ప్రస్తుత దేశ రాజకీయాలలో ఎక్కడ, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు

“నాతో పాతికమంది కూర్చొని వున్నారు. మేము రాజస్థాన్ రాజధాని జైపూర్ కు వెళ్లడం లేదు. 102 మంది బలం వున్నట్లు చెప్పుకొంటున్న కాంగ్రెస్స్ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో వుంది” – సచిన్ పైలట్.

చైనా చొచ్చుకు రావడం, కరోనా, లాక్డౌన్, దేశం ఆర్థిక మందగమనంలో ప్రవేశించింది అనే వార్తలు జనానికి అత్యవసరం ఏమో కాని, కేంద్రంలో అధికారం చెలాయించే బిజెపికి కాదు.

30 మందికి పైన సేకరించి, రాజస్థాన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు పావులను చక చకా కదిపేసి, అశోక్ గెహ్లాట్ చాపక్రింద ఎప్పుడో నీరు వచ్చేలా చేసింది, బిజెపి.

ఇక ఫార్మాలిటీలు పూర్తిచేయడమే.

ఆంధ్రాలో మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సింది 88.

టెక్నికల్గా టిడిపి 23 & జనసేన 1 తీసేస్తే కావాల్సింది 64. ప్రజాస్వామ్యం & రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణకు టిడిపి & జనసేన కలిసి రావచ్చు.

ఇక 64 అంటే.. పార్టీ చీలకుండా బిజెపికి కష్టం. బిజెపి తనదైన పద్దతిలో హేండ్సప్ అంటే ఓ 30 సులభంగా అవుతుంది. ఢిల్లీ హైకోర్టులో పార్టీ పేరు మీద కేసు పడ్డం ఒక మైండ్ గేము. రాజానంల ఆధ్వర్యంలో మొదలైన రెబెల్స్ అలజడి, మరో రెండు మంత్రి పదవుల ప్రమాణస్వీకారం తరువాత రాజుకునేలా చేస్తే పెద్ద కష్టం కాదు. వీటిలో ఎంతో అనుభవాన్ని ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలను ఎంచుకొని, కర్ణాటకా, మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాల మార్పులను చూశాం ..తాజాగా రాజస్థాన్ లో చూస్తున్నాం.

రాజకీయలలో బిజెపి ఘడియలు ముహూర్తాలు పెట్టుకోదు అది నిరంతరం పనిచేసుకొంటూ పోతుంది. మ్యానిఫెస్టో నుండి అన్నింటా రిజిస్టర్ అయిన మరో పార్టీ పేరున టెక్నికల్ గా వచ్చిన ఇబ్బందులు … కోర్టులు చేరింది. అటువంటి పార్టీ మారినా అనర్హత వేటుపడదు అనే కోర్టు తీర్పు ఒకటి వచ్చేలా చేసినా.. ఇసి ఆదేశం ఒక్కటి వచ్చినా… ఆపగలిగే పరిస్థితిలో వైకాపా వుండదు. ఇదేమని బిజెపికి ఎదురు చెప్పే పార్టీ దేశంలో లేదు, ప్రస్తుతం. అప్రస్తుతం అయినా … ప్రస్తుత దేశ రాజకీయాలలో ఎక్కడ, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. #చాకిరేవు.

0 స్పందనలు to “ప్రస్తుత దేశ రాజకీయాలలో ఎక్కడ, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,928

తడి ఆరని ఉతుకులు

జూలై 2020
సో మం బు గు శు
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి