పెద్ది రెడ్డి గారిని బర్తరఫ్ చెయ్యండి

పెద్ది రెడ్డి గారిని బర్తరఫ్ చెయ్యండి

సౌమ్యుడనే ముసుగు ఇన్నాళ్లు. అధికారం వచ్చాక ఆయనలోని రెడ్డి అహంకారం బుసలు కొట్టింది. అదే జిల్లా దళిత జడ్జీని ఏకవచనంతో వాడూ వీడు అనండం మొదలు తనలోని అహంకారాన్ని పరిచయం చేశారు పెద్ది రెడ్డి. ఆ జడ్జీ గారి మీద ఆయన సోదరుడి మీద దాడులకు ఎన్ని రాజకీయ కారణాలు చెప్పినా జనానికి ఆయన నైజం ఏమిటో అర్థం అయ్యింది.

తాజాగా నిన్న మీడియా పాయింట్లో, తన చిత్తూరు జిల్లా వ్యక్తి, తనకన్నా మూడేళ్లు పెద్ద మనిషి, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి & ఎక్సైజ్ శాఖా మంత్రి, అట్టడుగు దళిత కులంలో పుట్టి, జగన్ రెడ్డి పుట్టిన ఏడాదిలోనే బిఎస్సీ డిగ్రీని పూర్తి చేసి, కుతూహలమ్మ లాంటి సీనియర్ వ్యక్తి మీద గెలిచి, రాజకీయాలలో ఓ స్థానం సంపాయించిన కె నారాయణ స్వామి గారిని, సాటి మంత్రుల సమక్షంలో, మీడియా జర్నలిస్టుల సమక్షంలో “బుద్దీ జ్ఞానం లేదా, డెప్యూటీ సిఎం” అంటూ తిట్టిపోశారు.

అదే సమయంలో “సిఎం గారిని” అని తన కంటే చిన్న వాడైన జగన్ ని గౌరవించారు. వైఎస్సార్ కు సమాంతరంగా కుప్పం నుండి పోటీ పాదయాత్ర చేసి, ప్రక్కన పెట్టబడి మంత్రి పదవికి నోచుకోక, జగన్ హయాంలో పంచాయితీ రాజ్ శాఖా మంత్రిగా నియమింపబడిన పెద్ది రెడ్డి గారిని అప్పటికీ రండి సార్ మీరు రండి సార్ అని ఎంతో గౌరవంగా నారాయణ స్వామి గారు ఆహ్వానించినా ఈయన ఇలా ప్రవర్తించండం కచ్చితంగా దళితుల మనోభావాలను & ఆత్మ గౌరవాన్ని కించపరిచేదే.

పెద్ది రెడ్డి చిత్తూరు జిల్లాలో కాని, జగన్ రెడ్డి కడప జిల్లాలో కాని, జగన్ జైలుకు వెళితే పెద్ది రెడ్డి సిఎం అనే ప్రచారం వైకాపా పార్టీ వర్గాలలోనే బలంగా జరుగుతోంది.

రోజుకో బ్రాండ్ మాటున, విపరీతమైన రేట్లు పెట్టి నారాయణ స్వామి శాఖ ద్వారా ఆయనకు చెడ్డపేరు వచ్చేలా శాసిస్తూ.. ఇంకా ఇలా పబ్లిక్ గా అందరి ముందూ అవమానించడం కొత్త ఏఈ కాదూ. గతంలో తిరుపతి పర్యటనలో పెద్ది రెడ్డి, సుబ్బా రెడ్డి జగన్ రెడ్డి వేదిక మీద కూర్చొని, వెనుక ఉపముఖ్యమంత్రి అయినా నారాయణ స్వామిని నిలబెట్టారు. రోజా గారి నియోజక వర్గంలో మంత్రిగా పర్యటించినా, ఆవిడ వర్గాలతో అవమానాలు పాలయ్యారు, “ఎవరిని అడిగి మా నియోజకవర్గంలో అడుగు పెట్టారని”.

అయినా పెద్ది రెడ్డి గారు తన శాఖ ద్వారా ఇంతకు ముందు కట్టిన భవనాలకు, అద్దె భవనాలకు వైకాపా రంగులు వేయించి కోర్టుల ద్వారా వైకాపా పాలనకు మొటిక్కాయలు వెయ్యించి, మళ్లీ రంగులు వేయించారు. ఆ ఇసుక మీద నిత్యం కొత్త విధానం అని వైకాపా పార్టీని జనం చేత అసహ్యించుకోబడేలా చేశారు.

ముందు ప్రభుత్వ పాలనలో కాంట్రాక్టర్లకు బాకీలు చెల్లించకుండా ఏడిపిస్తూ, పంచాయితీ రాజ్ శాఖ ఇంజినీర్లతో, అవినీతి జరిగిందని నివేదికలు ఇవ్వండని ఒత్తిడి తెస్తున్నట్లు ఆ సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

అదే శాఖను నిర్వహించిన అతి పిన్న వయస్కుడు, అనుభవం లేని లోకేశ్ పంచాయితీ రాజ్ శాఖకు జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో అవార్డులు సాధించి పెడితే, ఆ శాఖను అధ్వాన్నంగా నిర్వహిస్తూ, చేతగాని పనులు చేస్తూ, పార్టీని భ్రస్టు పట్టిస్తూ, అట్టడుగు కులాలలో ఉన్నత స్థానంలో వున్న వారిని అడుగడుగునా పదే పదే అవమానిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నాడు.

ఇలాంటి వ్యక్తిని మంత్రిగా జగన్ భరించవచ్చు. ఆయన పార్టీకి ఆర్థికంగా ఎన్నికల సమయంలో సాయం చేసి వుండవచ్చు. కానీ ఇలాంటి వారిని కొనసాగిస్తే వైకాపా నామరూపాలు లేకుండా పోతుంది. గుంటూరు జిల్లాలోని ఎమ్మెల్యే ఆడియో టేపులలో “మన దళితులను కుక్కల్లా చూస్తున్నారని, గొడవలు పెట్టి అణగదొక్కుతున్నారని” చేసిన ఆరోపణలు నిజమని నమ్మేలా.. ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోక పోతే, కేవలం అహంకారపు రెడ్ల పార్టీగా చరిత్రలో మిగిలిపోక తప్పదు. #చాకిరేవు.

0 Responses to “పెద్ది రెడ్డి గారిని బర్తరఫ్ చెయ్యండి”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • తిరుపతిలో దుబ్బాక డ్రామా రోజా గారితో అరంగేట్రం చేయించారా? https://t.co/DPcsH6Qmvk 37 minutes ago

వీక్షణలు

  • 952,126

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2020
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: