పది & ఇంటర్ మధ్య వ్యత్యాసం తెలుసా?

పది & ఇంటర్ మధ్య వ్యత్యాసం తెలుసా?

చందమా రావే జాబిల్లి రావే అంటే అన్నం తినే రోజులు పోయాయి. టీవీలో చోటాభీం కార్టూన్ చూపిస్తూ అన్నం పెట్టే రోజులు పోయాయి.

చేతిలో మొబైల్ పెట్టి తినిపించే రోజులు వచ్చాయి.

పిల్లలు పదికి వచ్చినప్పుడు భయం వేస్తుంది.

ఒకప్పుడు ఇంటర్ తరువాత తిరగబడే తత్వం ఇప్పుడు 9వ తరగతి వయసు నుండే అందరికీ అనుభవం.

ఇంట్లో వుంటే పనికిరాకుండా పోతారు అనే భయం వస్తుంది.

ఇక్కడ ఆలోచన మొదలవుతుంది.

ప్రభుత్వ పాఠశాలల ఫలితాల మీద రెవ్యూలు వచ్చాక, పదోతరగతి పరీక్షలకు కాపీలు కొట్టిస్తారనేది కొన్ని రాష్ట్రాలలో వచ్చిన ఫలితాలు, వారి మీద వేసిన ప్రశ్నలతో బయటపడ్డం ఈ మధ్య మీడియాలలో చూశాం. జస్ట్ పాస్ అయితే చాలు అని అందులో చేర్పిస్తున్నారు అక్కడక్కడా, ప్రైవేటు బడుల నుండి తీసుకు వచ్చి. కావలి అంటే కొన్ని బడులు రికార్డులు చూడవచ్చు.

క్యాంపస్ సెలెక్షన్ జరిగే ఇంజినీరింగ్ కాలేజీలో సీటు వస్తే చాలు అనుకొనే కొందరు, మనోడికి బాగా మార్కులు వస్తున్నాయి కాబట్టి ఐఐటి లో వస్తుంది, అదీ కాకపోతే ఎన్ఐటి లో, అదీ కాకపోతే బిట్స్ పిలానీలో వస్తుంది దానికి జేయీయి రాయిద్దాం అని పరిస్థితులు గమనిస్తే.. కార్పోరేట్ కలాశాలల ఆల్ ఇండియా ర్యాంకుల ప్రకటనలు ఆలోచనలో పడవేస్తాయి.

పదికే ఆ కార్పోరేట్ విద్యా సంస్థల్లో వేస్తారు.

ఈ మధ్య ఒలింపియాడ్ గట్రా అని వచ్చే ప్రకటనలతో.. ఎనిమిది నుండి వెయ్యడానికి ప్రయత్నిస్తారు.

పది వరకు అన్ని సబ్జెక్ట్స్ లో రుబ్బుతారు, అందరినీ. ఫలితాలు వస్తాయి.

బాగా వస్తే పర్లేదు అనుకొంటారు. బాగా రాకుండా పాస్ అయినా.. ఇంట్లో వుండి వుంటే మొబైల్ వలన అది కూడా జరిగివుండదు అని సంతోషిస్తారు.

ఇక ఇంటర్లో అసలు తంతు మొదలవుతుంది.

ఇందులో ఇంజినీరింగ్ కోసం జె ఈ ఈ, మెడికల్ కోసం నీట్ ట్రాక్స్ మొదలవుతుంది.

జె ఈ ఈ వాళ్లకు మ్యాథ్స్, పిజిక్స్ & కెమిస్ట్రీ మీద ఫోకస్ చేస్తారు. లాంగ్వేజీలు గట్రా ఎక్కువ పుష్ చెయ్యరు.

నీట్ వాళ్లకు పిజిక్స్, కెమిస్ట్రీ & బోటనీ మీద ఫోకస్ చేస్తారు. లాంగ్వేజీలు గట్రా ఎక్కువ పుష్ చెయ్యరు.

కానీ పాస్ గ్యారెంటీ లెవెల్ లో ఇంటర్ బోర్డుకు తగ్గట్లుగా ప్రిపేర్ చేస్తూ.. ఎంట్రన్స్ ఎగ్జాంస్, మరియు స్టేట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ మీద ఫోకస్ చేస్తారు.

జంబ్లింగ్ పద్దతిలో 10కి అయినా ఇంటర్కు అయినా వేరే స్కూల్లలో పరీక్షలు వ్రాయాలి కాబట్టి, అక్కడ పరిస్థితులు ఎలా వుంటుందో అని చక్కగా రుబ్బుతారు. గుడ్డిగా, ఎలాగో మేనేజ్ చెయ్యవచ్చు అని అస్సలు చదివించకుండా మాల్ ప్రాక్టీసులు చెయ్యడానికి ప్రయత్నాలు చెయ్యరు.

ఎందుకంటే ఇతర స్కూల్ల సెంటర్లలో అన్ని చోట్లా అవినీతికి పాల్పడే వారు వుండరు.

ఇక్కడ సిట్టింగ్ & మొబైల్ స్క్వాడ్ లు పెట్టి స్ట్రిక్ట్ గా పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద వుంటుంది.

కొచ్చన్ పేపర్స్ బండిల్స్ మీద సీల్లు వేసి, పరీక్షల సమయానికి ముందుగా చేర్చి, అక్కడ పరీక్షలు నిర్వహించే హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ సమక్షంలో ఓపెన్ చేసి, సంతకాలు పెట్టించుకోవాలి.

అక్కడి నుండి ప్రశ్నాపత్రాలు పరీక్షా హాళ్లకు వెళ్లాలి.

అక్కడ సిట్టింగ్ & మొబైల్ స్క్వాడ్లు వుండి జాగ్రత్తగా మాస్ కాపీయింగ్ జరగకుండా, ప్రతిభను వెళికితీసే విధంగా, కష్టపడ్డ వారికి ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వాలే నిర్వహించాలి.

ఇక్కడ కార్పోరేట్ సంస్థల పాత్ర ఏదీ వుండదు. అవి ఏవీ తోక త్రిప్పకుండా, వక్ర మార్గాలకు పాల్పడకుండా.. పటిష్టంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

కేవలం కథలు చెప్పి, నెపం కార్పోరేట్ స్కూల్ల మీదకు నెట్టి తప్పించుకోవడానికి, ఎవడో ఒక బకరాను అప్రూవర్ గా మార్చి, కేసులు పెట్టి, అరెస్టులు చేసి, కోర్టులకు వెలితే, ప్రభుత్వ బాధ్యత గురించి అఫిడవిట్ ద్వారా చెప్పాల్సి వస్తుంది.

నారాయణ అరెస్టు తరువాత చెప్పిన కామెడీ ఏమిటి అంటే, వాట్సాప్ లో కొచ్చన్లు ఫార్వార్డ్ చేసుకొంటూ పట్టుబడిన ఇతర విద్యా సంస్థల వాళ్లు, ఒకప్పుడు నారాయణ సంస్థల్లో పనిచేశారు కాబట్టి, కాన్సిపిరెన్సీకి అవకాశం వుంది అని చెప్పడం.

వాళ్లు ఫార్వార్డ్ చేసుకొని, ఆన్స్వర్లు వ్రాసి ఫార్వార్డ్ చేసినా… ప్రభుత్వ బోర్డుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. బాధ్యత ప్రభుత్వానిదే. బయట ఎన్ని కుట్రలకు పాల్పడినా, అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. లీకేజీ మొదలయ్యి, మళ్లీ కాపీలు జరిగేది ప్రభుత్వ నిర్వహణలో వుండే పరీక్షా కేంద్రాల దగ్గర కాబట్టి, బాధ్యత వారే వహించాలి. మేము అరికట్టాం, కానీ వాళ్లు కుట్ర పన్నారు అని అరెస్టు చేసి ప్రవేశ పెడతాం అనే కథలకు కోర్టులో సాక్ష్యాలు & విచారణ సంవత్సరాలు పడుతుంది.

మధ్యలో కార్పోరేట్ సంస్థల పేర్లు మీడియాలో వచ్చి దేశంలో పరువు పోతుంది. ఇవి రేపు క్యాంపస్ ఇంటర్వ్యూల మీద, రాష్ట్ర నిరుద్యోగుల మీద ప్రభావితం చూపి, ఆంధ్రాలో కాపీయింగ్ జరుగుతుంది అంట కదా అనే చిన్న చూపుకు దారి తీస్తుంది.

కష్టపడి చదివినా.. ఆంధ్రాకు వచ్చే చెడ్డపేరు ధీర్ఘకాలం భావి విద్యార్థుల మీద పడుతుంది.

ఆకతాయిగా కాకుండా.. విద్యా వ్యవస్థలో ప్రక్షాళనకు ప్రివెంటివ్ మాల్ ప్రాక్టీస్ కు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొంటే మంచిది.

రాజకీయ అవసరాలకోసం బురద జల్లి, ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి, పదికి ఇంటర్ పరీక్షలకు తేడా తెలియకుండా.. ప్రవేశ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో అవగాహన లేకుండా ర్యాంకుల కోసం ఇలా కార్పోరేట్ సంస్థలు చేస్తాయి అనడం తప్పు. పదికి ర్యాంకులు తీసేసి, గ్రేడ్లు ఇస్తారని తెలియకుండా మంత్రులు మాట్లాడ్డం, వారికి ప్రస్తుత విద్యా వ్యవస్థ మీద అవగాహనా లేమిని చూచిస్తుంది. #చాకిరేవు.

0 స్పందనలు to “పది & ఇంటర్ మధ్య వ్యత్యాసం తెలుసా?”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • చిక్కీ మీద బొమ్మలు వేసుకుని మురిసే అల్పసంతోషంతో ఆగక, ఐదు మంది పిల్లలను అమెరికా యాసలో భజన చేసే వారిగా తీర్చిదిద్ధి… twitter.com/i/web/status/1… 8 hours ago

వీక్షణలు

  • 962,674

తడి ఆరని ఉతుకులు

మే 2022
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: