చరిత్ర నుండి ఏమి నేర్చుకోకూడదో దానినే చరిత్ర నుండి నేర్చుకొన్నాం

“చరిత్ర నుండి ఏమి నేర్చుకోకూడదో దానినే చరిత్ర నుండి నేర్చుకొన్నాం” జర్మన్ ఫిలాసఫర్ జార్జ్ హెగెల్.

ఇప్పటిలా కంప్యూటర్లు లేవు. బ్యాంకింగ్ వ్యవస్థలోని చిన్నపాటి లోపాలను ఆసరాగా చేసుకొని, దేశంలో అతి పెద్ద ఆర్థిక కుంభకోణానికి హర్షద్ మెహతా పాల్పడ్డాడు”. విచారణ ముమ్మరం అయ్యే సరికి, రాంజెఠ్మలానీ సమక్షంలో కాంగ్రెస్స్ పార్టీకి కోటి విరాళంగా పి వి నరసింహారావు గారి పిఎ కి ఇచ్చాను. నన్ను పివి గారు ఆర్థిక అభివృద్ధికి కలిసి పనిచేద్దామని అభ్యర్థించారు అని ఆరోపణలు చేశారు.

దగ్గరుండి తన క్లైంట్ హర్షద్ మెహతాతో ఆ ఆరోపణలు చెయ్యించడమే కాకుండా, తను కూడా మీడియాతో అవే మాటలను పంచుకొన్నాడు.

తరువాత వాజపేయి ప్రభుత్వంలో న్యాయశాఖా మంత్రిగా పనిచేశారు రాంజెఠ్మలానీ గారు.

2001 నవంబర్ నెలలో మళ్లీ సిబిఐ ఇంకో చార్జ్ చీట్ పెట్టింది, 250 కోట్ల విలువైన తన షేర్లను అంతకు ముందు సెటిల్మెంట్లో చూపకుండా, తరువాత అమ్ముకొన్నాడని. వాస్తవంగా తన నమ్మకస్తుడు అమ్మేసుకొన్నాడు వాటిని.

డిసెంబర్ 21న స్పెషల్ కోర్టు బెయిల్ రద్దు చేసింది. 2002 జనవరి 4 వరకు రిమాండ్ అని థానే జైలు కు పంపారు. జైల్లో చాతీలో నొప్పి అని, ప్రభుత్వం ఆసుపత్రికి పంపారు.

అరేబియా సముద్రం కనిపించేలా 15000 అడుగుల ఇంటిలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లతో 80 నుండి 90 వరకు దశాబ్దం పాటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అమితాబచ్చన్ అని బిగ్ బుల్ అని ఏలిన మనిషి కొత్త ఏడాది 2002ను చూడకుండానే 2001 ఆఖరి రోజు డిసెంబర్ 31న .. కన్నుమూశాడని ప్రభుత్వ ఆసుపత్రిలో బెంచీ మీద పడుకోబెట్టారు.

సద్బ్రాహ్మానుణులైన పివి నరసింహా రావు గారి మీద, రాజకీయ ఆరోపణలకు వాడుకోబడిన హర్షద్ మెహతా, అదే రాజకీయంలో తన న్యాయవాదే న్యాయశాఖా మంత్రి అయినా రక్షించబడలేదు.

హర్షద్ మెహతాకు మించిన ఆర్థిక & అవినీతి కుంభకోణాల కేసుల విచారణలలో కదలిక వచ్చే వేళ, “చరిత్ర నుండి ఏమి నేర్చుకోకూడదో దానినే చరిత్ర నుండి నేర్చుకొన్నాం” అనే జర్మన్ ఫిలాసఫర్ కు మించి, ఏకంగా న్యాయవ్యవస్థ మీద దాడికి పూనుకోవడం వెనుక రాజకీయం వుండవచ్చు కాని అది కాపాడలేందు. ఈ దేశం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూనే, తర తరాల మహోన్నత న్యాయవ్యవస్థను నమ్ముతుంది & గౌరవిస్తుంది. #చాకిరేవు.

0 స్పందనలు to “చరిత్ర నుండి ఏమి నేర్చుకోకూడదో దానినే చరిత్ర నుండి నేర్చుకొన్నాం”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,913

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2020
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

నెలవారీ ఉతికినవి