ప్రతి వ్రతానికీ వారసత్వంకు వాయినాలు ఇవ్వలేక

గద్దె వారసత్వంగా తమ వశమవుతుందని
ఓ రాయి విసిరిన వారిని
నయానో భయానో వారించి

పార్టీ లో పెద్దరికానికి తోడు
మాటల గారడీ కూడా అర్హతగా
పాలకుడిగా వరం ప్రాప్తించింది ఓ మాటల గడసరికి.

నగర ఎన్నికల్లో వారసత్వం
ఎక్కడ నగుబాటు చేస్తుందో అని కలవరపడుతూ
కలడోయి మాకూ ఓ బకరా అంటూ
వారసత్వాన్ని బెదిరించి బకరాను వంచించారు.

ప్రతి వ్రతానికీ వారసత్వంకు వాయినాలు ఇవ్వలేక చికాకు పడుతూ
వారసత్వంతో చేరి తననే వణికిస్తున్న వారిని
విస్తరణ అంటూ దారిలోకి తెచ్చుకొంటూ
అనుకోని ఆపద వస్తే ఓ బకరా కావాలని
కొండపై నుండి అసెంబ్లీ వరకు
అయిన వాళ్ళను పంపి అదే బకరాను
బుజ్జగిస్తూ అడిగిన వారికి సిన్మా కథలు చెబుతున్నారు.

1 ప్రతిస్పందన to “ప్రతి వ్రతానికీ వారసత్వంకు వాయినాలు ఇవ్వలేక”



వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,937

తడి ఆరని ఉతుకులు

మార్చి 2010
సో మం బు గు శు
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి