వినాయకా…

భక్తుడు “స్వామీ వినాయకా, మీ చవితి వస్తోంది కానీ ఈసారి మిమ్ములను ఖైరతాబాదు వచ్చి దర్శించలేను, ముందస్తుగా క్షమాపణలు”
వినాయకుడు “కారణం ఏమిటి భక్తా?”
భక్తుడు “స్వైన్ ఫ్లూ అను అంటురోగముతో, మేము అట్టుడుకుతుంటే, అర్థం చేసుకోక మీరు నింపాదిగా, కారణం అడగడం భావ్యమా స్వామీ”
వినాయకుడు “ఆరోగ్యశ్రీ ఉన్నంగా, ఈ ఫ్లూకు ఉలికి పడుతారేం.. నాయనా”
భక్తుడు “ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ది పొంది, బాగు పడ్డారని, ఈ మధ్య సచ్చిపోయినాక, పాలకుల లేఖలు వ్రాసినట్టు ఉంది స్వామీ.. మీ ఉపాయము ”
వినాయకుడు “అట్లనిన కేవలము ఒక అంటురోగమునకు భయపడి, నన్ను దర్శించ రానందువా? ముక్కూ మూతికి, గుడ్డ కట్టుకొని రావచ్చు కదా భక్తా ”
భక్తుడు ” ముక్కూ మూతికి గుడ్డ కట్టుకొని, మీ దర్శనార్ధం వస్తూ ఆ అంటువ్యాధి వచ్చి, చచ్చి పోతే పుణ్యం వస్తుంది. కానీ మా పాలకుల మాట విని, మీ వాన దేవుడు వర్షిస్తే, ఈత రాని నేను, అమీర్పేటలో కొట్టుకు పోయి కొట్టు మిట్టాడితే కాపాడడానికి, నీవు ఎలుకవాహనంలో కూడా ట్రాఫిక్ ను దాటి రాలేని దుస్థితి స్వామీ”
వినాయకుడు “సరే, మీ ఇంటిలోనన్నా, నా ప్రతిమను ఉంచి మ్రొక్కుతూ.. ఉండ్రాళ్ళు ఉంచవయ్యా. ఏడాదికి ముందు ఎంగిలిపడ్డాను, నా ఉదరంలో మా వాహన బంధు సంచారం ఎక్కువయ్యింది”
భక్తుడు “తప్పకుండా స్వామీ కానీ పెట్టాం కదా అని ఎక్కువ తిన్నారో, మీకు కడుపు నొప్పి కాయం. అయినా అది మీకు రుచించాలి కదా”
వినాయకుడు “ఎందువల్లా భక్తా”
భక్తుడు “సన్న బియ్యం దొరక్క చస్తూ ఉంటే, మా మంత్రి వర్యులు దొడ్డ బియ్యం వాడండి, మీకు ఆరోగ్య శ్రీ అక్కరకు రాదు అని చెప్పారు స్వామీ. కావున దొడ్డ బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళతో, కడుపు నొప్పి వచ్చినా, అది రుచించక పోయినా, చంద్ర బాబును కోప్పడినట్టు, నన్ను కోప్పడకండి స్వామీ”
వినాయకుడు “భక్తా నేను కోప్పడింది మా చంద్రుని పై. మీ చంద్ర బాబుపై కాదు. అది మీరు అడుసులో వేసిన అడుగు భక్తా. నన్ను నిందించడం భావ్యమా. అట్లే చెప్పడం మరిచాను, ఉడక బెట్టిన బఠానీలు ప్రసాదంగా పెట్టడం మరువకు భక్తా?”
భక్తుడు “పప్పు దొరక్క ప్రజలు పరేషాన్ అవుతున్నారని, ఇంకో మంత్రి బఠానీలు వండుకొని తినమన్నాడు స్వామీ, దానికి కూడా డిమాండు పెరిగి పండుగకు దొరక్క పోతే, మీరు పరేషాన్ కాకూడదు స్వామీ”
వినాయకుడు “కనీసం ఇష్టమైన గరిక పెట్టి, జిల్లేడు మాల అయినా వెయ్యి భక్తా”
భక్తుడు “ఈ సారి తప్పకుండా వేస్తాను స్వామీ, కానీ రాబోయే కాలంలో గరికే మీకు గతని, మా నాయక గణాలు చెప్పి, మా చే తినిపిస్తే, డిమాండు పెరిగితే, అప్పుడు ఎలా ఎగ్గోట్టాలో ఆలోచిస్తాను స్వామీ”
వినాయకుడు “నిమజ్జనమప్పుడు, నా నిలువెత్తు విగ్రహాలు తగిలి కరెంటు తీగలు తెగి ప్రమాదం జరగ వచ్చు. కాస్త చూసుకొని చూడండి నిమజ్జనాన్ని”
భక్తుడు “మాకు కరెంటు ఉండేది ఆరు గంటలే, అదికూడా ఆ తీగల్లో అడపా దడపా వస్తూ పోతుంటుంది, ప్రమాదమని చెబితే పదిరోజుల వరకూ కట్ చేసేస్తారు, గట్టిగా మాట్లాడకు స్వామీ”
వినాయకుడు “చెప్పవలసినది ఏమైనా ఉన్నదా భక్తా, సెలవు తీసుకొని చవితి రోజు వస్తాను”
భక్తుడు “వినాయకా.. కరువుతో కకా వికలమౌతున్న ప్రజలపై, మా నాయకులు కనీసం, కనికరంతో మాట్లాడే మంచి బుద్ధి అయినా ఇవ్వు స్వామీ”
వినాయకుడు “నా చవితి రోజు వస్తే, నన్ను ఆడిపోసుకొంటారని.. ఆల్రేడీ వరుణిని వర్షించమని ఆదేశించడం అయ్యింది. ఆయన ఆపనిలోనే ఉన్నాడు. చిరంజీవి పార్టీలోని సభ్యులు పార్టీలు మారుతున్నట్టు, వరుణిని కూడా పార్టీలు మార్చుతున్నాడు అని అల్లరి పెడతారనే భయం ఆయనలో కూడా ఉంది భక్తా. అయినా మంత్రి ధర్మాన గారు మీ సభలో సెలవిచ్చినట్టు, ప్రజలు కలత చెందేలా కరువొచ్చిందని మాటి మాటికి అల్లరి చేయకండి భక్తా ”
భక్తుడు “అయితే, ఇంతవరకూ కరువుతో నష్టపోయిన వారిని, కాపాడేది ఎట్టా స్వామీ..”
వినాయకుడు “రియల్ భూం సమయంలో, నా లడ్డూలు అధిక ధరలో కొని, నన్ను సంతోష పెట్టిన నా భక్తులు, మాంద్యం దెబ్బతో ఈసారి వేలానికి రావడానికి వెనుకంజ వేస్తున్నారు భక్తా. వారికి ఏమైనా చేసిన తరువాత, నా వంతూ సాయం కరువు బాధితులకి చేస్తాను. అంతవరకు మీ సభలోని ఒక పార్టీ అధ్యక్షుడు నర్తించిన, సినిమా చూసి బాధలను ప్రస్తుతానికి మర్చిపోండి భక్తా”
భక్తుడు “సినిమాలకు పోతే, పిట్టలు చచ్చినట్టు చస్తున్నారు స్వామీ”
వినాయకుడు “నేను వినాయకుడిని మాత్రమే నాయనా, ప్రజా స్వామ్యంతో నాయకుడై నేనే దేవుణ్ణి అని, అన్నీ చేసాను, చెయ్యాల్సింది ఏముందో చెప్పండి అని ఎన్నికలకు ముందు చెప్పిన మీ దేవున్నే అడగండి. అడిగితే, ఎదురుదాడి చేస్తారనే భయం ఉంటే, ఆయన ప్రారంభించిన ఆకర్ష పధకంలో చేరి జలయజ్ఞంలో చిందే, చిల్లర ఏరుకొని బతకడం నేరుచుకోండి భక్తా”
భక్తుడు “మూడు లోకాలూ తిరిగి ముందుగా చేరమంటే అక్కడే, ఆవుచుట్టూ తిరిగి షార్ట్ కట్లో నాయకుడైన మీరు, మా లోకంలో మేము నిలబడే భూమిని కూడా అమ్మేస్తున్న, మా నాయకులను మార్చడం, మీ తరం కాదని అర్ధం అయ్యింది స్వామీ”
వినాయకుడు “భక్తా నేను నిజమైన వినాయకుడిని కాదు మీ సినిమాలో వినాయకుడిలా బ్లాగ్లోకంలో వినాయకుడిని, చాకిరేవు చూడ వచ్చి మీతో పరిహాసములాడితిమి. నొప్పించియున్న ఎడల క్షమించండి”
భక్తుడు “మీరు కూడా కంది పప్పులో కాలేయక బఠాణీ లలో వెయ్యడం నేర్చుకోండి. నేను భక్తుడిని కాదు ఏమీ తోచక బ్లాగ్లోకంలో బతుకెళ్ళ దీసే భాదితుడిని, మీ వలన కొంత కాలాక్షేపం జరిగినది ”

5 స్పందనలు to “వినాయకా…”


  1. 1 Venkata Ganesh. veerubhotla 12:43 సా. వద్ద ఆగస్ట్ 19, 2009

    very good. Nice balance of comedy with satire.

    మెచ్చుకోండి

  2. 2 Sreenath 4:20 సా. వద్ద ఆగస్ట్ 19, 2009

    Its nice, worth reading.

    మెచ్చుకోండి

  3. 3 వెంకట రమణ 8:29 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2009

    చాలా బాగా వ్రాశారు.

    మెచ్చుకోండి

  4. 4 Yogi 10:14 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2009

    Super ga undhi Bossu…manchi satire vestune comedy pandicharu..

    మెచ్చుకోండి

  5. 5 బ్రహ్మారెడ్డి 1:58 సా. వద్ద ఆగస్ట్ 20, 2009

    మీరు చాలా బాగా రాసారు………

    నా బ్లాగు :- http://nagabrahmareddy.blogspot.com

    మెచ్చుకోండి


వ్యాఖ్యానించండి




వీక్షణలు

  • 966,913

తడి ఆరని ఉతుకులు

ఆగస్ట్ 2009
సో మం బు గు శు
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

నెలవారీ ఉతికినవి