రాజధాని లో ఖిన్నులైన వేళ

ప్రపంచ పటం లో
వెలుగుతున్న నగరాలను చూసిన
మన నిస్వార్ధ రాజకీయ నాయకులు
మన జాతి కి వెలుగు నిచ్చే లా
రాజధానిని మారుద్దాం అని
ప్రక్క రాష్ట్రాలు అసూయ పడేలా
అడుగులు వేసి
అభివృద్ది లో నిలిపే వేళ
 
పల్లె లో
గొంగలిలా ఎందుకు
మన రాజధాని కి వెళ్లి
రాజధాని తొ పాటు తమ బతుకు ను
జత జేసి
బతుకు రాత ను కొత్తగా  
రాసుకొందాం
అనే ఆశతో
ధైర్యం చేసి  
భారమైన మనసుతో  
పుట్టి పెరిగిన ఊర్ల లోని  
ఆస్తులను అమ్ముకొని  
భాగ్య నగరం లో బిక్కు బిక్కు మంటూ
కబ్జాదారుల కబంధ హస్తాలకు చిక్కకూడదని  
నిత్యం దేవుళ్లను  అర్దిస్తూ  
అభివృద్ది తో మమేకమైనారు

అధైర్యం   అసమర్దత స్వార్థం
నిండి బతక చేతగాని వాళ్ల చేత  
నిత్యం దొంగలని అనిపించుకొంటూ
సెటిలర్స్ అనిపించుకొంటూ కుమిలిపోతుంటే  

పులి మీద పుట్ర లా
దాపురించిన విభజన
ఎన్నో సందేహాలను విసురుతోంది
రేపటి ఆశల మీద

పదవులకోసమే
చిచ్చు పెట్టి
విజయం సాధించిన
విచ్చిన్న కారులు
ఇకనైనా స్వార్థం వీడి
ప్రాంతీయ బేధం పాటించని
సీమాంధ్రా నాయకత్వం లా  
మసలుకొని
సెటిలర్స్ సందేహాలు సమసి పోయేలా
ప్రవర్తిస్తారని ఆశిద్దాం 

0 స్పందనలు to “రాజధాని లో ఖిన్నులైన వేళ”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,917

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2013
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి