మీ పాలన – నా సూచన

మీ పాలన – నా సూచన

ఇంగ్లీష్ మీడియం చదువులు బాగా చెప్పించి, కొలువుల్లో కుదురుకొనేలా చేస్తే దానికన్నా భాగ్యం మరొకటి లేదు.

ప్రాథమిక పాఠశాల వున్న ఓ ఊర్లో, ప్రస్తుతం వున్న టీచర్ ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్పగలడా అని సర్వే మొదలెట్టండి. వారికి ఆంగ్లంలో గ్రూప్ డిస్కషన్ లాంటి పరీక్షలు నిర్వహించి చూడండి, ఎన్ని లక్షల మంది ఆంగ్లమీడియం బోధించడానికి అనువైన వారో మీకు ఒక అవగాహన వస్తుంది.

ప్రస్తుతం ఆగ్ల మీడియంలో చదివిన వారి సంఖ్య మీద, తెలుగు మీడియంలో చదివిన సంఖ్య మీద సర్వే చేపట్టండి, ఉద్యోగ & ఉపాధి అవకాశాలలో ఏ మీడియం చదివిన వారు స్థిరపడ్డారో ఒక అవగాహన వస్తుంది.

ఆ రెండిటి మీద మీకు వచ్చిన అవగాహనను జనానికి చెప్పండి.

ఇంగ్లీష్ మీడియం చదివితే వచ్చే ఉద్యోగాల శాతం ఎంత, స్వయం ఉపాధి రంగాలైన ఇతర పనులలో రాణించాలంటే, కావాల్సిన తెలివితేటలకోసం, ఆంగ్ల మీడియంలో భోధిస్తే, ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడిపోయినట్టు అది కూడా హులుక్కి అవుతుందా అనే శాస్త్రీయ సోధన కూడా అవసరం.

ఐటిఐ మరియు ఇతర చేతి పనులలో స్థిరపడ్డానికి ఆంగ్లమీడియాలలో చదివిస్తే పదివరకైనా వచ్చి దానిని పాసయ్యి, స్వయం ఉపాధి రుణాలకు అర్హత సాధిస్తారా అనే ఆలోచనను కూడా మనం చేసుకోవాలి.

ప్రపంచంలో ఏ జాతీ మాతృబాషలో బదులు పూర్తిగా 100 శాతం ఆంగ్లంలోనే చదువుకోవాలని చదివి ఓ రెండు దశాబ్దాల డాటా వుండి వారిలో నైపుణ్యాలు, తెలివి తేటలు ఎలా వున్నాయో పరిశోధనాత్మక విశ్లేషణ ఏదైనా ప్రపంచంలో వుంటే ప్రజల ముందు పెట్టండి.

అన్నింటికీ అనుకూలంగా వుంటే బంగారంగా ఇంగ్లీషు మీడియంలలో చదివించండి గుంపగుత్తగా రాష్ట్రాన్ని మొత్తం. అలాగే, వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన మన ఆంధ్రాలోని వ్యవసాయ విధానాన్ని పెద్దల నుండి ఆంగ్లీకరించండి. కార్తెలు, రుతువులు, విత్తనాలు చల్లే కాలం, అరక దున్నే పద్దతి మొత్తం.

ఎందుకంటే ఆంగ్లంలో చదువుకొని వచ్చిన వారికి అవన్నీ అర్థం కావాలి కదా. వీలైతే, కడపలో బ్రౌన్ నిఘంటువులా, మన తెలుగు పదాలను ఆంగ్లీకరించే ప్రయత్నం చెయ్యండి.

దేశంలో సంపూర్ణ ఆంగ్ల విద్యా రాష్ట్రంగా మారిపోతే భవిష్యత్తులో ఏ ఇబ్బందులూ రాకుండా అన్ని రకాల చర్యలూ తీసుకొని, ముందుకు వెళ్లండి. జనం తప్పక మెచ్చుకొంటారు.

లేదు కోర్టులు చెప్పినా నేను పట్టిన కుందేలుకు మూడు కాల్లే అంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు, జాలిపడ్డం తప్ప. భవిష్యత్తులో నష్టపోయినప్పుడు తిట్టుకోవడం తప్ప. #చాకిరేవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,798

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: