వినయ విధేయ పసుపు పాత్ర

వినయ విధేయ పసుపు పాత్ర

ఎన్నికల ఫలితాల తరువాత, తెలుగుదేశంలో బిజెపి పట్ల మార్పు వచ్చింది. సభల్లో, వైకాపాను నమ్మి ఇన్ని సీట్లు ఇచ్చారు కదా.. ప్రత్యేక హోదా తేవడం వారి బాధ్యత అని చేతులు దులుపుకొన్నారు.

ఒకటీ అరా కాకుండా కరోనా చప్పట్ల నుండి తరచూ మోడీ గారి సూక్తి ముక్తావళి కూడా చేస్తోంది అధినాయకత్వం.

రాజ్యసభ ఉపసభాపతి ఎన్నిక విషయంలో మద్దతు ఇచ్చింది. రైతుల చట్టాల మీద & నిత్యావసర చట్ట సవరణ మీద, పార్టీ సభల్లో స్పందించింది కాని, నాయుడు స్పందించలేదు. మనది కూడా అన్నపూర్ణ రాష్ట్రం. మన రైతులలో కూడా అనుమానాలు వుంటాయి. దాని మీద చర్చ జరగలేదు. ఒక అవగాహన అనేది నాయుడు ఇవ్వలేదు. మత రాజకీయ రాద్దాంతాల నడుమ ఆ బిల్లుల గురించి చిన్నపాటి చర్చ జరగలేదు.

నిజమే నాయుడు ఓ మాట అంటే దేశం స్పందిస్తుంది. జాతీయ రాజకీయ పార్టీల నుండి దేశంలోని అన్ని పార్టీలు ఆసక్తిగా వింటాయి. ఒక అధ్యయనం చేసి అందులో మంచి చెడుల గురించి నాయుడు చెప్పి వుండాల్సింది. ఈరోజు వున్న రాజకీయం రేపటికి వుండదు. నిత్యం మారుతూ వుంటుంది.

బిజెపి & వైకాపా ఢిల్లీ బంధం, రాష్ట్రంలో గిల్లీ కజ్జాల బంధం చిన్న పిల్లాడికి కూడా తెలుసు. మధ్యలో దూరడానికి టిడిపి ప్రయత్నం చేస్తోంది అనేది జనం అనుకొంటున్నారు. దూరడం దూరకపోవడం రాజకీయం. కాని సమస్యల మీద అభిప్రాయాలు చెప్పడం ఒక పార్టీగా చెయ్యాలి. అది నచ్చినా నచ్చకపోయినా. మూగ స్నేహంతో.. కార్యకర్తల బిల్లులు సాధించలేదు. వారిలో మానసిక సంఘర్షణను తీర్చడానికి, మండల వారిగా సముదాయించే పనైనా పూర్తి చేశారా? ఆరునెలల సమయం వృధా చేశారనే భావన వుంది.

వైకాపా కార్యకర్తలు నాయకుల్లా సంపాయించుకోవడం లేదు. కానీ వారి పనులు జరుగుతోంది అనే అభిప్రాయం టిడిపి కార్యకర్తల్లో కలుగుతోంది. టిడిపి కార్యకర్తలు కూడా సంపాయించుకోవాలని వుండరు. ఆత్మ గౌరవం, ఒక పరామర్శ, ఒక మాట కొండంత బలాన్ని ఇస్తుంది. ఆ దిశగా రాష్ట్ర స్థాయి నుండి జిల్లాలకు, జిల్లాల నుండి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఆత్మ స్థైర్యం నింపే దిశగా ఎంతవరకు చర్యలు చేపట్టారు అనేది తెలియక శ్రేణులు అయోమయంలో వున్నాయి.

యావత్తు ఉమ్మడి ఆంధ్రాలో ఒక్కడిగా నాయుడు వేసిన అడుగులు, చేతికి వచ్చిన అబ్బాయితో 13 జిల్లాలలో గ్రామ స్థాయి వరకు కార్యకర్తలలో చైతన్యం నింపే కార్యచరణ చెయ్యకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారనే అభిప్రాయం బలపడకుండా.. నేటి కమ్యూనికేషన్ రంగంలో కనెక్షన్ పెరగాలి.

బిజెపి విషయంలో ఏమి చేసినా.. రాష్ట్రం విషయంలో రావాల్సిన దాని గురించి అడుగుతూ వుండాలి. గతంలో వైకాపా రాద్దాంతం చేసినా కమలం కన్నెర్ర చేయలేదు. రహస్య బంధంలో గాఢంగానే స్నేహం చేశారు. ఇప్పుడు వైకాపా మౌనానికి మించి టిడిపి మౌనంలో పోటీ పడాల్సిన అవసరం లేదు. అది టిడిపి సిద్ధాంతం కాదు అని సగటు కార్యకర్త నాయకత్వం ముందు మౌనంగా బాధపడే అవసరం చేతులారా కల్పించకూడదు.

ఏదైతే అదయ్యింది అనే తెగింపు రాజకీయ కాలం ప్రస్తుతం. దోబూచులాట రాజకీయం నేటి పరిస్థితులలో జనానికి నచ్చదు. #చాకిరేవు.

0 స్పందనలు to “వినయ విధేయ పసుపు పాత్ర”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,911

తడి ఆరని ఉతుకులు

సెప్టెంబర్ 2020
సో మం బు గు శు
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

నెలవారీ ఉతికినవి