మే 19th, 2020ను భద్రపఱచు

ఆంధ్రా పోలీసు వ్యవస్థ మీద రెడ్డి గారికి గద్దె ఎక్కాక నమ్మకం పెరిగి వుండొచ్చు

ఆంధ్రా పోలీసు వ్యవస్థ మీద రెడ్డి గారికి గద్దె ఎక్కాక నమ్మకం పెరిగి వుండొచ్చు

కానీ ప్రజలకు ఆ వ్యవస్థ మీద అపార గౌరవం & నమ్మకం వుంది.

ఆయన ప్రతిపక్షంలో వున్నప్పుడు
పదే పదే మన పోలీసు వ్యవస్థ మీద
అపనమ్మకపు మాటలు మాట్లాడి
పక్షపాతం అంటగట్టి
కుల రంగులు పూసి

ఆ వ్యవస్థ అంటే అదేదో పాలక పార్టీ తొత్తుగా
ఆయన మాట్లాడే వాడు

పొరుగు రాష్ట్ర దర్యాప్తులకు
సిబిఐ విచారణలకు మక్కువ చూపేవాడు

సిట్ నుండి సిఐడి వరకు
ప్రతి దాని మీద
పని గట్టుకొని
తన మీడియాతో పదే పదే
విమర్శించేవాడు

ఏ రోజూ ఆ మీడియాలో
ఎడిటర్స్ గిల్డ్ లేదా పాత్రికేయ విలువలకు కట్టుబడి
అన్ని పేజీలూ అచ్చేసింది లేదు
24 గంటలు ప్రసారం చేసింది లేదు

నిత్యం తప్పుడు సమాచారం
అసత్యపు ఆరోపణల కుట్రలతో
దుమ్మెత్తి పోయడమే పరమావధిగా
పనిచేసింది

ఈ రోజు
పాలనలో వేస్తున్న
నిర్లక్ష్యపు అడుగులు
తప్పటడుగుల మీద

సమాజం నుండి ఎదురయ్యే ప్రశ్నలకు
జవాబు లేక

అధికారం వుంది కదా అని
ఆయన గతంలో ఆరోపించినట్టే
ఆ వ్యవస్థను మార్చుతాను అనుకొంటే
భ్రమే అవుతుంది

చాలా చాలా కష్టం

ఒక తప్పుడు కేసు నుండి వందల తప్పుడు కేసులు వరకు
సమాజం భరిస్తుంది

దాని తరవాత మూకుమ్మడిగా
ఎదురుతిగుతుంది
సమాజం ఉద్యమిస్తుంది

ఆ దిశగా వైకాపా రాజకీయంగా
రెచ్చగోడుతోంది ప్రత్యర్థి పార్టీల నుండి
రాజకీయ వైరిపక్ష నాయకుల వరకు

ఆఖరికి సోషల్ మీడియాలో
అభిప్రాయాలు వ్యక్తం చేసే
ఉన్నత వర్గాల అలికిడిని కూడా
సహించలేని అధికార అహంకారం పనికిరాదు. #చాకిరేవు.


ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,799

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: