లోకేష్ మీద దాడి విషయంలో బాబు గారి చాదస్తాన్ని తప్పుపడుతున్న శ్రేణులు

లోకేష్ మీద దాడి విషయంలో బాబు గారి చాదస్తాన్ని తప్పుపడుతున్న శ్రేణులు

ఇచ్చిన శాఖల్లో చాలా పనులు చేసే, అందరి మంత్రులకంటే, లోకేశ్ ఎక్కువగా శ్రమించి, అవార్డులు తెచ్చిపెట్టారు జాతీయ స్థాయిలో ఆంధ్రాకు.

ఇక బాష విషయంలో ఈ రోజు సిఎం హోదాలో రికార్డెడ్ ప్రెస్మీట్లలో జగన్ రెడ్డి గారి కంటే 100 రెట్లు లోకేశ్ బాగా మాట్లాడుతారు. ఏ రోజూ ప్రెస్మీట్ కి గాని, ప్రశ్నలకు గాని వెనుకంజ వేయలేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో అజైల్ గవర్నెన్స్ మీద పనిచేసినప్పుడు, ప్రపంచ వేదిక మీద మాట్లాడ్డంలో కాని, అక్కడ వేసిన ప్రశ్నలకు, రాష్ట్రంలో చేపట్టిన పనులకు, పైలట్ క్రింద చేపట్టిన పనులకు మ్యాప్ చేసి, పీఓసీ క్రింద చెప్పిన విధానం గాని ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక ప్రశంశలు కురిపించింది.

కార్యకర్తల విషయంలో ఇన్సూరన్స్ తెచ్చి, మెంబర్షిప్ వున్న వారి కంతా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం కట్టి, కోట్లాది రూపాయలను ప్రమాదంలో మరణించిన వారికి, కాల్ సెంటర్ పెట్టి మరి ఇప్పించి ఆదుకొని, యావత్తు పార్టీ, నాయకులు & కార్యకర్తల ప్రశంసలు అందుకొంది. ఇది కాకుండా, పెళ్లి, విద్య, ఆర్థిక పేదరిక కష్టాలు, ప్రమాదాలు, దాడులు, మరణాలు సంభవించి, బాధిత కార్యకర్తలు లోకేశ్ పేరున లేఖ వ్రాస్తే, దానిని ఆన్లైన్ లో నమోదు చేసి, వారి బాధల మీద విచారణ చేసి, నిజాయితీ కలిగిన కార్యకర్తలకు సాయం చేసిన విషయంలో పార్టీ పరంగా అంతా ప్రశంసించారు.

అటు పార్టీ పరంగా ఇటు రెండు కీల శాఖల పరంగా పని ఒత్తిడిలో శ్రమిస్తుంటే, వైకాపా ఒక పద్దతి ప్రకారం చేసిన విమర్శల మీద గాని, ఏకంగా మోడీ గారు కూడా లోకేశ్ గారి విషయంలో స్పందించిన విషయంలో కాని, లోకేశ్ ని కాపాడే విషయంలో చంద్రబాబు గారు నిమ్మకు నీరెత్తి వుండడమే కాదు, నాయకులకు అప్పగించి ఎప్పటికప్పుడు ఖండించలేదు. ఆఖరికి, గెలవని స్థానంలో నిలబెట్టి, ఎన్నో కుట్రలు పన్ని ప్రత్యర్థులు ఓడిస్తున్నా, దృష్టి సారించిన దాఖలాలు లేదు.

ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నా, ఓ వైపు తాత, ఓ వైపు తండ్రి, మరో వైపు మిగిలిన కుటుంబ సభ్యులతో పోలికలు పెడుతూ జరిగిన ప్రచారంలో కూడా, ఆంధ్రాలో ప్రతి పల్లెలో సిమెంటు రోడ్డులు వేసి, గత ప్రభుత్వాలు వేసిన దానికి 4 రెట్లు చేసి చూపాడు.

వైకాప విష ప్రచారానికి విరుగుడుగా ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లేలా చేసి త్రిప్పికొట్టలేకపోయింది యావత్తు పార్టీ యంత్రాంగం.

అయినా ఓటమికి కృంగిపోకుండా, ఈ లాక్డౌన్లో కూడా ఈ ఆన్లైన్ మహానాడు వేదికకు శ్రమిస్తూ, వైకాపా పెట్టిన కేసుల్లో ఇరుక్కొన్న ప్రతి సోషల్ మీడియా కార్యకర్తకు అడుగడుగునా అండగా వుంటూ, తన బాడీ వైట్ 20 కేజీలు తగ్గించుకోవడం, నాయకుడైన తన తండ్రికి కుడి భుజంలా వుంటూ, కార్యకర్తల్లో లోకేశ్ మంచి పేరు తెచ్చుకొన్నారు.

దీని వెనుక లోకేశ్ స్వయంకృషి ఎక్కువ వుంది.

తన తనయుడి విషయంలో అసెంబ్లీలో ఆరోపణలు వచ్చినప్పుడు, వైస్సార్ తన నాలుక నరాన్ని నొక్కి పెట్టుకొంటానని, గట్టిగా వెనకేసుకొచ్చాడు అధికారంలో వున్నప్పుడు. అమాత్యులందరినీ తనయుడికి అండగా మాట్లాడించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు తను సిఎం గా వున్నప్పుడు జగన్ కోసం ఎన్ని విధాలుగా ఆనాటి ప్రభుత్వం రక్షణ చర్యలు చేసిందో చెప్పుకు వచ్చారు.

తమ్ముడి పార్లమెంటు సీటును తనయుడికి ఇప్పించి, గెలిపించారు వైస్సార్ గారు. కానీ చంద్రబాబు గారు లోకేశ్ విషయంలో వైఎస్సార్ లా ఎందుకో ఎక్కువగా దృష్టి పెట్టలేదు.

ఉన్నత చదువుల పరంగా గాని, కుటుంబం నిర్వహించిన వ్యాపర పనుల్లో గాని, ప్రపంచ బ్యాంకు తరపున పేద దేశాల్లో పనిచేసిన అనుభవంతో గాని, బాబు గారికి ఎప్పుడూ లోకేశ్ చెడ్డపేరు తీసుకు రాలేదు. పైగా నాయకత్వం విషయంలో నాన్నకు అడుగడుగునా అండగా వుండి, ప్రతి పార్టీ నాయకుడిని & తన కంటే పెద్ద వారైన కార్యకర్తను కూడా తనను కలిసినప్పుడు ఆప్యాయంగా అన్నా అనే లోకేశ్ విషయంలో పార్టీ తనకు అంతగా అండగా నిలబడలేదనే విషయం తెలుగుదేశం అంతర్మధనం చేసుకోవాల్సిన విషయం. #చాకిరేవు.

1 Response to “లోకేష్ మీద దాడి విషయంలో బాబు గారి చాదస్తాన్ని తప్పుపడుతున్న శ్రేణులు”


  1. 1 Anon 9:38 ఉద. వద్ద మే 28, 2020

    పెళ్ళికుమారా రావయ్యా మా భాగ్యం కొద్దీ దొరికావయ్యా

    ముల్లోకాలను వెతకి తెచ్చిన అల్లుడవంటే నీ వయ్యా

    పల్లకి దిగిదిగి రావయ్యా తతంగమంతా నీకయ్యా
    ఈ తతంగమంతా నీకయ్యా
    హై హై వై వై కై కై గై గై జియ్యా

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,798

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: