తాగుడు మాటలకు పరోక్ష ప్రసార ఛానల్

తాగుడు మాటలకు పరోక్ష ప్రసార ఛానల్

ఇన్నాళ్లూ ఆడియో వేడుకలను, లక్షదీపాలను, సెలెబ్రిటీల పెళ్లిల్లను ప్రత్యక్ష ప్రసారం చేయడం వరకు మీడియాలు చేసేటివి. తాజాగా, ఫాం హౌస్ లో తాగుడు మాటలను, పరోక్ష ప్రసారం చేయడానికి ఒక ఛానల్ ను ఒప్పించినట్టు రాజకీయ అవగాహన వున్న వారికి ఇట్టే అర్థం అవుతుంది.

మోడీ ఎండీఎకి స్టాలిన్ ని ఒప్పించడం సఫలం అయినట్టు, మళ్లీ ఆయనే ప్రధాని అవుతున్నట్టు ప్రసారాలు మొదలయ్యాయి.

డిఎంకె గాని మోడీకి మద్దతు ఇస్తే, జీవిత కాలంలో స్టాలిన్ సిఎం అవ్వడు అని మెడమీద తలకాయ వున్న వాడికి ఎవడికైనా తెలుసు.

కానీ పూటుగా తాగే మందకు ఆ లాజిక్ లు అవసరం లేదు. ఏదో సంకలు గుద్దుకోవడం, దానికి తందాన అనడం జరుగుతూ వుంటుంది. ఆ సొల్లును స్క్రోలింగ్ ల వేయడానికి ఓ మీడియాను పెట్టుకొన్నారా అన్నట్టుంది ఒక ఛానల్ అతి.

డిఎంకె నుండి మిగతా మీడియాలు ఇలా చెబుతున్నాయి. తాగి తందనాలు ఆడేవారికి దరువేసే ఛానల్ స్క్రోలింగ్ ల లో చూడండి.

డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ‘‘ఈరోజు జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణానికి మద్దతు తెలపాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను మా నేత స్టాలిన్ ఒప్పించారు. ఇక మే 23 తర్వాత ప్రాంతీయ నాయకులే హీరోలు’’

+ ఎన్డీటీవీ

యూపీఏలో చేరాలన్న స్టాలిన్ ప్రతిపాదనను కేసీఆర్ తోసిపుచ్చలేదు

+ న్యూస్ 18

కాంగ్రెస్ – డీఎంకే మధ్య బలమైన బంధం కారణంగా ఫెడరల్ ఫ్రంట్ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. బీజేపీతో పోరాడడానికి కాంగ్రెస్ కూటమితో చేతులు కలిపే విషయాన్ని పరిశీలించాలని డీఎంకేనే కేసీఆర్ను కోరింది.
+ టైమ్స్ ఆఫ్ ఇండియా

కేసీఆర్ ఎంతగా ఒప్పించేందుకు ప్రయత్నించినా యూపీఏతోనే ఉంటానని స్టాలిన్ స్పష్టం చేశారు. ఆయననే కాంగ్రెస్ కూటమిలోకి ఆహ్వానించారు.

+ పీటీఐ

తన ‘ఉప ప్రధాని ఆకాంక్ష’పై కేసీఆర్ స్టాలిన్ కు చాలా సంకేతాలు ఇచ్చారు. స్టాలిన్ తిరస్కరణతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్లైయింది.

+ డీఎన్ ఏ

‘‘కొద్ది రోజుల కిందట కేసీఆర్ తో భేటీకి నిరాకరించిన స్టాలిన్ ఇప్పుడు ఎందుకు కలిశారు!? కాంగ్రెస్ తోనే కలిసి సాగాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా కేసీఆర్ తో భేటీకి ఎందుకు అంగీకరించారు? ఇందుకు కారణం.. కాంగ్రెస్ కూడా వివిధ పార్టీలతో చర్చిస్తోంది. కేసీఆర్ మనసులో ఏముందో తెలుసుకోవాలని స్టాలిన్ ను కోరి ఉంటుంది’’ (చెన్నైకి చెందిన రాజకీయ విశ్లేషకుడు సుమంత్ సి రామన్ ను డీఎన్ ఏ ప్రస్తావించింది) ..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “తాగుడు మాటలకు పరోక్ష ప్రసార ఛానల్”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

మే 2019
సో మం బు గు శు
« ఏప్రి    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: