జగన్ రెడ్డి విషయంలో లోకేశ్ అన్నది నిజమేనా?

జగన్ రెడ్డి విషయంలో లోకేశ్ అన్నది నిజమేనా?

పొరుగు రాష్ట్ర దిశ & తదుపరి సంఘటనలు, దేశ విదేశాల పత్రికలలో కూడా వచ్చి తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఇలాంటి వార్తను ఒక్క సారి కూడా పూర్తిగా చదవడం కానీ, చూడడం కానీ జగన్ చెయ్యలేదు అని అనుకొనే మాటలు, నిన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడగా, అందరూ ఆయన అవగాహనకు అవాక్కయ్యారు.

పొరపాటున నిందితులు ఆంధ్రా వైపు తప్పించుకొని వచ్చినా, వారేమన్నా ఇటొచ్చారేమో నిఘా పెట్టండి అని, ఓ నాయకుడిగా తెలుసుకోవాల్సిన కనీస పరిజ్ఞానం లేదని, తన మాటలతోనే బయటపెట్టుకొన్నాడు.

దిశ బాధితురాలు టూ వీలర్ ఆపి టోల్ కట్టే సమయంలో పంచర్ చేశారు అని అంటుంటే, సంఘటన గురించి అవగాహన అలా ఉంచితే, దేశంలో & ఆంధ్రాలో టోల్ లేని 100 కిలోమీటర్లు లేదు. ఎక్కడా ద్విచక్రవాహనానికి టోల్ తీసుకోరు, ఒక్క బెంగుళూరు నైస్ రోడ్డులో తప్ప.

ఇంట్లో వీడియో గేమ్స్ ఆడుతూ, అందులో గ్రాఫిక్స్. చూసి చూసి, అమరావతిని కూడా అలా అనుకొంటున్నాడు, వచ్చి చూస్తే కదా అని జగన్ ను ఉద్దేశించి గతవారం లోకేశ్ అన్నారు.

కనీసం లోకేశ్ అలా అన్నారనే విషయం అయినా, జగన్ కు తెలుసో లేదో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ లెక్కన రాజకీయ శత్రువు అయినా చంద్రబాబు ప్రభుత్వం జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకింగులు గట్రా మీద కనీస అవగాహన జగన్ కు వుంటుంది, ఈయన కూడా ప్రయత్నిస్తాడు అని అనుకోవడం అత్యాశే అవుతుంది. #చాకిరేవు

0 స్పందనలు to “జగన్ రెడ్డి విషయంలో లోకేశ్ అన్నది నిజమేనా?”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,917

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2019
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి