ఓ జ్ఞాని వంగి నమస్కరిస్తుంటే కలిగిన ఆవేదనతో….

ఓ జ్ఞాని వంగి నమస్కరిస్తుంటే కలిగిన ఆవేదనతో….

ఆంధ్రాలో అతి సామాన్యుడికి & చదువులేని వాడికి కూడా, చాలా విషయాలలో అవగాహన వుంది.

ఒక్కో సారి జగన్ రెడ్డి గురించి తీరికగా ఆలోచిస్తే, నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్లే అని ఖచ్చితమైన మూర్ఖత్వంతో, ఎప్పుడూ తను చెప్పెదే చెప్పుకు పోతాడు. సమయానికి & సమస్యకు సంబంధం లేని వాగాడంబరమే అనేది ఆయన నడవడికతో ఆంధ్రా తెలుసుకొంది, ఈ ఐదేళ్లు.

సొంత పులివెందులలో నామినేషన్ రోజు, సమ్మర్ స్టోరేజ్ ప్రాజెక్ట్ గురించి చెప్పి అభాసుపాలయ్యాడు. సింహాద్రి పురంలోని ప్రాజెక్టు ఇంకో మండలంలో వుందని, అది వాళ్ళ డాడీ కట్టేసినాడని మాత్రం, చూసినట్టు చెప్పాడు.

విభజన చట్టం మీద చదువులేని వారికి కూడా అవగాహన వుంది. జగన్ రెడ్డికి వున్న అవగాహన ఒక్కటే, ప్రత్యేక హోదా అనే విషయం. అదీ ఎందుకు అంటే, చంద్రబాబును తిట్టుకోవచ్చని. మిగిలిన విభజన సమస్యల గురించి, ఏ రోజూ ఎంత వరకు వచ్చాయని మాట్లాడింది లేదు. వాటి గురించి మాట్లాడితే మోడీకి & కేసీఆర్ కి ఇద్దరికీ కోపం వస్తుందనేమో అన్నట్టు కనీస అవగాహన లేనట్టే, ఈ ఐదేళ్లూ కాలం గడిపేశాడు.

కేంద్రం, అటు తెలంగాణా, ఇటు ఒడిసా, పలు విషయాలలో పేచీలు పెట్టి, సమస్యలుగా మార్చుతున్నారు. ఒక్క పోలవరం విషయంలో, ఓ సారి కేంద్రానికి పంపిన నివేదిక తరువాత, మరో ఏడాదిలో పంపిన నివేదికలో నిర్వాశిత కుటుంబాలు ఎందుకు పెరిగాయని ఒక కొర్రీ వచ్చింది? మెడకేస్తే కాలికి, కాలికి వెస్తే మెడకు వేసే, కేంద్రంలోని ఆ ప్రభుద్దులకు ఇలాంటి అనుమానం ఎలా వస్తుందో ఆశ్చర్యం వేసింది.

మోడీ లాంటి మనిషి పదవులకోసం ఇంట్లో నుండి బాధ్యత లేకుండా వెళ్లిపోతే, ఒంటరిగా వుండే భార్యకు ఓ రేషన్ కార్డు ఇస్తారు. తల్లికి ఒక రేషన్ కార్డు ఇస్తారు. ఇలా కుటుంబాలు విడిపోతాయి. కోడలు వస్తే, వేరు కాపురం పెట్టే రోజుల్లో, అట్లాంటి కొర్రీ పెట్టడం, కావాలని కాలయాపన చెయ్యడానికే అని తెలుసు.

పోలవరం కోసం మన ఆంధ్రా పంపిన మరో నివేదిక పేజీల సంఖ్య 60000(అకరాలా అరవై వేలు). ఆమోదించే అధికార్లు ఇద్దరు అనుకొన్నా, వాళ్లు ప్రక్కన ప్రక్కన కూర్చొని చదివినా, రోజుకు 100 పేజీలు చదివినా, 600 రోజులు పడుతుంది. అంటే సుమారు రెండేళ్లు.

అలాంటి ఎన్నో కొర్రీలు, మరెన్నో విచిత్ర అడ్డగోలు అడ్డనుకులకు, అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అయినట్టు, ఎన్నో ఎన్నో సమస్యలు. ఆఖరికి, నాగపూర్ లో గడ్కరీ ఇంటికి వెళ్లి చంద్రాబాబు గారు మాట్లాడి ఒప్పించాల్సి వచ్చింది, పండగపూట.

ఈ రోజు 60 శాతం అయ్యింది. ఇవన్నీ ఎలా సాధ్యం అయ్యింది ఆంధ్రాకు. సోమవారాన్ని పోలవరంగా పిలిచుకొని, దానికి ఓ కూలీలా మారి, తన జన్మను సార్ధకం చేసుకోవాలని ఓ సాధకుడు చేసిన భగీరధ ప్రయత్నం వలన.

ఒక్క పోలవరమే కాదు, చంద్రబాబును నిద్రలో లేపి, శ్రీకాకులం నుండి చిత్తూరు వరకు వున్న ప్రాజెక్టుల గురించి అడగండి, గడ గడా ఎలా చెప్పగలడో. అసెంబ్లీలో వుంటే, ఆయా ప్రాంత ఎమ్మెల్యేల పేర్లను కూడా చెప్పి, ఎప్పుడు నీరు ఇస్తాడో చెప్పేస్తాడు.

ప్రపంచ ఐక్య రాజ్య సమితిలో, లెక్కలేని సార్లు దావోస ఆర్థిక సదస్సుల్లో ప్రసంగించే ఆయన, ఎన్నికల సభలో, వంగి నమస్కరిస్తుంటే ఎంతో మందికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి.

నన్ను అడిగితే, హాయిగా మనవడితో ఆడుకోమని చెబుతాను. ఇంకెన్నేళ్లు ఈ జనం పిచ్చి అని అడగాలనిపిస్తుంది. సమాజం దిగజారేకొద్ది, దానిని భ్రష్టుపట్టిపోనీకుండా, మీ దారికి తెచ్చుకోడానికి, మీరెందుకు వంగి నమస్కరించాలని?

సమాజం దేవాలయం అని చెప్పే పార్టీ నాయకుడిగా, ఆయన నమస్కరిస్తున్నా, మన ఆంధ్రాకు ఆ అర్హత వుందా అనిపిస్తుంది? ఒక్కో సారి ఆంధ్రా అదృష్టం అనిపిస్తుంది. కానీ అంతలోనే అలాంటి మనిషి ఉత్తరాది రాష్ట్రంలో పుట్టి వుంటే, ఎప్పుడో మరింత వున్నత స్థితిలో వుండే వాడు. ఈ స్వార్థపు ఆంధ్రా కుచించుకు పోతున్నా, అందులో ఆ స్థాయిలోనే తృప్తి పడుతూ, అందులో నుంచి ప్రపంచానికి ఆంధ్రాను అద్భుతంగా చూపించాలని ఆయన పడే శ్రమకు, శిరస్సు వంచి నమస్కరించాలనిపిస్తుంది.

ఓ మనిషి శ్రమ ఫలితం, కుక్కల పాలయ్యాక, ఏడ్చి ప్రయోజనం లేదు.

తన శ్రమ ఫలితాలు సమాజం అనుభవించనీ అని ఆయన అనుభవం మనకు నమస్కరిస్తోంది. పెద్దకొడుకులా నమస్కరిస్తున్నాడు. కానీ దశాబ్దాల ముందు చూపు జ్ఞానం లో గొప్పవాడైన ఆ పెద్దాయన నమస్కరిస్తుంటే కళ్ళుచమర్చుతోంది. ..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “ఓ జ్ఞాని వంగి నమస్కరిస్తుంటే కలిగిన ఆవేదనతో….”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

ఏప్రిల్ 2019
సో మం బు గు శు
« మార్చి   మే »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: