మార్చి 23rd, 2010ను భద్రపఱచు

ఇడుపుల వాసి తరాలు కూడా అలా చెప్పుకొనేలా ప్రభుత్వ లాంచనాలతో ఆయన ఆశ నెరవేరుస్తున్నారు

ఆయన పోయిన వారం నుండి
ఆయన ఆశయాలు నెరవేరడం లేదు
లక్ష్యాలు నీరుకారుతున్నాయి అని లబో దిబో మన్నారు కదా
ఆయన ఆత్మశాంతి కోసం
ఆయన నమ్మిన అధికార దుర్వినియోగాన్ని వినియోగిస్తూ
ఆయన ఆశయాలు నెరవేరుస్తున్నారు.

మాట్లాడితే నేను బడికెల్లేప్పుడే
ఇన్ కం ట్యాక్సు కట్టే వాన్నని
గర్వపడే ఇడుపుల వాసి
తరాలు కూడా అలా చెప్పుకొనేలా
ప్రభుత్వ లాంచనాలతో
ఆయన ఆశ నెరవేరుస్తున్నారు
ఇడుపులాదీసుని ఇచ్చ నెరవేరడం కన్నా
ప్రజలకు ఇంకేమి కావాలి.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ రవీంద్రనాథ్‌రెడ్డికి, వై.రాగదీప్‌రెడ్డికి హైదరాబాద్‌లో 2400 చదరపు గజాల స్థలాన్ని కట్టబెడుతూ ప్రభుత్వం రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ పాన్‌మక్తాలో వైఎస్ సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి పేరిట 1386 చదరపు గజాల స్థలాన్ని, వై.రాగదీప్‌రెడ్డికి చెందిన డిఎం ఎంటర్‌ప్రైజెస్ పేరిట 1000 చదరపు గజాల స్థలాన్ని 166 జీవో కిందట క్రమబద్ధీకరించారు.

రవీంద్రనాధ్‌రెడ్డికి 25,95,225లకే 1386 గజాలు, రాగదీప్‌రెడ్డికి 15,90,679 లకు వేయి గజాలను క్రమబద్ధీకరించారు. శేరిలింగంపల్లి పాన్ మక్తాలోని సర్వే నం. 5/3లో ఈ భూములను క్రమబద్ధీకరించారు. ఇక్కడ భూమి గజం విలువ రూ. 25వేల వరకు ఉండగా దీన్ని రూ .1800లకే క్రమబద్ధీకరించారు.

అదే ప్రజావసరాల కోసం సీపీడీసీఎల్‌కు కేటాయించిన భూమికి గజానికి రూ. 13వేలకు పైగా వసూలు చేశారు

తరువాతి కాగితం »


వీక్షణలు

  • 265,805

 

మార్చి 2010
సో మం బు గు శు
« Feb   ఏప్రి »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి


Follow

Get every new post delivered to your Inbox.

Join 128 other followers