ఢిష్యుం ఢిష్యుం రాజకీయ స్కిట్

నోటికి డ్రైఫ్రూట్స్ తినిపించుకొనే నుండి కాళేశ్వరం ప్రాజక్టు వద్ద కొబ్బరి కాయ కొట్టించుకోవడం వరకు, ఇరు తెలుగు రాష్ట్రాలూ వారి అన్యోన్యతను చూసి తరించాయి. ఇద్దరూ ఇంతవరకూ డిపిఆర్ అంటే డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లు ఇవ్వలేదు. కానీ నాటకాలు ఎందుకు?

ఇద్దరికీ పెద్దన్న పాత్రలో బిజెపి ఎందుకు దిగింది. ముగ్గురు మిత్రుల పనితీరుల్లో ఘోర వైఫల్యం కనిపించకుండా ముసుగు వెయ్యడానికా? గతంలో నాయుడు పదే పదే అడిగాడు, ఇరు రాష్ట్రాల సమస్యలను కేంద్రం కూర్చోబెట్టి తీర్చాలి అని. ఏరోజూ పట్టించుకోకుండా.. తాజాగా పెద్దరిక పాత్రకు దిగడంలో మతలబు అదే.

జనం విసిగిపోయారు.. ఈ కుక్డ్.. క్రూక్డ్ భావోద్వేగాలతో.. ఏదైనా కోర్టులు తేల్చుతాయిలే అనే వైరాగ్యంలో వున్నారు. మిత్రులు ఒకరి మీద ఒకరు ఎన్ని పెడబొబ్బలు పెట్టినా.. ఇవి పండవు. కామన్ కాంట్రాక్టర్ మిత్రులు, అది చేస్తున్న నాణ్యత మీద చోద్యం చూసే పెద్దన్న నాటకాలు అన్నీ బహిరంగ రహస్యమే.

దేశ జిఎస్టీ నిధులు దారి మళ్లించిన దాని మీద కాగ్ కాండ్రిస్తే.. మా నిధులు మాకు ఇవ్వండి అని అడగలేని అసమర్థ అవినీతి బానిసత్వం పావుల పాత్రలో ఇమిడి పోతే.. పెద్దరికం ఇలాగే పులకరిస్తూ నాటక సమర్పణలు చేస్తూ వుంటుంది. విడివిడిగా కలివిడిగా రాజకీయ మిత్రుల నాటకం కలకాలం జనం కనులను కప్పలేవు. #చాకిరేవు

0 స్పందనలు to “ఢిష్యుం ఢిష్యుం రాజకీయ స్కిట్”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,917

తడి ఆరని ఉతుకులు

అక్టోబర్ 2020
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

నెలవారీ ఉతికినవి