పార్టీల పై సర్వేలు

జనానికి సొంత తెలివి తేటలు
ఏడ్చి చావడం లేదని
అడక్కున్నా సినిమా సమీక్షలు
రాసే వాళ్లు ఎక్కువ అయ్యి
ఎన్నో సినిమాలను ఆర్థికంగా  దెబ్బతీసారు

డబ్బిస్తే రేటింగ్ ఇస్తారు
లేదంటే  దెబ్బేస్తారు
అని తమ సినిమాల ద్వారానే
వాళ్ల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపారు

దరిద్ర గొట్టు సినిమాలకు కూడా
తొలి రోజే 10 కోట్లు అని కోతలు కోసి
ఊదరగొట్టి  తలనొప్పి తెప్పించుకోడానికి
ప్రేక్షకులను సినిమాలకు పంపే
మన మితి మీరిన మీడియా న్యూస్ చానల్ లు
దేశం లో బహుశా
ఏ బాష కి ఇన్ని న్యూసెన్సె
న్యూస్ చానల్ లు
వుండవు

ప్రజలను దోచిన  ధనం
దానం గా తీసుకొంటూ
కృతజ్ఞతగా దీవిస్తూ
‘కొమ్ము’ కాయడానికి

జనం నాడులు పట్టేసాం అంటూ
గజ దొంగలకే రేపు ప్రజల పట్టం అంటూ
ప్రచారించడం విచారకరం

ఓ వైపు జనానికి ‘భక్తి’ గురించి చెబుతూ
మరో వైపు తమ ‘భుక్తి’ కోసం
ప్రజా భోక్త ల నే
పల్లకీ లు ఎక్కించ
ప్రజలు మోయడానికి
సిద్దమవుతున్నారని చెప్పడం
జాతి దరిద్రం

బిస్కట్ వేసిన వాళ్ల కాళ్లు నాకే శునకాల స్థాయికి
కొన్ని మీడియా  సంస్థలు దిగజారి
మొత్తం మీడియా మాధ్యమాన్నే
అసహ్యించుకొనే పరిస్తితి తెస్తున్నారు

పరిశోధనా  కోణం కూడా మీడియా కున్న లక్షణం అని
చాలా మీడియా సంస్థలు మరిచి చాలా కాలం అయ్యింది
లేక పోతే తోటి దుర్మార్గాలపైన  దునుమాడేవారే

ఓ కానిస్టేబుల్ లేదంటే
ఓ వి ఆర్ వో లంచం తీసుకొనే
లాంటి వి మాత్రం పట్టించ గల స్థాయికి
మాత్రమే మీడియా దమ్ము పడిపోయింది
అది కూడా బాధితులు ఉప్పందించి సాయం కోరితేనే సుమా

0 స్పందనలు to “పార్టీల పై సర్వేలు”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,914

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2013
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి