పాటను సవరించి గొంతు సవరిద్దాం

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలేపండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

అమరావతి నగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడునాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతాం
జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ

పై పాటను సవరించి
గొంతు సవరించి పాడుకొందాం

ఒకే బాధ
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్
అన్న బాష జాతి ని
విడ గొట్టబడింది
ఓ ఇటాలియన్ అన్నదే
మతోన్మాదులు
విదేశీయులు
ప్రాంతీయ వాదుల చేతిలో
పోటీ పడి
తెలుగు తల్లి అవిటి ది అయ్యింది
అనుకొన్నా….

కానే కాదు
ఇన్నాళ్ళకు
నా తెలుగు తల్లి కి
సరైన వాస్తు కుదిరింది

Image
పై మ్యాప్ చూడండి
ఏ మాత్రం వాస్తు తెలిసిన వాడినైనా అడగండి
మిగిల్చిన ఆంద్ర ప్రదేశ్ ( సీమాంధ్ర ) పటంచూపండి

పెరిగిన ఈశాన్యం గురించి చూపండి
తూరుపున వున్న సముద్రపు నీళ్ళను చూపండి
ఎంత బాగా వృద్దిలోకి వస్తుందో
ఎంత త్వరగా వృద్దిలోకి వస్తుందో
అడగండి

అదే విధంగా
ఈశాన్య లోపం తో
తెలంగాణా ఏమవుతుందో అడగండి
ఆగ్నేయం పెరిగి
వాయువ్యం పెరిగి

తెలంగాణా ఏమవుతుందో అడగండి

రాజధాని పేరుతొ
సీమాంధ్ర ని విడదీసే
కుట్రలు ఆపి
కలిసి ఉందాం

తర తరాల నమ్మకం కోసం
సీమాంధ్ర కలిసే చోట
కలసి నిర్మించుకొందాం
తెలుగు తల్లి ని
ప్రపంచ పటం లో
తలెత్తుకోనేలా చేద్దాం
మన తరం తో నే
సాధ్యం చేద్దాం

నిజాములు కట్టిన
కట్టడాలు మనకెందుకు
ఝాములొ నిర్మించుకొందాం
హై టెక్ సిటీ లు

పార్మా సిటీ లు
నిర్మించే మయులు మన సొంతం
మన నైపుణ్యం అపారం అనేది
జగమెరిగిన సత్యం
అదే అందరినీ ఇక్కడికి రప్పిస్తుంది

ఆంద్ర ప్రదేశ్ అనే బోర్డు ను
మనమే తగిలించుకొని
అగ్ర ప్రదేశ్ గా మార్చుకొందాం

జై తెలుగు తల్లి

ఎవడినో నమ్మి
ఎరక్క పోయి పెట్టు బడులు పెట్టి
ఇరుక్కు పోయిన వాళ్ళ గురించి
విడిపోయిన తమ్ముళ్ళ నుండి
నిదానంగా విడిపిద్దాం
వాళ్లకు అంగీకారమైతే

ఎవరిది  దరిద్రమో
ఎవరిదీ అదృష్టమో
మన సంకల్పం తో
చాటుదాం

అయ్యో కలిసి వుంటే
బావుండేది అని అనుకొనేలా
అసూయ పడే లా
అలుపెరగని పయనం
ఆరంబిద్దాం

ఎవడాస్తులు దగ్గర వున్నాయో
ఆళ్ళు ఎందుకు చెపుతున్నారో
తెలుసు కొని ఆమడ దూరం పెట్టి
అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం

తెలుగు తల్లి తన్మయించేలా
పాటను సవరించి
గొంతు సవరిద్దాం రండి

ఆంధ్రా  అభివృద్ధి కి
తెలుగు తల్లి కి  తోడుగా
కలియుగ వైకుంట నాధుడు
ప్రత్యక్ష దైవం
వేంకటేశ్వరుడు
మనకున్నాడు
మంచి కాలానికి
కాలహస్తీశ్వరుడు
మల్లన్న మనకున్నారు
శక్తి నివ్వడానికి దుర్గమ్మ వుంది
అప్పన్న ఆన తో
అందరూ ఏకమయ్యి

అందంగా
ఆనందంగా
తెలుగు జాతి పరువు ను
అన్న సాక్షి గా మరో సారి నిలుపుదాం

3 స్పందనలు to “పాటను సవరించి గొంతు సవరిద్దాం”


  1. 1 అనామకం 8:39 ఉద. వద్ద జూలై 31, 2013

    Mottamodati saarigaa o “tapa” ki spandichi nenu isthunna mottamodati reply idi.. nenu mee peru kuda sarigaa chudaledandi.. andhrapradesh mukkalu chesaranna vaartha veluvadina daggaranundi chaalaa baadha gaa anpinchindi….
    .
    .
    .
    vidipovadam valla kalige laabha nastaala gurinchi pakkana pedite….konni samvastaraala nundi ee praanthamtho mudipadipoina bhaavavesaalu…emotions annee okkasaarigaa guthukocchi manasuku ‘vididpovadam’ anesariki baadha anpinchindi..
    .
    .
    kaanee mee “tapa” poorthigaa chadivaaka ..cheppaleni swanthana kaligindi..
    thanq…
    hope manandaram kalisi andhra pradesh ni “agra pradesh” gaa maarchudaam… telugu talli tanmayathvamto pulakarimchelaa cheddamm.

    thanq.

    మెచ్చుకోండి

  2. 2 Jai Gottimukkala 9:28 ఉద. వద్ద జూలై 31, 2013

    You should have explained it to Babu before TDP promised Telangana.

    మెచ్చుకోండి


  1. 1 నేను ఆ రోజే చెప్పాను | చాకిరేవు chaakirevu chakirevu 7:41 ఉద. వద్ద జూన్ 20, 2014 పై ట్రాక్ బ్యాకు

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,911

తడి ఆరని ఉతుకులు

జూలై 2013
సో మం బు గు శు
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి