మే 27th, 2020ను భద్రపఱచు

మహానాడు మొదటి రోజు ఎలా జరిగింది?

మహానాడు మొదటి రోజు ఎలా జరిగింది?

ఇదో వింత అనుభవం. నాలుగు దశాబ్దాల కాలంలో మొదటి సారి ఎవరింటి దగ్గర నుండి వారు పాల్గొన్నారు. ఒకే సారి పదివేల మందికి పైగా లాగిన్ అయి వుంటే ఇతరలుకు వీక్షించే అవకాశం రాదు. అలా పెద్ద ఎత్తుకొన్న … చాలా సార్లు కంప్లైంట్లు వచ్చేసరికి, వారందరికీ, యూట్యూబ్ లింక్ ద్వారా, ఎఫ్ బి లైవ్ల ద్వారా వీక్షించే అవకాశం కల్పించారు.

పొద్దున 11 నుండి సాయంత్రం 6.45 వరకు అంతర్జాల జూం ఆప్ ద్వారా మహానాడు జరిగింది.

ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి పాల్గొనే అవకాశం వస్తే, రోజుకు లక్షమంది వెళ్లినా, ఇంత ఓపికగా ఒకే సారి 50 మంది వరకు ఇలా అన్ని రకాలుగా వీక్షించే వారు కాదేమో.

పార్టీ అధికారం కోల్పోయాక, నాయకులు చేసిన తీర్మానాలు, దానిని ఆమోదించడాన్ని శ్రద్ధగా ఆలకించింది, ప్రపంచం నలుమూలల నుండి పెద్ద ఎత్తున శ్రేణులు.

లాక్డౌన్లో మొదటి సారి చేసిన ప్రయోగం కాబట్టి, టెక్నికల్గా వాల్యూం మూట్ చేసుకొని, వెంటనే స్పందించడానికి కొందరు తడబడ్డం, అప్పుడప్పుడూ స్వల్ప అంతరాయాలు జరగడం సరిదిద్దుకొని, కొత్తగా వినూత్న పద్దతిలో మొదటి రోజు విజయవంతంగా మహానాడు మహాసభలను ఓ ప్రాంతీయ పార్టీ పూర్తి చేసుకోగలిగింది.

టెక్నాలజీని వినియోగించకోవడంలో … బడా కార్పోరేట్లు, జాతీయ పార్టీలు, అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా గట్రా దేశాలను మించి ఈ రోజు ప్రయోగాత్మకంగా, ఓ చోట గుమికూడ కుండా, అరచేతుల్లో, ఇంటి నుండి పాల్గొనే పద్దతిని విజయవంతంగా వాడి ప్రపంచానికి ఆదర్శంగా & మార్గదర్శకంగా నిలిచారు.

నాయకులు కూడా, విషయాన్ని సూటిగా, సమస్యల మీద ఖచ్చితమైన దృష్టిపెట్టి, అధికార పార్టీకి, వారి అసమర్థతను గుర్తుచేసేవిధంగా మంచి చర్చకు తెరతీశారు.

యథావిధిగా .. లేవనెత్తిన చర్చలపైన, తీర్మానాలపైన, వైకాపా ప్రతిస్పందనా తీరు నేరుగా వుంటుంది అని ఆశించండం లేదు. ఎదురుదాడి చేసి, బూతులతో, విషయం ప్రక్కదారి పట్టించి, వారి వైఫల్యాలపైన చర్చకు ముందుకు రాకుండా.. తప్పించుకొనే అవకాశాలే ఎక్కువ.

ఉదయమే, సమావేశం ప్రారంభం అయ్యీ అవ్వక ముందే చిన్న పిల్లల్లా, లాక్డౌన్ నిబంధనలు పాటించమంటూ నోటీసులు ఇవ్వడం, వారి ఏకాగ్రతను దెబ్బతియ్యడానికే అని ఆంధ్రాకు అర్థం అయ్యింది.

ఇదే రీతిన, మంత్రులను అధికారులను సమావేశపరిచి, స్పందిస్తే ప్రతిపక్షం చేసిన ఆరోపణలకు సరైన విధంగా స్పందించారు అని జనం గ్రహిస్తారు. తప్పించుకొంటే, ప్రతిపక్షం చేసే ఆరోపణలు నిజమని జనం నమ్ముతారు.

ప్రతి మహానాడుకూ పెట్టే ఖర్చులో, కేవలం 10% కూడా పార్టీకి ఖర్చుకాని విధంగా, కార్యకర్తలకు & నాయకులకు వచ్చి & పోయే ఖర్చులు, మరియు అక్కడ వుండి బస చేసే ఖర్చులు మిగిలి, బ్రహ్మాండంగా ఏకాగ్రతతో అన్ని చర్చల్లో తనకు అనువైన చోటు నుండి పాల్గొనే గొప్ప అవకాశం కలిగింది.

నాయుడికి ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు అని దేశంలో మిగిలిన నాయకులు, ప్రపంచ నాయకులు చెప్పుకోదగ్గ కార్యక్రమంగా ఇది చరిత్రలో మిగిలిపోతుంది.

ఎందుకు ఓటమి చెందామో, ఆత్మ పరిశోధన చేసుకోవడం మాని బురద జల్లే కార్యక్రమం చేసిందనే విమర్శలు ఎన్ని ఎదురైనా.. ఏ పార్టీ కూడా తమ పార్టీ పండగల్లో అవి చేసుకోదని వారికీ తెలుసు. పబ్లిక్ గా ఆ చర్చలు చేపట్టి, శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపదు. ఉత్సాహం వచ్చేలా, శత్రుపార్టీల మీద శర పరంపర వదిలి, తమ పాలనతో బేరీజు వేసి వాస్తవాలను తమ శ్రేణులకు వెళ్లడించి, విశ్లేషణ చేయడంలో మొదటి రోజు తెలుగుదేశం విజయవంతం అయ్యింది అని చెప్పవచ్చు. #చాకిరేవు.


ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,799

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: