మే 21st, 2020ను భద్రపఱచు

బడా & చోటా బాయిల మధ్య నాగబాబు గారూ..

బడా & చోటా బాయిల మధ్య నాగబాబు గారూ..

18 & 19 శతాబ్దాలలో ప్రపంచంలో ఎన్నో దేశాలు ప్రాణాలు పణంగా పెట్టి, పోరాడి స్వాతంత్య్రం సాధించాయి. చైనా తరువాత ఎక్కువమంది జనాభా గల మన దేశం లో కూడా ఎన్నో రకాల ప్రాణత్యాగాల పోరాటాలు జరిగాయి.

కానీ ప్రపంచం మొత్తం చెప్పుకొనేది మన గాంధీ గారి అహింసా పోరాటం గురించే. ఆయనను జాతి పిత అని మన దేశమే కాదు ప్రపంచం మొత్తం కీర్తిస్తుంది.

ఓ వీధి రౌడీ యథార్థ గాథ మున్నాబాయ్ ఎంబీబీఎస్. దాని తెలుగు అనువాదంలో మీ బడా బాయ్ చిరంజీవి గారు నటించి ప్రశంసలు పొందారు. అందులో గాంధీ గారి సిద్ధాంతం గురించి ఈ తరానికి అర్థం అయ్యేట్టు గొప్పగా తీశారు. గొప్ప విజయం సాధించింది. మన బాయ్ చిరంజీవి గారు కూడా గాంధీ సిద్ధాంతాన్ని కీర్తించారు.

ఆ స్వాతంత్ర పోరాటాల ఫలితమైన ప్రజాస్వామ్యంలో విజయం సాధించడానికి కుటుంబం 2 సార్లు ప్రయత్నించింది. భంగపడింది. నేడు కేంద్ర అధికార ప్రాపకం కోసం వారి పంచన మరో చోటాబాయి పార్టీ వుంది.

బిజెపిలో కూడా రక రకాల నాయకులు వున్నారు. అందులో కొందరు గాంధీని చంపిన గాడ్సే గురించి కీర్తించే వారు వున్నారు. ఆ పార్టీ మనకేసి ఆసక్తిగా చూడ్డానికా అన్నట్టు మీరు గాడ్సే గారి దేశ భక్తిని స్తుతించినట్టు కనిపిస్తోంది.

దేశం రాజులు, సంస్థానాలు ఏకంగా వుండి వుంటే.. ఆంగ్లేయులు ఆక్రమించే వారు కారు. వందల సంవత్సరాలు అణచివేస్తూ, ప్రాణాలు మానాలు తీస్తుంటే, అతి పెద్ద దేశమైన మనం వాడిన ఆయుధం అహింసా సిద్ధాంతం.

దేశాన్ని ప్రభావితం చేసి, ఏకతాటిపైకి తెచ్చి, దానిని వాడిన గాంధీ గారిని చంపిన వ్యక్తిని పొగడ్డం మీ వ్యక్తిత్వ విచక్షణకు వదిలేస్తూ.. మీ అభిప్రాయంతో మిమ్మల్ని మరింత లోతుగా అర్థంచేసుకొనే అవకాశం దొరికింది.

సోషల్ మీడియాలో గాని జనం గాని మీడియా గాని పట్టించుకోవాలంటే మనసులోని భావాలకు వ్యతిరేఖంగా బాహాటంగా అభిప్రాయాలను వెలిబుచ్చుతూ చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందులో మీరు ఒక్కరు అని అర్థం అవుతోంది. #చాకిరేవు.


ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,798

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: