రిజర్వుడు సీట్లు కూడా అమ్మకానికే సిట్టింగ్ లకు గేటు బయట అవమానాలు

రిజర్వుడు సీట్లు కూడా అమ్మకానికే సిట్టింగ్ లకు గేటు బయట అవమానాలు

సునీల్ కుమార్ గారు ఓ డాక్టర్. వైకాపా తరపున పెద్దిరెడ్డి కోటాలో, గత ఎన్నికల్లో పూతలపట్టులో గెలిచాడు.

పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పార్టీ మారి మంత్రి పదవి తీసుకొన్నా, పెద్ది రెడ్డికి లాయల్టీగా వైకాపాలో సునీల్ కొనసాగాడు. ఆ నిజాయితీ ఇప్పుడు కాటేసింది.

గత ఎన్నికల్లో జగన్ సిఎం, తాను మంత్రి అనుకొని పలువురు చిత్తూరు ఎమ్మెల్యేలకు ఖర్చు చేసాడు పెద్ది రెడ్డి. పెద్ది రెడ్డి డబ్బు చూసి, ఆయన కొడుకు మిధున్ రెడ్డి ని రాజంపేట ఎంపిగా పెట్టి, కడప జిల్లాలో కూడా వారి చేత ఖర్చు పెట్టించాడు జగన్.

ప్రభుత్వం రాలేదు, పెద్దిరెడ్డి వెళితే, కూడా కొంత మంది వెళితే, పార్టీ మరింత బలహీన పడుతుంది అని, వారి డబ్బుల రికవరీకి, తెలంగాణాలో కొన్ని ప్రాజక్టులు ఇప్పించాడు జగన్.

సునీల్ కుమార్ & కొందరు, మరో సారి తామే ఎమ్మెల్యేలని నమ్ముతూ వైకాపాలో కొనసాగారు. ఈ ఎన్నికలకు డబ్బు లేదు. కాని దళితవాడలు తిరుగుతూ, ప్రచారం చేసుకొంటూ వున్నాడు. మళ్లీ పెద్దిరెడ్డి కోటాలో ఈ నియోజక వర్గం ఇచ్చాడు జగన్. పైగా పార్టీకి ఫండింగ్ కూడా కట్టాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారు.

ఈ దశలో పెద్ది రెడ్డితో పాటు తిరిగే మరో అనుచరుడు, బెంగుళూరులో రియల్ ఎస్టేట్ చేసి కోట్లు ఆర్జించాడు. ఈ నియోజక వర్గమే కాదు, గతంలో జెడ్పిటిసి కోసం ఖర్చు చేసి, పోరాడి ఓడిన వ్యక్తి. ఆయనను పాతిక కోట్ల వరకు ఒప్పించినట్టు చెబుతున్నారు.

ఆయనకు టికెట్టు చెప్పేసి, సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కు టికెట్ నిరాకరించారు. జగన్ ను కలిసి తన పనితీరు గురించి చెప్పి, వేడుకొందామని, కుటుంబ సమేతంగా లోటస్ పాండ్ వెళ్లాడు, సునీల్ .

గేటు బయటే వుంచి, రెండు గంటలు వేచి చూసేలా చేశారు. దానికన్నా ఘోర మైన అవమానం ఏమంటే, పెద్ది రెడ్డి లోటస్ పాండ్ లోకి వెళుతూ, సునీల్ ను చూసీ, చూడనట్టు లోపలికి వెళ్లడం.

లోపల రెడ్డి కంటే, లోపలికి వెళుతున్న తోటి చిత్తూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి చూసిన చిన్న చూపు, ఆ రిజర్వుడు ఎమ్మెల్యేని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. అందులోనూ డాక్టర్ చదివిన ఉన్నత విద్యావంతుడు. మరింత భావోద్వేగానికి లోనయ్యాడు.

నీతి లేని అవినీతి జగన్ నాయకత్వ వైకాపా లాంటి పార్టీలో నిజయితీకి అవమానం అనుకోకండి. గతంలో కర్నూలు ఉప ఎన్నికలు వస్తే, ఓటమిని నాటి మంత్రి & దళితుడు అయిన మారెప్ప ఖాతాలో వేసి, ఆయనను పదవి నుండి తొలగించి, గేటు బయట నుండి లోనికి రానివ్వలేదు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.

తమ అవినీతి మీద ఆరోపణలు వచ్చినప్పుడల్లా, మంత్రి మారెప్పను కవచంగా వాడి, ఎదురుదాడి చెయ్యించే వాడు వైఎస్. అదే కవచాన్ని, తన చేతగాని ఓటమికి బాధ్యుడిని చేసి తొలగించాడు.

ఈ వైకాపా మళ్లీ దళిత దీనజనోద్దరణ అని చెప్పుకోవడం, బిసిల కు మేలు చేస్తామని చెప్పడం, అన్నీ సాక్షి మీడియా మైకు ముందే. ఆ పార్టీ మనుషులు చేసేది మొత్తం వ్యాపారమే.

అందులో బాగంగానే ఈ రిజర్వుడు సీట్లు కూడా అమ్మకానికి. ఈ సిట్టింగ్ లకు గేటు బయట అవమానాలు. …చాకిరేవు

ప్రకటనలు

0 Responses to “రిజర్వుడు సీట్లు కూడా అమ్మకానికే సిట్టింగ్ లకు గేటు బయట అవమానాలు”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

మార్చి 2019
సో మం బు గు శు
« ఫిబ్ర   ఏప్రి »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: