తొంబైల్లో ఇదంతా ఫాంటసీ కాదు

తొంబైల్లో ఇదంతా ఫాంటసీ కాదు

తొంబైల్లో, మగాళ్ల రేంజ్ ఇదా అని ఆశ్చర్యపోయేలా వచ్చిన సినిమాలు, ఆ..డది, అల్లుడు”గా..రు”, “జగదేకవీరుడు” అతిలోక సుందరి, నారీ నారీ నడుమ మురారి, ఆ..డపిల్ల, అల్లుడుదిద్దిన కాపురం, అమ్మరాజీనామా, ఎదురింటిమొగుడు పక్కింటి పెళ్లాం, ఇద్దరుపెళ్లాల ముద్దుల పోలీసు, నా పెళ్లాం నా ఇష్టం, అబ్బాయి “గా..రు”, అల్లరి అల్లుడు, ముద్దుల ప్రియుడు, అల్లుడా…మజాకా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అదంతా ఫాంటసీ అని కొట్టిపారేయకుండా, ఈ సినిమా పేర్లను వికి లో సరిపోల్చుకొని, అసూయపడతారేమో.

ఆనాటి స్థితిగతులు అవి. ఆస్తిలో సమాన హక్కు ఆంధ్రాలో అన్నగారి పాలనలో వచ్చినా, కట్నాలు & కన్నీళ్ళు ఎన్నో. 90 దశకం చివరి దశలో, డోకరా అని మగవారు చేతున్న ఎగతాళుల మధ్య డ్వాక్రా సంఘాలు మొదలయ్యాయి. అక్కడ వడ్డీల గురించి, పొదుపుల గురించి మొదలు, సంపాదనల వరకు చర్చలు జరిగేవి. సంఘంగా నిలదీసే స్థాయికి నుండి, విద్య & ఆర్థిక పరిస్థితులతో నిజమైన మహిళాసాధికారత స్థాయిని సాధించారు.

ఇప్పుడు ప్రభుత్వాలను శాసిస్తున్నారు. తమకు నచ్చే సీరియల్లను అర్థ రాత్ర్యి వరకు వేసేలా, చేతిలో రిమోట్లతో చానల్లనూ శాసిస్తున్నారు.

ఎప్పుడు ఎవడినా అమాయక దర్శకుడు, ఆ 90 ల పేర్లతో ఓ సినిమా తీస్తే, విడుదల అవ్వగలదా? ఒక వేల కోర్టు గట్రా చొరవతో విడుదల అయినా, మగాడు ధైర్యంగా ఆ సినిమాకు వెడదామని ఇంటిలో అనగలడా?

ఎంత మార్పో కదూ. 20 ఏళ్లకు ముందు మీరు ఆర్థిక సమానత్వం సాధించాలి, మహిళా సాధికారత మీ చేతుల్లో వుంది అంటే, నాటి ప్రతిపక్షం నవ్వింది. మగాళ్ల అపనమ్మకాన్ని పటాపంచలు చేస్తూ ముందడుగు వేశారు, మహిళలు నాడు చంద్రబాబు పిలుపందుకొని. నాటి కోడళ్లు ఈ రోజు అత్తలయ్యి, వచ్చిన కొత్త కోడల్లను మొదట చెయ్యించే పని డ్వాక్రాలో చేర్చడం. ఈ రోజు పసుపు కుంకుమలని 10 వేలు వేసి మళ్లీ రెండో విడత 10 వేలు వేస్తున్నారు. వెలుగని, దీపమని, ఇల్ల పట్టాలు & ఇళ్లు వారి పేరునే అని ఓ ఉద్యమంలా ఆయన చూపిన చొరవే, ఆయనంటే మహిళల్లో గౌరవం నమ్మకం ఏర్పడడానికి కారణం అయ్యింది. ..చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “తొంబైల్లో ఇదంతా ఫాంటసీ కాదు”


  1. 1 అనామకం 1:29 సా. వద్ద మార్చి 9, 2019

    not just dwakra, but female biased media that has imparted fear.. also regarding financial security, it is actually easily available private jobs and engineering degrees for everyone that has improved the situation..ysr who criticized privatization of engineering colleges had later fully enjoyed the fruits of that..

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

మార్చి 2019
సో మం బు గు శు
« ఫిబ్ర   ఏప్రి »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: