విసిగి పోయే వరకు వాదించు కొనేలా వాయిదాల మీద వాయిదాలతో

దేశాలు, ప్రాంతాల మధ్య దూరం చెరిగి
ప్రపంచం ఓ సాలెగూడు అంత చిన్నది అయ్యింది.

తెలియనిది తెలుసుకోవాలి అనుకొన్న తక్షణం
గాగుల్స్ లేకున్నా గూగుల్లో వెదికితే
తెల్లబోయేలా అన్నీ తెరముందు తెలిసిపోతోంది.

రంగులు మార్చే వాళ్ళ గురించి
క్షణాల్లో, సాలెగూడు మొత్తానికి చాటింపు వేసి
ఒకరికి ఒకరు హెచ్చరించుకొంటున్నాం.

కానీ మన రాజకీయ నాయకులు మాత్రం
సాలెగూడులో మనం సాగిస్తున్నవి చూచి ఓర్వలేక
ప్రాంతాలా వారీ మనం విడిపోయి
విసిగి పోయే వరకు వాదించు కొనేలా
వాయిదాల మీద వాయిదాలతో
వేర్పాటు వాదాలు రుద్దుతూనే ఉన్నారు.

ఏ రోగమొచ్చినా ప్రజల రొక్కంతో బాగుచేసుకొనే వీళ్ళు
భావోద్వేగాలతో గేములాడి
ప్రజల ప్రాణాలు మంచినీళ్ళ ప్రాయంలా హరిస్తున్నారు.

8 స్పందనలు to “విసిగి పోయే వరకు వాదించు కొనేలా వాయిదాల మీద వాయిదాలతో”


  1. 2 sindu 4:05 సా. వద్ద మార్చి 19, 2010

    Today Political India is like this. In history it is up to present Afghanistan. Who knows In future India may politically expand to Afghan again or it may reduce its size. So don’t worry division and union is normal.Its all political union or division.Don’t take it as total human kind division.Fight against the disparities among the gender or among the different sections of people.As united Andhra are we united in all aspects? I can say no.with lot of differences in mind why we have to be in the united state?Political separation don’t see as VERAPATUVADHAMU.

    Only kamma or Reddy can become chief minister for this state.There is lot of discrimination by which cast you are born. At that time nobody will come to fight for equality and unity . Don’ say unity and all these are all fake stories. You may say separate state wont give equality. Thats my problem after separation I will take how to improve the situation in my state . Why others has to bother about that? KCR is the weakest part of Telangana movement. Don’t compare KCR’s personality with Telangna movement.He is just floating on that movement.

    మెచ్చుకోండి

  2. 3 Apparao Sastri 8:12 సా. వద్ద మార్చి 19, 2010

    చాలా బాగా వ్రాశారండీ
    మనం అమాయకులులా
    ప్రాంతీయ భేదం తో
    వాదించుకుంటూ
    విసిగి పోతుంటే
    వారు వినోదిస్తున్నారు
    వారి ని చూసి మనం నా కెసిఆర్ , నా లగడపాటి అని కొట్టుకుంటున్నాం
    మార్పు ప్రజల లో నుంచీ రావాలి
    ముందు రాజకీయ నాయకుల పని పట్టాలి

    మెచ్చుకోండి

  3. 4 శ్రీవాసుకి 5:10 ఉద. వద్ద మార్చి 20, 2010

    >>ఏ రోగమొచ్చినా ప్రజల రొక్కంతో బాగుచేసుకొనే వీళ్ళు
    It is true. nice post

    మెచ్చుకోండి

  4. 6 kanred 2:05 సా. వద్ద మార్చి 21, 2010

    mee post chadivi inspire ayyi raasinadi

    chinna prayathnam…….

    ప్రజలాదే తప్పు మొత్తం … సొదరా
    ప్రజల చేతలని ఆసాంతం… గమనించరా

    కటకట లు తప్పవు పాలన పొడవునా…
    ప్రకటనలకే పడిపోతే ఆ ఎలెక్షన్ లోన,….

    చదువుకున్నోడు అంతే,
    చదువూరానోడు సరే-సరి,

    ఎవడి స్వార్థం వాడిది,…… అయిదు ఏళ్లకు వచ్చే పండగనుకుంటాడు
    లాభాల లెక్క లు కడ్తాడు, ఓట్లపండుగ తాయిలాల కోసం చూస్తాడు ……

    ఒకడు ఎక్కువ రిజర్వేషన్ కి జై , మరొకడు నేతల పుత్రుల నవ- జెనరేషన్ కి సై సై
    కొందరు కులమాతములంటే, ఇంకొంధరు ఉచిత పథకాలకే తమ వోటు

    దేశానికి బాగౌనా అన్నది ఎక్కడ్ ,
    మనం బాగుపాడతామా అన్నదే లెక్క

    రేపటి గురించి ఆలోచన లేదు,
    తమ అభ్యర్ధుల గతం తెలుసుకోరు,

    మంచివాడు,తగినవాడు ఎవ్వడు అన్నది చూస్తే ఒట్టు,
    అందరు ఒకటే నని మళ్లీ దొంగకే వేస్తారు తమ వోటు,

    ఇదేమిరా అంటే , ఎవ్వడొచ్చినా ఇంతేలే అని వేదాంతం చెబుతాడు,
    తనవరకి వస్తే, అందరిమీద ఏడిచేడు, న్యూస్ చ్యానెల్-లల్లో రాధ్ధాంతం చేస్తాడు,

    ఒక సగటు భారతీయుడి తీరు ఇదీ మరి,
    ఇంక నేతల మీద ఏడుస్తరేందుకు పడి పడి మరి,

    మంచి ని మెచ్చకుండా మరి
    మంచి ఆశించడము ఎంత సరి

    ప్రజలు పిశాచాలైతే——— నక్కలే రాజ్యాలేలుతాయ్ మరి

    http://antharahmaneeyam.wordpress.com/

    ramakanthudu

    మెచ్చుకోండి


  1. 1 ప్రజలు పిశాచాలైతే——— నక్కలే రాజ్యాలేలుతాయ్ మరి….ఇది కవిత్వమ్మో-పైత్యమో మీరే తేల్చాలి̷ 2:22 సా. వద్ద మార్చి 21, 2010 పై ట్రాక్ బ్యాకు
  2. 2 ప్రజలు పిశాచాలైతే——— నక్కలే రాజ్యాలేలుతాయ్ మరి…. « అంతా రహమానీయం అంతా రహమాన్ మయం 3:43 సా. వద్ద మార్చి 21, 2010 పై ట్రాక్ బ్యాకు

వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,937

తడి ఆరని ఉతుకులు

మార్చి 2010
సో మం బు గు శు
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి