అవశేషం లో మరో రాగం పుట్టిస్తారు

అల్పుడెపుడు పలుకు …
అని మన వారిని చూసే
మన వేమన సెలవిచ్చినట్టు వున్నారు

కలసి వుండండం చేతకాదు
విడిపోవడమూ చేతకాదు

జుట్టు ‘చేతి’కి ఇచ్చి
ఇరు ప్రాంతాలలో చస్తున్నారు

వున్న రాష్ట్రానికి రాజధాని లేదు
రాజధాని వున్న కొత్త రాష్ట్రానికి దాని మీద అధికారం లేదు

‘చేతి’  బిక్షం కోసం కొత్త రాజధాని దేబిరించాలి
‘చేతి’ రక్షణ కింద పాత రాజధాని పడివుండాలి

ఒక ప్రాంతం ‘చెయ్యి’ తయారు చేసిన
గజ దొంగ ను భరించాలి
ఇంకో ప్రాంతం ‘చెయ్యి’ పెట్టే కొత్త గజ దొంగను  
తమ ప్రాంతం లో దోచుకోనివ్వాలి  

‘చెయ్యి’ కి పక్ష వాతం సోకినప్పుడు 

అవశేషం లో మరో రాగం పుట్టిస్తారు 

 

ఆ కొత్త రాగాన్ని ఆస్వాదిస్తుంది

మరో సారి ‘చేతి’కి జుట్టిచ్చి
మరింత బానిసగా జాతి ని మారుద్దాం

0 స్పందనలు to “అవశేషం లో మరో రాగం పుట్టిస్తారు”



  1. వ్యాఖ్యానించండి

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,911

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2013
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి