తెలంగాణా సోదరులకు శుభాకాంక్షలు, ఆశీర్వదించండి

నిజాం రజాకార్ల తో
నలిగి పోయారు

అన్నల తో
అభివృద్ది కి
దూరం అయ్యారు

మీ ప్రాంత
అసమర్థ  రాజకీయ
నాయకత్వం లో
కనీస అభివృద్ధి కి
నోచుకోలేక పోయారు

స్వార్థ రాజకీయ నాయకుల
జోరీగ పోరుతో
ఆత్మ నూన్యత పెంచుకొని
విడి పొదాం అని
పంతం బట్టి

దేశమే చీదరించుకొంటున్న
నాయకత్వానికి
మీరు పావు గా పనికివస్తారని భావింపబడి
విభజించ బడ్డారు
విజయం సాధించారు

మీరు సంబురాలు చేసుకొంటున్నారు
మాకు ద్వేషం కలగడం లేదు
మీరు చూసేలా
తామేదో సాధించామని
హస్తిన లో స్వీట్లు పంచుకొంటున్న
మీ నాయకుల ను చూస్తుంటే
ఈ అర్భకులే కదా మళ్లీ మీకు
నాయకులయ్యేది  అనే
జాలి కలుగుతోంది

ఇక నైనా జాగ్రత్త గా వుండండి
తెలంగణా కి తెగులు పట్టించి
విజయం సాధించ గల
జాదూలు వున్నారు అక్కడ

మీది చూసుకోండి ముందు
అనిపించుకోక ముందే చెబుతున్నాం
అవినీతి లో పోటీ లేని
మా చంచల్ గూడ  దొంగలు
మాకు సమైక్య పాఠాలు చెప్పడానికి
బయలు దేరారు
ఆ దొంగల బారిన మరో సారి పడకుండా
మా బతుకు పోరాటాన్ని కొత్తగా ప్రారంభించాలి
ఆశీర్వదించండి

3 స్పందనలు to “తెలంగాణా సోదరులకు శుభాకాంక్షలు, ఆశీర్వదించండి”


  1. 1 UnKnown 9:55 ఉద. వద్ద డిసెంబర్ 6, 2013

    neekevadu dikko chusuko … scaamula king … musali kanneeru kala nistya vidhava soubhaagyavati …. chetilo nalige ninnu chusi jaali vestondi!!!

    మెచ్చుకోండి

  2. 2 అనామకం 11:08 ఉద. వద్ద డిసెంబర్ 6, 2013

    vennupOTu dorala renDu kalla siddhantam ippudu rendu chippala siddhantamayyindi. Alaati vaarinumchi mimmalanu meeru jagrattaga kapadukondi.

    మెచ్చుకోండి

  3. 3 hari.S.babu 1:36 సా. వద్ద డిసెంబర్ 6, 2013

    కాంగ్రెసు అధిష్టానం తన సొంత పార్టీ వాళ్ళనే పట్టించుకోవటం లేదు విభజన విషయంలో, ఇంక తెరాసా ఆందోళననీ వాళ్ళు చసే బందు భీభత్సాల్నీ యెందుకు పట్టించుకుంటుంది. అంతా పూర్తి చేసేశాం, కాబింట్ ఆమోదించటమే మిగిలిందని చెప్పాక ఇక మార్పులు చేర్పులు ఉండక పోవచ్చు. ఇప్పటి దాకా యెదటి వాళ్ళని నో ఆప్షనస్ అని గద్దించిన పెద్ద మనిషికి ఇప్పుడు మరో ఆప్షన్ లేదు. అందరూ రాహుల్ గాంధిని ప్రధానిని చెయ్యడానికి విదగొడుతున్నారని యెలా అనుకుంటున్నారో గానీ అది పూర్తిగా తప్పు. దేశమంతా చంక నాకిపోయి విడగొట్టటం వల్ల సీమాంధ్ర లోనూ నష్టపొయాక ఈ కాసిని సీట్లు చలి కాసుకోటానిక్కూడా పనికి రావుగా! నాకు తోచిన క్లూ వేరే ఉంది. పార్తీ పూర్తిగా వోడిపోయినా సోనియాకీ రాహుల్ కీ అమేధీ యో యేవో నికరమయిన స్థానాలు ఉన్నాయి. మరి వారికి అతి ముఖ్యులయినా చిదంబరం, ఆజాద్ లాంటి వారి సంగతేమిటి? చిదంబరాన్ని ఈ సారి జయలలిత తమిల నాడు నుంచి గెలవనివ్వదు. ఆజాదుని వాళ్ళ పార్తీ వాళ్ళే పార్టీ ఆఫీసుకి రానివ్వట్లేదు, ఇంక పార్లమేంతుకి గెలిపించటం కూడానా?మిగతా వాళ్ళ పరిస్తితీ అనతే. వాళ్ళందరికీ నమ్మకమయిన సీట్ల కోసం.
    అందుకే తెలంగాణా వాళ్ళు యేది అడిగితే అది – భద్రాచలం తో సహా – ఇవ్వడం. ఆర్టికిల్ 3 అనేది రాజ్యాంగ పరమయిన వెసులుబాటు. కానీ ఆంగ్రెసుని విభజనకి ఒప్పించటం అనేది – తను పెంచి పోషించిన ఉద్యమం యొక్క బలం ద్వారా కాకుండా – సొంత రాష్ట్రాల్లో దిక్కు లేని కోటరీ ప్రముఖులకి నమ్మకమయిన లోక్ సభ సీట్ల కోసం నీచమయిన లాలూచీ తో జరిగింది. అదే లాలూచీ ఇప్పుడు సీమాంధ్రులు చెయ్యగలిగీతె యేమవుతుంది?

    మెచ్చుకోండి


వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,917

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2013
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి