తమ్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకొనే రోజా అక్కయ్యా,

తమ్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకొనే రోజా అక్కయ్యా,

“చంద్రబాబు వెన్నుపోటు, శవ రాజకీయాలు చేస్తున్నారు – కరోనాతో తిరుపతి ఎంపీ చనిపోతే సంప్రదాయలకు విరుద్దంగా చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారు” అని వైసీపీ ఎమ్మెల్యేగా మీరు సెలవిచ్చితిరి.

అక్కడ చనిపోయిన బల్లి దుర్గాప్రసాద్ గారు ముందు టిడిపి పార్టీలో వున్న వారే. ఆయన చేత గత ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టించి గెలిపించింది మీ వైకాపా పార్టీ. ఇప్పటికిప్పుడు మళ్లీ డబ్బులు అంటే ఆ కుటుంబానికి కష్టం. మీ పార్టీకి పైసలు తియ్యాలంటే మనసురాదు. బల్లి దుర్గా ప్రసాద్ గారికి ముందు అక్కడ ఎంపీగా వున్న వరప్రసాద్ గారికి ఎంపీ సీటు ఇవ్వకుండా ఎమ్మెల్యేగా తరిమేస్తిరి. ఇప్పుడు ఆయన మీద అక్కడ వైకాపా కార్యకర్తలను ఉసిగొలిపి గొడవలు చెయ్యిస్తున్న విషయం మీడియాలో చూసే వుంటారు.

వాడుకొని కరేపాకులా తీసేసే వైకాపా నీజం విషయాలు ప్రక్కనబెడితే, ఇక మీ పార్టీ నుండి దుర్గా ప్రసాద్ కుటుంబానికి ఎంపీ పదవి ఇస్తామని అన్ని పార్టీలను మీరు సంప్రదించి వుండాలి. మీరు నంద్యాలలో భూమా కుటుంబం విషయంలో సాంప్రదాయాలు పాటించారా? పైగా అమ్మ చనిపోయింది అని కూడా చూడ కుండా బిడ్డ పైజామా డ్రెస్స్ మీద కూడా మీరు నోరుపారేసుకొని పేలినది మీకు గుర్తుండే వుంటుంది.

తిరుపతి లోక్‍సభ ఉపఎన్నికలో కొత్త అభ్యర్థి డా.గురుమూర్తికి అవకాశం ఇచ్చారు మీ తమ్ముడన్నయ్య జగన్. ఆయన జగన్‍కు వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ – పాదయాత్రలో తమ్ముడన్నయ వెంటే సేవలు చేసిన వ్యక్తి.

బల్లి దుర్గా ప్రసాద్ గారి కుటుంబానికి ఎమెల్సీ ఇస్తామని మీ పార్టీ ఓ ఆశ చూపి, వారికి ఎంపీ సీటు విషయంలో మొండి చేయి చూపింది.

అధికారంలో వుంటే తమ్ముడి వయసున్న వారిని కూడా అన్నయ్య అని ఆశీర్వాదాలు తీసుకొనే మీరు, ఇప్పుడు చెప్పండి సాంప్రదాయాల గురించి. #చాకిరేవు

0 Responses to “తమ్ముడి దగ్గర ఆశీర్వాదం తీసుకొనే రోజా అక్కయ్యా,”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • తిరుపతిలో దుబ్బాక డ్రామా రోజా గారితో అరంగేట్రం చేయించారా? https://t.co/DPcsH6Qmvk 34 minutes ago

వీక్షణలు

  • 952,126

తడి ఆరని ఉతుకులు

నవంబర్ 2020
సో మం బు గు శు
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: