చాణక్యానికి జాకీ

చాణక్యానికి జాకీ

గుజరాత్ చాణక్యాన్ని బురిడీ కొట్టించింది మరాటా రాజకీయం. దేశమంతా కాషాయ కైవస వైభవం గత సంవత్సర కాలంగా మెల్ల మెల్లగా వెలసిపోతోంది. పార్లమెంటు ఎన్నికల విజయం ఒక్కటే ఆనందాన్ని ఇచ్చేది. కానీ అందులో ఎన్నికలు జరిగిన తీరుపై దేశమంతా అనుమానాలు వున్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసి పటాపంచలు చేసే నాటకంలో చాణక్యం పేరుకు గండిపడింది. సొంత పార్టీలో ఒక విధమైన భయం & నైరాశ్యం, నాయకత్వం పట్ల ఒక రకమైన అనుమానం మొదలయ్యింది.

ఈ పరిస్థితిలో కింద పడ్డా పై చేయి మాదే అనే మాటలే ఆ పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే గారివి. మాకు(భాజపా) తెలియదా.. మెజార్టీ లేకున్నా ఆయన సీఎం అయ్యారని. అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.40వేల కోట్లు దుర్వినియోగం కావొద్దని ఫడణవీస్‌ భావించారు. ఒకవేళ కాంగ్రెస్‌-ఎన్‌సీపీ-శివసేన కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి కోసం కేటాయించిన ఆ నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆయనకి తెలుసు. అందుకే అక్కడ ఒక డ్రామా ఆడాలని నిర్ణయించుకున్నారు. ఫడణవీస్‌ సీఎం అయిన 15గంటల్లో ఆ రూ.40వేల కోట్లను కేంద్రానికి తిప్పి పంపారు’’ అని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ డ్రామాలో పై చేయి కోసం చాణక్య భక్తితో వారి సంతృప్తి కోసం, ప్రధాని, గవర్నర్ & రాష్ట్రపతి పదవుల నైతికత విషయం మరిచిపోయారు. చాణక్యం అంటే ఆ పదవుల ఔన్నత్యం కూడా నిలబెట్టేది అయ్యుండాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తారని మరిచిపోయారు. కేవలం పార్టీ అభిమానులు & భక్తులు వ్యవస్థల విలువలు దిగజారినా, పార్టీ విజయాలను చాణక్యాలుగా భావించవచ్చు కానీ దేశం పట్ల అభిమానం వుండే వారి దృష్టిలో పలచన అయ్యారు. #చాకిరేవు.

0 Responses to “చాణక్యానికి జాకీ”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 925,212

తడి ఆరని ఉతుకులు

డిసెంబర్ 2019
సో మం బు గు శు
« నవం    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

నెలవారీ ఉతికినవి


%d bloggers like this: