సభను బురిడీ కొట్టించిన డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మంత్రి

సభను బురిడీ కొట్టించిన డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మంత్రి

ఆయన ఎన్నికల అఫిడవి ప్రకారం, డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సోసియాలజీ & అడ్మినిస్ట్రేషన్ లో.

దేశంలో ఎసెన్షియల్ కమాడిటీస్ ఏక్ట్ (నిత్యావసర వస్తువుల చట్టం) వుందని, అందులో ఉల్లి వుందని వ్యవసాయ శాఖా మంత్రిగాను & సదరు చదువులతోనూ తెలవని అమాయకత్వంతో, శాసన సభలో ఉల్లి నిత్యావసరకు కాదని, సభను & ప్రజలను, కన్న బాబు గారు తప్పుదోవ పట్టించి వుంటాడంటే నమ్మశక్యంగా లేదు.

ఉల్లిపాయలు సేకరించి, రైతు బజార్లలో ఇస్తున్నామని ఆర్భాట మీడియా ప్రకటనలు చూస్తున్నాం. మరో వైపు కిలోమీటర్ల క్యూ లైన్లు అని అదే మీడియాలలో చూస్తున్నాం.

మంత్రి ప్రకటనకు, వాస్తవ పరిస్థితులకు, ఉల్లి రేట్లను పరిశీలనగా చూస్తే, ఏదో కుట్ర అనిపించక మానదు. వారి పార్టీ నాయకులు ఎవరైనా ప్రభుత్వం డబ్బులతో కొన్న ఉల్లిపాయలను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారా అని అనుమానం కలుగుతోంది.

సాధారణంగా నిత్యావసర సరుకుల క్రింద, బ్లాక్ మార్కెటింగ్ గట్రాలు చేస్తే, సంబంధిత కలెక్టర్లు, తరలించే వాహనాలను, నిల్వ ఉంచిన బ్లాక్ మార్కెటింగ్ గోదాములను సీజ్ చేసి, కేసులు పెట్టవచ్చు.

అసలు ఉల్లిపాయలే నిత్యవసర సరుకు కాదు అని స్వయంగా మంత్రే అసెంబ్లీలో అబద్దం ఆడుతున్నాడు అంటే, అలా ఏదన్నా అవకవతవకలు & అవినీతి జరుగుతున్నా, నిత్యావసర చట్టం వర్తించదు అని వత్తాసుపలికే, తప్పుదోవ పట్టించే మాటలు గా కనిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఆ చట్టం ప్రకారం జూలైలో ధరలు పెరిగిందని పెట్టిన సర్కులర్ కాపీలో (https://pib.gov.in/newsite/PrintRelease.aspx?relid=191386) కూడా ఉల్లి పాయలు వున్నాయి.

మరి మంత్రి సభ సాక్షిగా ఉల్లి నిత్యావసరకు కాదు అని ఎందుకు అన్నట్టు? #చాకిరేవు

0 స్పందనలు to “సభను బురిడీ కొట్టించిన డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మంత్రి”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,918

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2019
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి