మే 5th, 2020ను భద్రపఱచు

జగన్ రెడ్డి తాజా నిర్ణయం మరింత వ్యూహాత్మకమైనదా?

ఆయన అధికార పగ్గాలు చేపడితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కరోనాలో అయినా గుర్రంలా పరిగెట్టించలేరా?

నష్టాల్లో వుంటే ప్రీమియం రేట్లకు ఎలా అమ్మాలో సిబిఐ సాక్షిగా నిరూపించుకొన్న నాయకుడు. లక్ష కోట్లలో 43 వేల కోట్ల అవినీతికి కోర్టులో సమాధానాలు చెప్పుకోలేక వాయిదాలు తీసుకొంటున్న గొప్ప వ్యక్తి.

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు, నిన్న పాతిక శాతం పెంచితే కూడా.. జనం షాక్ తింటారని అనుకొంటే, జనం మందు కోసం పోటెత్తి వచ్చి రెడ్డికి షాక్ ఇచ్చారు. 40 కోట్లకు పైగా ఖజానా కలకలలాడింది.

తాజాగా మందు రేట్లను ఏకంగా 50% పెంచాడు. ఈ ఆటలో ఎవరికి షాక్ కొడుతుందో అని ఆలోచిస్తే… నీతి నియమాలు & నైతికత వున్నోడికి కొండెక్కిన ఆ ధరలు బరువే. ఏమార్చో, సంఘ / చట్ట వ్యతిరేఖ పనులు చేసే వాడికి అదేమీ షాక్ ఇవ్వదు. వాడు ఖర్చు చేసేది. కష్టపడ్డ సొమ్ము కాదు కాబట్టి. ఇంట్లోనో లేకా వీధిలోనో లేక సమాజంలోనో పీడించి తెస్తాడు.

ఏ డబ్బైనా ప్రభుత్వానికి ఆదాయమే. ఈ డిమాండ్ సప్లై సూత్రంలో నైతికతకు తావు లేదు. తాగే వాడు షాక్ తినాలని రెడ్డి, అమ్మే వాడు ఆపేస్తే నేనూ ఆపేస్తా అని తెగించే బలహీనతకు జరిగే పోరాటంలో సమాజమే నష్టపోయేది. సమాజం నష్టపోతే రెడ్డి గారికి వ్యక్తిగతంగా వచ్చే నష్టం ఏమీ వుండదు. బోనస్ గా బయట వున్నన్ని రోజులు బోలెడు ఆదాయం సమకూర్చి, సమాజాన్ని కూల్చి పోతాడు. ఆ ఆదాయంతో గోడ మీద ఫోటోతో గుర్తుపెట్టుకొనేలా ముందుకే వెళతాడు.

ఆయన మరిచిపోతోంది. సమాజంలో తనను నమ్మిన జనమే కాదు, తన పార్టీ కార్యకర్తలు కూడా వున్నారనే విషయం. అధికారికంగా ఆ కార్యకర్తలకు కూడా అండదండలు అందించి సమాజం మీదే వుసిగొలిపే ఆలోచనలు చేస్తే వచ్చేది అరాచకమే. అదే జరిగిన రోజు సమాజం మొత్తానికి ఈ ఆర్థిక సూత్రం బాగా అర్థం అవుతుంది. #చాకిరేవు.


ట్విటర్ కబుర్లు

  • 'అ'ది 'మ'నది 'రా'.. 'వ'ల్లకాడు అన్నా 'తి'రగబడి అమరావతినే రాజధానిగా చేసుకొంటాం భవిష్యత్తు తరాలకోసం తీర్చిది… twitter.com/i/web/status/1… 2 days ago

వీక్షణలు

  • 941,799

తడి ఆరని ఉతుకులు

మే 2020
సో మం బు గు శు
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: