నిశ్శబ్దమైన “బాత్ బీహారీ కి” కేక మోడీ గారి కోసమా?

నిశ్శబ్దమైన “బాత్ బీహారీ కి” కేక మోడీ గారి కోసమా?

జేడీయుకి ఉపాధ్యక్షుడు అయ్యాక, నితీశ్ కుమార్ తరువాత ప్రశాంత్ కిశోర్ అనే ప్రచారం జరగడంతో, జేడియూ ఝలక్ ఇచ్చింది ప్రశాంత కి. అవమాన భారంతో, బెంగాల్ కు పరిమితం అయ్యాడు.

అయినా ఈ ఏడాది ఫిబ్రవరిలో బీహారీ ప్రేమికుడి లెక్క, “బాత్ బీహారీ కి” కేక పెట్టాడు. పిమ్మట ఆ కేకకు భయం పుట్టేలా నిశ్శబ్దం.

ఇటీవల మరణించిన పాశ్వాన్ గారి తరువాత, ఆయన కుమారుడు చిరాగ్ వెనుక అమిత్ షా గారి అండ వుంది. అందువల్లా యువకుడైన చిరాగ్ జగన్ మాదిరిగా తన ఎండీయే పక్షమే అయిన జేడియు నితీశ్ మీద విరుచుకు పడుతూ, మోడీ తరహా అభివృద్ధి అనే నినాదంతో బీహార్లో జేడీయు పోటీ చేశే స్థానాల్లో పోటీ చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

చిరాగ్ వెనుక నిశ్శబ్దంగా తెరవెనుక ప్రశాంత్ కిశోర్ మంత్రాంగం వుందని జేడియూ వర్గాలు ప్రచారం మొదలెట్టాయి.

అంటే చిరాగ్ వెనుక అమిత్ షా నా లేదా ప్రశాంత్ కిశోరా అని ఆలోచిస్తే ఇద్దరూ వున్నారేమో అనిపిస్తుంది.

మోడీ స్థానానికి దేశంలో పోటీ వచ్చేలా పేర్లు వినిపించే నాయకులు కేజ్రీవాల్, చంద్రబాబు, మమతా బెనర్జీ, నితీష్ కుమార్ ప్రథమంగా వుంటారు. కాంగ్రెస్స్ ని దెబ్బ తీస్తూ వీరి జాబితాలో నుండి ఏ ఒక్కరి పేరు జాతీయ స్థాయిలో వినపడకూడదు అనే మంత్రాంగం నడుస్తోంది అని చెప్పుకోవచ్చు.

దానికి పావుగా ప్రశాంత్ కిశోర్ ని వాడుతున్నారా అనే అనుమానాలు వస్తోంది. బిజెపికి & మోడీ కి వ్యతిరేఖంగా ప్రశాంత్ కిశోర్ అని బహిరంగ శత్రుత్వం ప్రదర్శిస్తూ, అసలు అజెండా ప్రకారం ఆయా పార్టీల దగ్గరకు వారికి ప్రచారం చేసి పెట్టే నెపంతో వెళ్లడం, ఆ పార్టీల గుట్టుమట్లు తెలుసుకొని, ధీర్ఘకాలంలో నిదానంగా నిర్వీర్యం చెయ్యడం అనే వ్యూహం మొదలెట్టారా అని అనిపిస్తోంది అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరి టిడిపి కి ప్రశాంత్ చెయ్యలేదు కదా అంటే, మొదట టిడిపితో కాంట్రాక్ట్ వేస్తారనే ప్రచారం జరిగింది. కానీ తమ మీద అతి నమ్మకంతో భీష్మించుకొన్న వేళ వైకాపా అందుకొంది అని అంటారు.

మోడీ తరువాత ఆ స్థాయి పేరు ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఏ మీడియాలోనూ వినిపించడం లేదు.

ఆశ్చర్యంగా బిజెపిలో కూడా గడ్కరీ & యోగి ఆధిత్యనాథ్ పేర్లు వినిపించినా.. యోగి గారికి యుపిలో ఊపిరిసలపని జాతీయ స్థాయి వ్యతిరేఖ మీడియా ప్రచారం ఊపందుకొంది. గడ్కరీ గారు మాత్రం డౌన్ ప్లే చేస్తూ, తన శాఖ పరిధిలో మంచి పేరు తెచ్చుకొంటున్నారు. నాటి వాజ్ పేయి హయాంలో రహదారుల లెక్క గడ్కరీ గారు తన శాఖను వాడుతూ కష్టపడుతున్నారు.

కానీ మోడీ తరువాత, ఆ పదవి ఆశించే బిజెపి జాబితా నుండి ఏ ఎత్తులు వస్తాయో వేచి చూడాలి.

నిశ్శబ్దమైన “బాత్ బీహారీ కి” కేక మోడీ కోసమా? లేకా మోడీ గారి తరువాత మేమే అని వేచి వున్న వారికోసం కూడా కొనసాగుతుందా అనేది కాలం సమాధానం చెబుతుంది. #చాకిరేవు.

0 స్పందనలు to “నిశ్శబ్దమైన “బాత్ బీహారీ కి” కేక మోడీ గారి కోసమా?”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,920

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2020
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

నెలవారీ ఉతికినవి