ఆంధ్రా ఫైన్ లకు నా అభిప్రాయం ఫైన్

ఆంధ్రా ఫైన్ లకు నా అభిప్రాయం ఫైన్

వాహన యోగం అని రాశిఫలాల్లో లేదా జాతకంలో చదివినా జడుసుకొని దిగులుపడేలా, వాహన యజమానులు నిద్రలేని రాత్రులు అనుభవించేలా ఆంధ్రా నిర్ణయించిన ఫైన్ రేట్లు ఫైన్ గానే వున్నాయి.

తెరమీద భరత్ అనే సినిమాలో మహేష్ బాబు లా మాస్ లో హీరో అవుదాం అనో లేదా నవరత్నాలకు బకరాలుగా వాహన యజమానులను ఈ ఫైన్ లకు ఎంచుకొన్నట్లో అనిపించకూడదు.

నిజమే కొంత క్రమశిక్షణ జనానికి అలవాటు అవ్వవచ్చు. కానీ, పాలకులు ముందుగా ఆ విధానానికి తగ్గ ఏర్పాట్లు చేశారా?

వన్ వే బోర్డులు లేకుండా ఆపోజిట్లో వస్తే ప్రమాదకర డ్రైవింగ్ అని 10000 ఫైన్ వేస్తే ఎలా వుంటుంది?

భారీ ట్రాఫిక్ జాం ఏర్పడితే, మొబైల్ లో లేటవుతోంది అని చెబుతున్నప్పుడు 10000 ఫైన్ వేస్తే ఎలా వుంటుంది?

ఇసుకతోనో లేదా గ్రానైట్ తోనో ఓవర్లోడుతో వెళ్లే వాహనాలకు ఫైన్లు వేస్తున్నారా? కనీసం వేస్తారా? ఆ ధైర్యం చేస్తారా? అవి జనానికి కనిపించవా అని ఆలోచన చేశారా?

అధికార పార్టీ అండ చూసుకొని జరిమానా స్థలంలోనే బండి మీద నుండే మొబైల్లో ఫోన్లు కొట్టి బెదిరించే సంఘటనలు జరగకుండా నిష్పక్షపాతంగా అమలు చెయ్యగలరని మనస్పూర్తిగా భావిస్తున్నారా? నమ్ముతున్నారా?

ఇలా ఎన్నో సమస్యలు వుంటాయి. దానికి ముందు చట్టం & న్యాయం అంటే అధికార పార్టీకి గౌరవం వుందా అనే నైతికి ప్రశ్న ప్రజల్లో కలుగుతుంది. మేము తప్పు చేస్తే ఇన్ని జరినామాలు కడుతున్నప్పుడు, మమ్మల్ని పాలించే వారు తప్పు చేసారో లేదో కోర్టుల్లో ఎందుకు నిరూపించుకోవడం లేదు అని ఆలోచిస్తారు.

యథా రాజా తథా ప్రజ అంటారు. పాలించే వారు పారదర్శకంగా సినిమా తెరలోలా వుంటే జనం హర్షిస్తారు. లేదంటే అసహనం పెల్లుబుకుతుంది.

పీడించబడి వసూలు చేసుకొన్న డబ్బులు సక్రమంగా & పారదర్శకంగా దుర్వినియోగం కాకుండా ఖర్చు చేస్తున్నారా అని జనం ఆలోచిస్తారు.

అవతల రాష్ట్రం అంతా గుంతలు పూడ్చలేని దౌర్భాగ్యంలో ఇలాంటి నిర్ణయాలు హీరోను చేయవు. చరిత్రలో పన్నులతో పీక్కు తిన్న వారి సరసన నిలుపుతుంది.

అన్నీ పారదర్శకంగా & నిష్పక్షపాతంగా బావుంటే ప్రభుత్వ ఫైన్ లకు నా అభిప్రాయం ఫైన్. #చాకిరేవు

2 స్పందనలు to “ఆంధ్రా ఫైన్ లకు నా అభిప్రాయం ఫైన్”


  1. 1 Raj 7:45 సా. వద్ద అక్టోబర్ 21, 2020

    Oka statement ayina positive ga ichara jagan gurinchi and oka negitive comment ayina chesara cbn gurinchi…

    మెచ్చుకోండి

  2. 2 bonagiri 2:31 ఉద. వద్ద అక్టోబర్ 22, 2020

    ఫైన్లు ఎక్కువ అంటే అర్థం,
    బాగా బలిసిన వాళ్ళు, అడ్డంగా సంపాదించిన వాళ్ళు మాత్రమే తప్పులు చేయవచ్చనా?

    మెచ్చుకోండి


వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,917

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2020
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

నెలవారీ ఉతికినవి