డర్టీ డజన్ ఊస్టింగ్ ని సుబ్బు స్వామి గబ్బులేపుతున్నారు

డర్టీ డజన్ ఊస్టింగ్ ని సుబ్బు స్వామి గబ్బులేపుతున్నారు

నిన్న ఫైనాన్స్ మినిస్ట్రీ ఓ 12 మంది ఐఆర్ఎస్ గట్రా బృందానికి, 3 నెలల జీతం ఇస్తూ ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చింది.

అందులో శ్రీవాత్సవ అనే ఐటీ కమీషనర్ వున్నారు. గతంలో ఆయన మీద ఇద్దరు కమీషనర్ ర్యాంక్ లో వున్న మహిళా ఐ ఆర్ ఎస్ అధికారులు, సెక్సువల్ హరాష్మెంట్ ఆరోపణలు చేశారు.

ఇప్పుడు బీజేపీ సుబ్రహ్మణ్యం స్వామి గారు ఏమంటారంటే, ఎన్డీటీవి మీద ఇన్వెస్టిగేట్ చేసే శ్రీవాత్సవ మీద, చిదంబరం గారు తప్పుడు కేసులు పెట్టించారు, అలాంటి కేసులు పట్టుకొని, మేడం నిర్మలా సీతారామన్ సస్పెండ్ చేయించింది. నేను మోడీ గారికి వెంటనే లేఖ వ్రాస్తా అంటూ గబ్బులేపుతున్నారు.

2014లో మోడీగారే శ్రీవాత్సవను అర్థం చేసుకొని, జైట్లీ నిర్ణయాన్ని కట్టడి చేసి, మళ్లీ బాధ్యతలు ఇచ్చారు అని కూడా స్వామి చెబుతున్నారు.

ఇదే శ్రీవాత్సవ గారు, తమిళనాడులో ఎన్నికలు జరిగే వేళ, చిదంబరం కొడుకు పోటీ చేసిన నియోజకవర్గ పరిధిలో జరిగిన ఓ పుస్తకావిష్కరణకు వెళ్లి, సభా ముఖంగా చిదంబరం ఎన్డీ టీవీ ద్వారా 6000 కోట్ల ఫ్రాడ్ చేశారని & నన్ను వేధించాడని చెప్పాడు.

ఎన్నికల నియమావళి వున్న సమయంలో, ఓ ప్రభుత్వ అధికారి రాజకీయ ఆరోపణలు బహిరంగ ప్రదేశంలో చెయ్యవచ్చా అనేది మనం ఆలోచించాలి. అంటే శ్రీవాత్సవ వెనుక కూడా ఎవరో వున్నట్టే కదా.

ఇక నాటి చిదంబరం, తరువాత అరుణ్ జైట్లీ, తాజాగా నిర్మలా సీతారామన్ మీద, అంటే స్వామి మనసు పడిన ఫైనాన్స్ మినిస్ట్రీ లో ఎవరున్నా, కావాలని సుబ్బు స్వామి టార్గెట్ చేస్తున్నట్టు, అనిపించకమానదు.

మరి చిదంబరంకు నిర్మలా గారు సహకరిస్తే, ఆమెకు ఆ పదవి వచ్చేలా చేసింది ఎవ్వరు? తక్కువ సమయంలో డిఫెన్స్, డిఫెన్స్ నుండి ఫైనాన్స్ కు ఎలా ఎదిగారు? వెనక వున్నది ఎవరని కొందరు ప్రశ్నిస్తున్నారు?

స్వామికి కూడా కావాల్సింది ఇదేనేమో. తనకు ఆ పదవి దక్కకుండా చేసిన వారి మీద అనుమానాలు వచ్చి, రచ్చ జరిగేలా పావులు కదుపుతున్నట్టు వుంది.

నిన్న రాత్రంతా అవినీతి మీద మోడీ గారి కొరడా అని, తాజా స్వామి గొడవతో భక్తులు మింగలేక కక్కలేక అయోమయంలో పడ్డారు.

మధ్యలో మోడీని పెట్టుకొని షా & స్వామీల పోరాటమా? లేదా ఇవిఎంల అనుమానాలు మరిచిపోయే కిచిడీ వండి వారుస్తున్నారా, అనే మీమాంసలో కొందరున్నారు. ..చాకిరేవు.

0 స్పందనలు to “డర్టీ డజన్ ఊస్టింగ్ ని సుబ్బు స్వామి గబ్బులేపుతున్నారు”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,937

తడి ఆరని ఉతుకులు

జూన్ 2019
సో మం బు గు శు
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

నెలవారీ ఉతికినవి