గ గెలుపు వైకాపాకు రాలేదు. టిడిపి పుంజుకొంది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, నాయకుల సొంత గ్రామాల్లో & వారి బంధువులను నిలబెట్టినా ఓటమిని మూటగట్టుకొన్నారు. సరిగ్గా 20 నెలలు కాకుండానే ఐస్ క్రీం లా కరిగిపోతోంది వైకాపా ఊహలు & ఆశల సౌధాలు. నెల్లూరు, కడప, కర్నూలులో టిడిపి గెలుపుగాని, ఒక్క సీటు ఇచ్చిన మీ చిత్తూరు జిల్లాలో ఆ పార్టీ పుంజుకొన్న బలం గాని వైకాపాకు మంచిది కాదు. కుప్పం గెలుపు మాత్రం మీకు వ్యక్తిగతంగా టానిక్ లాంటిది. #చాకిరేవు


వీక్షణలు

  • 966,902

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2021
సో మం బు గు శు
1234567
891011121314
15161718192021
22232425262728

నెలవారీ ఉతికినవి