పార్టీ పరంగా నాయుడి మొదటి అడుగు – అసంతృప్తులు

పార్టీ పరంగా నాయుడి మొదటి అడుగు – అసంతృప్తులు

“క్రైసిస్ వుందని తెలిస్తే.. అది మింగేస్తాదని” ఆయనకు అనుభవమే. అందుకే దాన్ని ఆపర్ఛ్యూనిటీ క్రింద మార్చడానికే ఆయన మొగ్గు చూపుతాడు.

పార్లమెంటరీ స్థాయి బాధ్యతలకు వడపోసి & ఎంపికలు చేశారు.

రెండు రకాల అవార్నెస్ లతో చేసినట్లు అనిపిస్తోంది.

  1. సిచువేషనల్ అవేర్నెస్.
  2. సెల్ఫ్-అవేర్నెస్

రెండింటినీ అర్థం చేసుకోవడానికి ప్రస్తుత కరోనా ఖాళీ సమయం పరిస్థితులను వినియోగించుకొన్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ఎదురొడ్డుతున్న నాయకత్వ శ్రేణికి గౌరవం ఇస్తూ, అయోమయానికి గురికాకుండా.. ప్రస్తుతం పార్టీ ఏ దిశలో అడుగులు వెయ్యాలో దిశానిర్దేశం చేస్తూ, చెప్పులో రాయిలా మారిన పరిస్థితులనూ భరిస్తూ..

కొన్ని సెన్సిటివ్ విషయాల మీద అవగాహనతో పరిమితులకు లోబడి రియాక్ట్ అవుతూ.. అతిగా చెయ్యకుండా అడుగులు వేస్తున్నారు.

ఈ క్రైసిస్ లో ఒక పర్పస్ తో బాధ్యతలు అనేది టెస్టింగ్ లాంటిది. అవకాశవాద నమ్మక ద్రోహంలో పార్టీ చిక్కుకోకుండా.. శ్రేణుల్లో నమ్మకం కలిపిస్తూ సమన్వయం చేసే సమయం ఆయనకు ఒక వరం. రాష్ట్ర స్థాయి సమస్యల మీద పార్టీని ఇన్వాల్వ్ చేస్తూ, పార్లమెంటు స్థాయిలో స్థానిక సమస్యల మీద పోరాటం దిశగా జారిపోని అందుబాటులో వున్న వున్న నాయకత్వాన్ని వడపోయడంలో.. ఆర్థిక, సామాజిక, నమ్మక, ధైర్య, కలివిడి లాంటి ఎన్నో విషయాలమీద కసరత్తు చెయ్యాల్సి వుంటుంది. ఎక్కడ తప్పు జరిగినా.. సరిదిద్దుకోడానికి సమయం వుంది. అయినా అసంతృప్తి వ్యక్తం అవుతోంది అంటే అది శత్రుపార్టీలు బాధపడాలసిన పరిస్థితులు, ఇంకా ఇలా పోటీ పడుతున్నారని.

ప్రతిపక్ష పార్టీగా …

  1. తమ పోరాటం మీద జనంలో క్యూరియాసిటీ కల్పించడం,
  2. ఎమోషన్ తెప్పించడం
  3. జనం మెదళ్లలోకి చొరబడేలా చెయ్యడం
  4. సామాజిక బాధ్యతలలో పాలుపంచుకోవడం
  5. పార్టీయేతర సంఘాలను, సమూహాలను & పార్టీలను తమ టార్గెట్ కోసం సమన్వయం చేసుకోవడం
  6. ప్రస్తుతానికి గతానికి తేడా గుర్తుతెచ్చుకొనేలా చేసి బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసుకోవడం

ఈ డ్రైవ్ లో

తన నమ్మకాన్ని పరీక్షించడం.. సవరించుకోవడం, లక్ష్యం వైపు నడిపించడం, పార్టీ వనరులను పూర్తిగా ఖర్చు పెట్టేయకుండా.. లక్ష్యం నెరవేరే వరకు మిగులుతో కొనసాగడం అనే బాధ్యతలు వుంటాయి. పాలనలో అవన్నీ పట్టించుకొనే సమయం వుండదు కాని, ప్రతిపక్షంలో జాగరూకతో వుంటారు. ఇప్పుడు తగిలిన దెబ్బలు నాయుడిలో పరివర్తన తేకున్నా.. ప్రస్తుతం అనుభవిస్తున్న నాయకత్వం మాత్రం గుర్తుపెట్టుకొంటాం అనే మెసేజ్ తమ శ్రేణులకు పంపిస్తోంది.

జాతీయ స్థాయి నాయకునికి ఆ పనులు లేకపోతే, 13 జిల్లాల పార్టీ పని పెద్ద విషయం కాదు. దానిని నాయుడు మొదలెట్టినట్లు కనిపిస్తోంది, తొలి జాబితా చూస్తుంటే. #చాకిరేవు.

0 స్పందనలు to “పార్టీ పరంగా నాయుడి మొదటి అడుగు – అసంతృప్తులు”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,909

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2020
సో మం బు గు శు
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

ఉతుకుతో చిరిగినవి

నెలవారీ ఉతికినవి