అమాత్యులుగా పెద్దిరెడ్డికి బాధ్యత లేదా?

అమాత్యులుగా పెద్దిరెడ్డికి బాధ్యత లేదా?

పంచాయితీ భవనాలకు రంగుల విషయంలో, హైకోర్టు అలా చెయ్యకండి అన్నా, మళ్లీ మూడు రంగులకు మరో రంగు కలిపి వేసి, కోర్టు ఆగ్రహానికి గురై, కోర్టు ధిక్కారణ క్రింద ఆ శాఖ విచారణను ఎదుర్కొంటోంది ఈ రోజు హైకోర్టులో.

ఆ శాఖ అమాత్యులు పెద్ది రెడ్డి గారు, ఆ శాఖలో కార్యదర్శి గోపాల్ క్రిష్ణ ద్వివేది గారు. ఇద్దరూ అనుభవం వున్న వారే. గోపాల క్రిష్ణ గారు రాజ్యాంగబద్ధ పదవి రాష్ట్ర ఎన్నిక్ల కమీషనర్ గా కూడా పనిచేసిన అనుభవం వుంది.

వీరిద్దరికీ అనుభవం వున్నా, ఆ శాఖ చేసిన రంగుల విషయం తెలిసీ.. ఎందుకు పార్టీకి నచ్చచెప్పి, ఆపలేకపోయారు? కోర్టు ఆగ్రహానికి గురైయ్యేలా మళ్లీ మరో రంగు వేసి, మా పార్టీ రంగులు కాదని వాదిస్తే కోర్టు ఎలా ఒప్పుకొంటుంది అని అనుకొన్నారు?

ఈ రోజు కమీషనర్ గిరిజా శంకర్ గారు, హైకోర్టు విచారణకు హాజరయ్యారు. కోర్టు కేసును వాయిదా వేసింది.

పంచాయితీ రాజ్ ఎక్కువగా కేంద్ర నిధులతో పనిచేస్తుంది. కేంద్రం కూడా ఈ విషయంలో కలగజేసుకొనే అవకాశాలు ఎక్కువగా వుంటుంది. ఒక్క పంచయితీ భవనాన్ని కూడా నిర్మించకుండా, ముందు ప్రభుత్వాలు నిర్మించిన పంచాయితీ భవనాలకు రంగులు వేస్తే, జనం నవ్వుకొంటారు అని తెలిసినా, ఏ ప్రయోజనం ఆశించి ఆ రంగుల మీద అంత పట్టుదలకు పోయారు. అన్నీ తెలిసి చెప్పుడు మాటలు చెప్పారా? వైకాపాలో మేధావులు ఈ విషయంలో కోర్టు ధిక్కారణ వరకు వస్తుంది అని ఊహించలేక పోయారా?

కోర్టు ఆగ్రహానికి గురయ్యేలా ఈ పనులు చెయ్యడం వలన ప్రయోజనం ఎవరికి కలుగుతుంది? వ్యక్తిగతంగా నాయకుడి మీద సిబిఐ & ఇతర కేసులు వున్నాయి. పరిపాలనలోని జీవోల మీద, చాలా నిర్ణయాల మీద కోర్టులలో కేసులు దాఖలు అవుతున్నాయి. ఇలాంటి సంధర్భాలలో కూడా అసంధర్భంగా ఎందుకు రంగుల విషయంలో, సరిదిద్దుకోలేకపోయింది.

ఎందుకు పట్టుదలగా కోర్టు చెబుతున్నా మరింత ముందుకు వెళ్లి అభాసుపాలు అవ్వడమే కాక ఆగ్రహానికి గురయ్యేలా చేశారో, వైకాపా ఎందుకు విశ్లేషణ చేసుకోలేకపోతోందో, రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వైకాపాలో అంతర్మధనం జరిగేనా, తప్పొప్పులు విశ్లేషణ చేసుకొంటుందా? అనవసరంగా కోర్టులచేత తలంటుకొనే తప్పులను సరిదిద్దుకొంటుందా? లేదా అహంకారంతో మరింత పట్టుదలతో అప్పీల్లకు పోయి, జాతీయ స్థాయిలో మరింత చెడ్డపేరు మూటగట్టుకొంటుందా, వేచి చూడాలి. #చాకిరేవు.

0 Responses to “అమాత్యులుగా పెద్దిరెడ్డికి బాధ్యత లేదా?”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,799

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: