రాం మాధవ్ గారికి,

రాం మాధవ్ గారికి,

బిజెపి లో మీరు జాతీయ స్థాయి నేత. కాశ్మీరు లాంటి కల్లోలిత ప్రాంతాలలో కూడా ఆ పార్టీ కోసం కృషి చేస్తున్న వీర విధేయులు. వెంకయ్య నాయుడు నుండి చాలా మంది నేతలు, ఇంతకు ముందు వాజపేయి గారు కూడా మన ఆంధ్రాకు ఎంతో చేశారు.

దేశంలో అన్ని పార్టీలు బిజెపి మతోన్మాద అంటరాని పార్టీ అని దూరంగా వున్నా, మన రాష్ట్రం నుండి ప్రాతీయ పార్టీ తెలుదు దేశం పొత్తు పెట్టుకొంది. రాజకీయంగా మీ పార్టీ కూడా రాష్ట్రంలో ఎదగాలి అనుకోవడంలో తప్పులేదు. దాని కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టి వుండకూడదు. మన విభజిత రాష్ట్రానికి రావాల్సిన హక్కులను రాకుండా నీతి అయోగ్ ను అడ్డుయ్ పెట్టుకొని కాలరాయడం, మరికొన్ని హక్కుల మీద తీవ్ర కాలయాపన చెయ్యడం, రాజధాని లేని రాష్ట్రాన్ని అస్సలు పట్టించుకోకపోవడం, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లాడి మనసులో కూడా ద్వేషం పెరిగేలా చేసింది.

మీరు తానాలో మోడీ గారి గురించి మాట్లాడితే, చదువుకొని స్వయంకృషితో ఎదిగిన అక్కడి తెలుగువారు తందానా అనరు కదా. అన్నీ గమనిస్తున్న వారు మీ మాటలకు గర్హిస్తూ, నిరసనలతో నినాదాలు చేశారు. అక్కడ వున్నవి పార్టీలు కావు. అక్కడ వున్నది మన తెలుగు వాళ్లు.

మీరూ తెలుగు వాళ్లు కాబట్టి, అదేదో మీకు వ్యక్తిగతంగా జరిగినదని భావించనవసరంలేదు. అదే విషయాన్ని, ఆ భావాలను బిజెపి పెద్దలకు తెలిపి, తెలుగు వాడికి మీ పార్టీ చేసిన తప్పుల గురించి విశదీకరించి చెప్పి, మనసు ఎలా గెలవాలో, ఆ చర్యలు తీసుకొనేలా ఒప్పించండి.

నిజమే తప్పులు చేసిన వారు పాదాభివందనాలు చెయ్యవచ్చు మీకు. కానీ తప్పే చేయని వాడు ఇలా ఎదురవుతూనే వుంటాడు అడుగడుగునా. తెల్లోడి తుఫాకీకి చొక్కా విప్పి గుండె చూపిన తెలుగు వాడి తెగువ అలాగే వుంటుంది అని తెలియజేయగలరు. ..చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “రాం మాధవ్ గారికి,”


  1. 1 anon 11:56 ఉద. వద్ద జూలై 8, 2019

    పచ్చ మూకలు విశిష్ట అతిథిని పిలిచి అవమానించాయి.

    “దేశంలో అన్ని పార్టీలు బిజెపి మతోన్మాద అంటరాని పార్టీ అని దూరంగా వున్నా, మన రాష్ట్రం నుండి ప్రాతీయ పార్టీ తెలుదు దేశం పొత్తు పెట్టుకొంది” -అబ్బ చా. ఎంత దయ తలచింది చంబా పార్టీ.

    తమకు అవసరమైతే పొత్తు. లేకపోతే మొత్తు. దానికి మళ్ళీ పచ్చ కలరింగు ఒకటా.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

  • జగన్ రెడ్డి జుడిషియల్ ముసాయిదా బిల్లు చూస్తుంటే అటు మోడీ ఇటు చంద్రబాబు ముందు నుయ్యి వెనక గొయ్యి లెక్క ఎంత జడుసుకొంటున్నారో అర్థం అవుతోంది 2 days ago

వీక్షణలు

  • 913,351

తడి ఆరని ఉతుకులు

జూలై 2019
సో మం బు గు శు
« జూన్    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: