బ్లూప్రింట్లు సిద్ధమయ్యే వేళ వేడెక్కిన రాజకీయం

రాష్ట్రపతి గారిచే నామినేట్ కాబడి, ప్రస్తుతం రాజ్య సభ సభ్యులుగా వున్న రంజన్ గొగాయ్ గారు, గతంలో తాను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదవి చేపట్టిన తొలిసారి, సొంతరాష్ట్రం అస్సాం రాజధాని గౌహతీ లో వున్న శక్తి పీఠం కామాఖ్యా ఆలాయానికి వస్తున్నారని ఆ రాష్ట్రానికి వర్తమానం అందింది. ప్రోటోకాల్ ప్రకారం భద్రత్రా ఏర్పాట్లు చెయ్యడం కోసం ముందస్తుగా ఆ సమాచారం పంపారు.

ఆయన ఆ ఆలయానికి విచ్చేసినప్పుడు, లోపల అస్సాం ముఖ్యమంత్రి గారు & అమిత్ షా గారు లోపల వున్నారు. వారితో పాటు బిజెపి కార్యకర్తలు వున్నారు.

రంజన్ గొగాయ్ గారు లోపలకి వెళ్లడానికి, అంతమంది మధ్యలో కొంత ఆలస్యం జరిగింది.

తరువాత గవర్నర్ గారికి అక్కడి భద్రతా ఏర్పాట్ల గురిచి ఫిర్యాధు వెళ్లింది. భద్రతా ఏర్పాట్ల లోపాలకు బాధ్యులను చేసి డిసిపి గారిని సస్పెండ్ చేశారు.

ఆ తరువాత కొంత కాలానికి రంజన్ గొగాయ్ గారి మీద ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించారు అని ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ చేసిన బెంచ్ తప్పుడు ఆరోపణలు అని కొట్టి వేసింది. రమణ గారు ఈ విచారణ బెంచి నుండి వైదొలిగారు. అంతకు ముందు బాబ్రీ మసీదు స్థలం కేసు బెంచీలో రమణ గారిని నియమించినా, అందులో నుండి కూడా వైదొలిగారు.

రంజన్ గొగాయ్ గారి పదవీ కాలం పూర్తవ్వగానే, రాజ్య సభ పదవి తీసుకొన్నందుకు రాజకీయ దుమారం జరిగింది. ఆయన అందుకు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకొన్నారు.

ఇటీవలే దేశ వ్యాప్తంగా వున్న ప్రజా ప్రతినిధుల కేసుల మీద, రాష్ట్ర హైకోర్టు జడ్జీల నుండి ఏడాది లోపు తేల్చాలనే కార్యాచరణ కోరుతూ ఆదేశాలు ఇచ్చారు, రమణ గారు.

ఈ సంఘటన నేపథ్యంలో, ఆయన మీద జగన్ గారు లేఖ వ్రాయడం, అందులోనూ వారం క్రితమే మోడీ గారిని ఆయన నివాసంలో కలవడం, దానికి కొన్ని రోజుల ముందు అమిత్ షా గారిని కలవడం మీడియాలో వచ్చినదే.

2021 ఏప్రిల్ 24 న చీఫ్ జస్టిస్ గా సీనియారిటీ జాబితాలో రమణ గారు వుండడం గమనార్హం. #చాకిరేవు

0 స్పందనలు to “బ్లూప్రింట్లు సిద్ధమయ్యే వేళ వేడెక్కిన రాజకీయం”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,933

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2020
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

నెలవారీ ఉతికినవి