కొడిగట్టిన దీపంలాంటి సినిమా పరిశ్రమ కోసం బాధపడకయ్యా బాలయ్యా?

కొడిగట్టిన దీపంలాంటి సినిమా పరిశ్రమ కోసం బాధపడకయ్యా బాలయ్యా?

లాక్డౌన్ లో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని సినిమాలు చూసినా, ముందు స్థాయిలో హాళ్లకు వచ్చి ఎగబడి చూసే పరిస్థితులు వుండవు, రాబోవు. అదంతా గతం, గతం గతః.

లోబడ్జెట్లో, కథనే నమ్ముకొని, విభిన్న పాత్రల్లో, దర్శకునికి అడ్డుతగలకుండా చెప్పినట్టు ఒదిగిపోయే, అహం లేకుండా మిగిలిన పాత్రల్లో ఒకటైన తన పాత్రలో ఒదిగిపోయే నటనతో మెప్పించే సత్తా వుండే వారి కాలం మొదలవబోతోంది.

అందులో మీ నాన్నది ఒక రకమైన ప్రపంచం మెచ్చే నటన అయితే, ఆయన ఛాయలు లేని నీడ పడని స్వయం కృషి మీది.

ఇక మీదట.. ఆనలైన్లో .. నచ్చాలి. లీజుకు వేసిన థియేటర్లలో మిగిలిన చిత్రాలను ఆడకుండా అడ్డుకొని, తమ చిత్రాలనే రన్ చేసి, శతదినోత్సవాలు చేసే రోజులు పోయాయి. సత్తా లేని కుటుంబాలు & వారసత్వాలకు మొహం చెల్లిపోయే రోజులు దాపురించాయి.

నాన్న కుర్చీ కావాలని, నాన్న స్థానం కావాలని కాకుండా.. నీకు జనం ఇచ్చిన స్థానం, ప్రేక్షకులు మెచ్చిన స్థానంతో సంతృప్తిగా వున్నావు.

నిన్ను కన్న తల్లి పేరుతోని కేన్సర్ మహమ్మారి చికిత్సాలయంలో నీ నిరంతర శ్రమ సేవా గుణమై సమాజానికి కనిపిస్తోంది. నిరుపేద కళాకారులకు మొన్న నీ వంతు కరోనా సాయంతో కళామతల్లి గర్విస్తోంది.

నిన్ను పరిశ్రమ పిలిస్తే ఎంత పిలవక పోతే ఎంత. నీ వివిధ రంగాల పరిశ్రమ ముందు ఆ సినీ పరిశ్రమ ఒక మరుగుజ్జు.

నాటక రంగంలా.. వెండి తెరకు తెరపడే కూడలిలో నిలుచుని వుంది.

వెబ్ సిరీష్ మొదలెట్టు. తక్కువ బడ్జెట్ తో అతి తక్కువ రోజుల్లో శాతకర్ణిలా విజృంభించు. తిరిగి చూసుకొంటే గర్వించే విభిన్న పాత్రల్లో నటించు. ఒక బాలక్రిష్ణుడిలా పరిశ్రమలోని పరిపక్వతలేని వారి పిల్ల చేష్టలతో చిన్నబుచ్చుకోకు.

ఆ పరిశ్రమలోని బెక బెకల కప్పల నుండి బయట జనాన్ని చూడు అర్థం చేసుకో. పుష్కరాలు చూడ్డానికి వచ్చినట్టు జనం ఇక రారు. అరచేతుల్లో, ఇంటి గుమ్మంలో ముందుకొచ్చి అలరించే వైపు నీ అల్లరిని పంచి బాలయ్యలా నీ అభిమానులకు కనువిందు చెయ్యి. #చాకిరేవు.

2 Responses to “కొడిగట్టిన దీపంలాంటి సినిమా పరిశ్రమ కోసం బాధపడకయ్యా బాలయ్యా?”


  1. 1 Anon 3:04 సా. వద్ద మే 28, 2020

    పరిపక్వతలేని వారి పిల్ల చేష్టలతో చిన్నబుచ్చుకోకు. – మరి బుల్ బుల్ పిచ్చి మాటల విషయం ఏమిటి. అభిమానులపై చేయి చేసుకోవడం ఏమిటి. అసలు తాను ఏమి చెబుతాడో అర్థం అవుతుందా. ఇగో వదిలి పెట్టేసి అందరితో కలవ గలడా.
    అసలు 60 ఏళ్ళ పై బడిన తాత హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలు వేస్తే బాగుంటుంది.

    కూతురి వయసు హీరోయిన్ తో గంతులు ఏమిటి.
    ఈ రేంజిలో వీర భజన ఏమిటి భాయ్.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  2. 2 అనామకం 2:58 సా. వద్ద మే 29, 2020

    అవును మరి మిగత వాళంతా యువకులు మరి.

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,799

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: