మే 26th, 2020ను భద్రపఱచు

మళ్లీ ఆనాటి రోజులు

మళ్లీ ఆనాటి రోజులు

భారీ రిసెప్షన్లు. వేకువ ఝామున ముహూర్తాలలో భారీ కల్యాణమండపాలు అయినా ముహూర్తం సమయానికి పాతిక నుండి వందలోపు సొంత & బంధువులే. ఫోటో గ్రాఫర్ల కోసం జరిగే తంతులా, లక్షల్లో నుండి కోట్ల వరకు ఖర్చు, అంతా గతం.

తాజాగా ఊర్లలో సొంత ఇంటి గుమ్మమే కల్యాణ వేదిక, ఊరంతా సందడి, పాతరోజులను తలపిస్తోంది. ఖర్చు తగ్గిపోయింది. అందరూ ఆనందంగా ఇలాగే కరోనా లాక్డౌన్ తరువాత కూడా జరిగితే బావుండు అని కోరుకొంటున్నారు.

మహానాడు వేదిక కూడా … అలా కొత్తగా, అరచేతిలో తిలకిస్తూ, వేలాది మంది పాల్గొనేలా.. ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఏటా మహానాడుకు వచ్చి పోవడానికి కార్యకర్తలకు, నాయకులకు తడిసి మోపెడయ్యేది ఖర్చులు. పార్టీకి వంటల నుండి వేదికల ఖర్చుల వరకు భారీగా అయ్యేది.

చడీ చప్పుడు లాగా హైదరాబాదులో నుండి మహానాడు జరుపుకొన్న పార్టీగా బాధపడే క్షణాలను తప్పించుకొని, మంగళగిరి కార్యాలయ వేదికగా, అక్కడికి అడుగడుగునా అఖండ స్వాగతంతో రోడ్డు మార్గాన అరుదెంచిన నాయకుడితో, డిజిటల్ మహానాడు జరుపుకోడానికి ముస్తాబయ్యి, ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అధికార వైకాపా వేసిన రాజకీయ తప్పటడుగులనే నేటి మహానాడుకు పునాది రాళ్లుగా వేసి, ఆ ప్రచారంతో వచ్చిన కొత్త జోష్‌తో, తమ మహానాడును, అరచేతి ముందు కనుల విందుగా మార్చుతోంది. ఎలాగూ మీడియా ప్రచారం కూడా లభిస్తుంది. ఈ ఎండలకు, ఎక్కడి వారక్కడ, నెట్వర్క్ వున్న చోట నుండి హాయిగా పాల్గొనేలా మహానాడు జరుపుకోబోతోంది. ప్రపంచ చరిత్రలో మొదటి సారి ఒక ప్రాంతీయ పార్టీ వేలాది మందితో ఇలా తమ పార్టీ పండగ జరుపుకోవడం. శుభానికి సూచిక అయిన పసుపు రంగు పార్టీ అయిన తెలుగు దేశంకు అభినందనలు. ప్రజా గళం వింపించి, వాటి పరిష్కారాలకు, జనంలో చైతన్యానికి, కార్యకర్తల్లో ఉత్సాహానికి ఈ వేదిక ఉపయోగపడాలని, అలాగే ఇలాగే ప్రతి ఏడూ ఖర్చు తక్కువతో జరుపుకోగలరని ఆశిస్తూ… శుభాకాంక్షలతో. #చాకిరేవు.


ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,799

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: