అన్యాయం జరగలేదు … కొంత విరామం దేవుడు ఇచ్చాడు

ఓ అత్యున్నత న్యాయమూర్తి సమక్షంలో ఓ చిన్న రాష్ట్రం సిఎం ఒక కోరిక కోరాడు. సార్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేలా మన న్యాయ వ్యవస్థలో ఒక విధానాన్ని తీసుకు రండి. దానికి వేదికగా ఈ అమరావతి కోర్టును పరిగణలోకి తీసుకోండి అని.

కొన్ని రోజుల క్రితం ఆర్బీఐ కొన్ని ఆర్థిక ఉద్దీపన / ఉపశమనాలు ప్రకటించింది. కరోనా తరువాత కారుమబ్బుల్లా ఆర్థిక మాంద్యం వస్తుంది ప్రపంచం అంతా అనే అంచనాలు వున్నా .. ప్రకటన చేసిన ఆ రోజు స్టాక్ మార్కెట్లు కలకలలాడాయి. అవన్నీ ఎన్ని రోజులు పనిచేస్తాయో ఎవరికీ ఓ అవగాహన లేదు. అసలు దేశంలో పరిస్థితులు మీద కొందరికి అవగాహన వున్నా… ఓ విధమైన మౌనంతో నోరు విప్పడం లేదు. కొందరు సిఎం లైతే కావాల్సిన డబ్బును అచ్చేసుకొందాం అని సలహాలు ఇచ్చారు. ఆర్థిక పరిస్థితి ద్రవ్యోల్బణం మీద అవగాహనా రాహిత్యం అంటే కూడా తెలియక అంతకు మించి సలహా ఇవ్వలేక ఇచ్చిన ఓ సచ్చు సలహా అది.

ఎన్‌పిఎ అంటే నాన్ పర్ఫోర్మింగ్ అసెట్స్ అని బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని కట్టని బడా బడా సంస్థలను దివాళా తీసినట్టు ప్రకటించి వాటి ఆస్తులు అమ్మి మా అప్పులు కట్టేలా చర్యలు తీసుకోండి అని బ్యాంకులు… మేము అప్పులు కట్టలేమని కొన్ని సంస్థలు… మా అప్పులు వాటిచేత కట్టించేలా చెయ్యండని కొన్ని సంస్థలు … ఇలా కొన్ని వేల కేసులు నేషనల్ కంపెనీ లా బోర్డ్ దగ్గర పేరుకుపోయాయి.

విదేశాల నుండి పెట్టుబడులు పెట్టిన కొన్ని అంతర్జాతీయ సంస్థలు, మనదేశంతో భవిష్యత్తులో పని వుంటుంది కాబట్టి, నేరుగా అంతర్జాతీయ కోర్టులకు వెళ్లకుండా, మన విదేశాంగ శాఖ వద్ద తాము, దేశంలో పెట్టిన పెట్టుబడులు, ఇచ్చిన అప్పుల జాబితా ఇచ్చి వేచి చూస్తున్నాయి.

వేల కోట్ల కంపెనీల నిరర్ధక ఆస్తులు గట్రా, ఆ లోన్లు అవి లెక్కెస్తే … కొన్ని లక్షల కోట్లు తేలుతాయి. కొన్నింటికి వేలాది ఎకరాలు విలువైన భూములు వున్నాయి. కోర్టుల్లో నలుగుతున్నాయి. ఏమీ చెయ్యలేని పరిస్థితి.

కరోనా తరువాత, మరికొన్ని వందల నుండి వేల కేసులు ఎన్సిఎల్‌టి దగ్గరకు రావొచ్చొ.

అన్ని వేల కేసులను ఓ కొలిక్కి తేవాలి అంటే కొన్ని సమవత్సరాలు పడుతుంది. అన్నీ విచారణ చేసి తీర్పులు ఇచ్చి పంపే వ్యవస్థ మన దేశంలో లేదు.

ఇక్కడే ఆర్బిట్రేషన్ అనే ప్రక్రియ అవసరం అవుతుంది. అంటే లోక్ అదాలత్ లెక్క… పార్టీలు ఒక రాజీకి వస్తే సెటెల్మెంట్ చేస్తారు.

దానిని చేపట్టమని ఓ వ్యక్తి సుమారు సంవత్సరం ముందే అడిగారు.

ఈ రోజు కరోనాలో పరీక్షలు జరపడానికి మన దగ్గర పరికరాలు లేవు. విదేశాల నుండి దిగుమతి చేసుకొంటే అదో గొప్పగా భావించే స్థాయికి మనం వచ్చాం. బ్లడ్ టెస్ట్ నుండి ఎంఆర్ఐ వరకు మన దేశంలో ఒక రోజుకు కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఆ పరికరాలలో 80 శాతం వరకు మనం విదేశాల మీద ఆధారపడుతున్నాం. ఇక్కడే తయారు చేశ్తే, కేవలం 25% ఖర్చుకే మన దేశంలో మెడికల్ టెస్టులు చేసుకొంటారు. అందుకోసం మెడ్ టెక్ జోన్ అనే సెజ్ ను ఆంధ్రాలో పెట్టి, పూనం మాలకొండయ్య & జితేందర్ శర్మ లాంటి నిజాయితీ కల వారిని పెట్టి, ఎన్నొ అనుమతులు సాధించి, అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపులు పొంది, టిబి గట్రాల టెస్టింగ్ పరికరాల తయారీని కూడా మొదలెట్టారు.

దీని మీద మరింత లోతుగా వెళుతూనే … ప్రజల ఆరోగ్య రికార్డులను, డిఎన్ఏ లను బ్లాక్‌చైన్ టెక్నాలజీ రూపంలో ఆంధ్రాలో క్లౌడ్ లో పెడతాం అని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచారు.

రోగాలు రాకుండా ప్రకృతి సహజ సిద్ధ వ్యవసాయ పద్దతులు పాటిద్దామని ప్రపంచ వేదికమీద ఆంధ్రా లో ప్రూఫ్ ఆఫ్ కాన్సెఫ్ క్రింద చేసి చూపిస్తామని, అవలంబించి పెద్ద ఎత్తున ప్రోత్సహించారు.

కరోనా వలన పర్యావరణంలో కాలుష్యం తగ్గింది .. ఇదో మేలు జరిగింది అని ఈ రోజు మీడియాలు ఆ బొమ్మలను పెడుతున్నాయి. కానీ ఆంధ్రాలో అటవీ విస్తీర్ణం పెంచి దేశంలో ర్యాంకులు సాధించి చూపారు. ప్రతి నీటి బొట్టునూ ఇంకేలా చేద్దామని చెక్ డ్యాంలు, నీటి కుంటలు గట్రాల నుండి నీటి నిల్వలు ఎత్తిపోతలు, నదుల అనుసంధానాలు, కరువు నేలలో కియాలు, ఎన్నొ భగీరధ ప్రయత్నాలు. సంవత్సరంలో ఎన్నో నమ్మలేని ఫలితాలు.

పొద్దున సూర్యుడు ఉదయిస్తాడు ఎండొస్తుంది సాయంత్రం గాలి వీస్తుంది.. సోలార్, విండ్ ఎనర్జీలు పెద్ద ఎత్తున ఒడిసిపెట్టి, నిల్వ చేసే ఆలోచనలకు పదును పెడదాం, డిమాండ్ కు తగ్గట్టు అమ్ముకొందామని ప్రణాళికలు తయారు చెయ్యమని చెప్పాడు.

సంతోషాల పెంపుదలకు ఓ శాఖ అంటూ ఓ ప్రయత్నం.

ఇలా దేశంలో సగటు మనిషి జీవన ప్రమాణాల పెరుగుదల కోసం ఆలోచించడం, ఎక్కడన్నా చిన్న చిన్న ఆలోచనలు వస్తే… వారిని సంప్రదించి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ క్రింద ఆంధ్రాను వేదికగా తీసుకోమని ప్రోత్సహించడం … సగటు దేశ రాజకీయ నాయకుడికి రాని ఆలోచనలు… అమలుపెట్టడానికి అనితర సాధ్య కృషి.. వెరసి

వైద్య మాఫియా నుండి ఇంధన మాఫియా వరకు
గల్లీ లీడర్ నుండి ఢిల్లీ లీడర్ వరకు అసూయ

కుట్రలు కథనాలు వండి వార్చి
పావులు అయిన ఆంధ్రా

కరోనా కూడలిలో కూలిన ఆశలతో కలవరిస్తోంది ఆయన్ను …

ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ స్నేహితుడైన నాయుడిని

నాయుడికి అన్యాయం జరగలేదు … కొంత విరామం దేవుడు ఇచ్చాడు. ఇలాంటి విపత్తుల తరువాత మళ్లీ వచ్చి పని చెయ్యడానికి. ఆయనకు కోట్ల మంది తమ ఆయుస్సులో తలా కొన్ని రోజులు ఇద్దామని ఆశపడతారు. అలా ఇస్తే … మరో వందేళ్లకు పైగా దొరుకుతుంది. ఆయన ఆరోగ్యంగా మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని… రాబోయే ప్రపంచ సమస్యల నుండి మరో సారి ఆంధ్రాను సరికొత్తగా అవిష్కరించే ఆలోచనలా ఉత్సాహాన్ని ఆయనకు దేవుడు ఇవ్వాలని స్వార్థంతో కోరుకొంటూ… #చాకిరేవు.

0 స్పందనలు to “అన్యాయం జరగలేదు … కొంత విరామం దేవుడు ఇచ్చాడు”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,914

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2020
సో మం బు గు శు
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

నెలవారీ ఉతికినవి