బ్లాక్ చైన్ ను వాడుతున్న మొదటి రాష్ట్రం మనది

బ్లాక్ చైన్ ను వాడుతున్న మొదటి రాష్ట్రం మనది

90% పైగా ఐటి లో వున్న వాళ్లకే
బ్లాక్ చైన్ అంటే ఏమిటో తెలియదు

క్రిప్టో కరెన్సీ
బిట్ కాయిన్ థోరియం ల గురించి
అప్పుడప్పుడూ వినడం తప్పించి

అలాంటిది దేశం లో మన రాష్ట్రం
అమలు చెయ్యడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది

పెద్ద ఎత్తున ఆ టెక్నాలజీ లో
ఐ టి పరిశ్రమలకు కేంద్రంగా
విశాఖను మలుస్తోంది

అసలు బ్లాక్ చైన్ అంటే ఏమిటి

ఓ పరిశ్రమ పెట్టుకోడానికో
ఓ సినిమా తియ్యడానికో
సహాయం తీసుకోడానికి
ఈ మధ్య క్రౌడ్ ఫండింగ్
వాడుకోవడం అందరికీ తెలుసు

బ్లాక్ చైన్ మీద పెట్టుబడులకోసం
పెట్టే కంపెనీల మీద

క్రిప్టో కరెన్సీలో
ఐ సి ఒ లు వస్తున్నాయి

20 నుండి 30 నిమిషాల్లో
వందల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని తెలుసా?

వాటి ప్రభంజనాన్ని తట్టుకోలేక
చైనా ఏకంగా ఐ సి ఒ లను నిషేధిస్తోంది

ఈ క్రిప్టో కరెన్సీలతో
ప్రపంచ హద్దులు చెరిగిపోతున్నాయి

ఓ వ్యక్తి ప్రపంచంలో ఇంకో వ్యక్తితో
ఓ ఒప్పందానికి నగదు పంపిణీ చెయ్యాలి అంటే
మూడో వ్యక్తి సంస్థ ప్రమేయం తప్పని సరి ప్రస్తుతం
అదే బ్యాంకులు మధ్యవర్తిగా వున్నాయి

ఈ క్రిప్టో కరెన్సీలో
మనిషితో మనిషి ఎల్లలు దాటి
నేరుగా పంపిణీ చేసుకోవచ్చు

అసలు ఒక ఐ సి ఒ లో పెట్టుబడులు పెట్టాలి అంటే
అంత సులభం కాదు మన ఐ పి ఒ ల లోలా
20 లేదా 30 నిమిషాలలో అయిపోతోంది

కాని వీటిలో కూడా కొన్ని మోసాలు
జరుగుతున్నాయి కాని టెక్నాలజీ మాత్రం
అద్భుతం ఇప్పుడిప్పుడే కొన్ని ప్రభుత్వాలు
బ్యాంకులు విదేశీ టెక్నాలజీ సంస్థలు
పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్నాయి
కొన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి

అసలు బ్లాక్ టెక్నాలజీ అంటే ఏమిటి అంటే

ఉదాహరణకు ఈ మధ్య విశాఖ లో
భూముల రికార్డ్ లు తుఫానుకు కొట్టుకు పోయాయి
కనిపించడం లేదు అని
చాలా మంది వాళ్ల నకిలీ పత్రలతో కొట్టేయడానికి
ప్రయత్నించడం మనకు తెలిసిందే

అంటే ఒక సెంట్రల్ సెర్వర్ లో
లేదా ఒక చోట ఇవున్నాయి కాబట్టి అలా అయ్యింది

కాని బ్లాక్ చైన్ లో
పదుల నుండి లక్షల స్థానాల్లో
బ్లాక్ చైన్ మైనర్లు వుంటారు
ఎక్కడ ఒక నగదు పంపిణీ జరిగినా
అన్ని రిజిస్టర్ల లో నమోదు అవుతాయి
టెక్నాలజీ సాయంతో పూర్తి ఎంక్రిప్షన్ తో
పబ్లిక్ ప్రైవేటు కీల తో

మన దగ్గర బిట్ కాయిన్ కరెన్సీ వుంది అనుకొందాం
అది వేరే వాళ్లకు పంపాలి అంటే కీ వుండాలి మనదగ్గర

ల్యాండ్ రిజిష్ట్రేషన్ లు నేరాలు ప్రతిదీ
బ్లాక్ చైన్ లో నమోదు అయితే
అవి ప్రతి ప్రాంతం లో వుంటాయి
ఎక్కడో ఓ చోట చెరిపినా చెరిగిపోవు

నియంత్రణో మార్పిడీనో చెయ్యడానికి
ఒక్క చోట వుండదు
ప్రతిదీ టెక్నాలజీ సాయంతో
పబ్లిక్ మరియు ప్రైవేటు కీ తో చెయ్యాల్సిందే

ఎవ్వరూ ఏమి చెయ్యలేరు
అందుకే ఈ టెక్నాలజీ పై
భారీ ఎత్తున మొగ్గు చూపుతున్నాయి
ప్రపంచ దేశాలు

చాలా అంకుర పరిశ్రమలు వస్తున్నాయి
వీటి మీద పెద్ద ఎత్తున

ఆశ్చర్యంగా మన విశాఖ
కేంద్ర అవ్వడం ఒక అబ్బురం

మన పాలకుల ముందు చూపు అమోఘం
ఫిన్ టెక్ తో పాటు ఈ బ్లాక్ చైన్ తోడై
మన ప్రభుత్వం కూడా ఆధార్ పైన
ఈ అప్లికేషన్లు చెయ్యించి
పాలనలో వాడితే

ప్రభుత్వ అధికారుల లంచాల బెడద నుండి
ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకుల
దోపిడీల వరకు చాలా అరికట్టవచ్చు
ఆన్లైన్ మోసాలు కూడా పోతాయి

ఇప్పుడిప్పుడే మన భారత ప్రభుత్వం
ఓ కమిటీ వేసి వీటి మీద విధి విధానాలు
నియంత్రణలు చెయ్యడానికి ప్రయత్నిస్తోంది

కాని మన రాష్ట్రం దాని మీద
సంవత్సరం ముందే శ్రద్ద పెట్టి
ప్రణాళికల స్థాయి దాటి
ఆచరణకు ప్రయత్నిస్తోంది ….చాకిరేవు

0 స్పందనలు to “బ్లాక్ చైన్ ను వాడుతున్న మొదటి రాష్ట్రం మనది”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,911

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2017
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

నెలవారీ ఉతికినవి