దరిద్రగొట్టు పరిణామక్రమంలో గొట్టపు మీడియాలు

దరిద్రగొట్టు పరిణామక్రమంలో గొట్టపు మీడియాలు

తెలంగాణా పోలీసులు ఓ లెటరు రాస్తే, అమేజాను & గూగుల్ రెండూ.. గజ గజ వణుకుతూ డేటా షేర్ చెయ్యడానికి ఒప్పుకొన్నారా?

ఆళ్లు చెప్పడం, ఆ … అని నోట్లో ఈగలు పోతున్నా.. మీ మీడియా వాళ్లు మిడిగుడ్లు ఏసుకొని, మీ మైకు బొమ్మ, మీ టీవీలోనే కనిపించాలని, అక్కడ పెట్టడం, కెమెరానో లేదా మొబైలో పెట్టి, ఆ స్కాండ్ లాండ్ రేంజ్ బిల్డప్పులను చిత్రీకరించి…. వాట్సప్ లో పంపడం…

ఇక్కడ స్టుడియో నుండి … మీరు బిగబట్టుకొని చూస్తూనే వుండండి … బాత్రూంకు కూడా పోకండి అని, ప్రేక్షకులకు, దానిని బ్రేకింగ్ న్యూస్ గా వెయ్యడం…. అక్కడి నుండి నోట్లో ఈగలు ఊసేసి ఊగిపోండని చెప్పడం తరువాయి… రెండు లైన్ల సమాచారాన్ని … అరగంటకు పైగా విడగొట్టి, చావగొట్టి, సాగదీసి.. చిత్ర విచిత్రంగా హడలగొట్టేలా వాగించడం…

ఒకప్పుడు సాయికుమార్ ఆవేశంగా హీరో రాజశేఖర్ గారికి డబ్బింగ్ చెప్పారు, తానే ఆ ఆవేశంతో హీరోగా వచ్చారు… ఇప్పుడు ఇద్దరూ ఖాలీగా వున్నారు…

వారి లోటును తీరుస్తున్నట్టు లేదూ.. అదీ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ల లెక్క…

అడే.. వాజమ్మ ప్రేక్షకులు చూస్తున్నారని… ఎన్నేళ్లు చేస్తారు ఈ బెక బెక బానిస జర్నలిజాన్ని…. అమ్ముడుపోయే హడావిడిని… హడలుగొట్టడాన్ని…. వెనుక గుడ్డ జీరాడుతుంటే… చేతిలో కత్తితో ఆవేశంగా అటూ ఇటూ తిరిగి తిరిగి పద్యం పాడే నాటకాన్ని, తలదన్నేలా చేతున్న విన్యాసాలను జర్నలిజం అనుకోమంటారా…

మీరు చెప్పింది అంతా తప్పని, ప్రేక్షకుడు ఉమ్మే సమయానికి, ఇంకో చోట, నోళ్లను ఈగలకు షెల్టర్ ఇవ్వడం… ఎన్నాళ్లు … ఎన్నేళ్లు…

మీ మనః సాక్షి చెప్పడం లేదూ.. మీ వృత్తి మీకే రోతగా వుందని…

అన్ని తెలుగు మీడియాలను అనటం లేదు… ఇంకా కొందరు అంకిత భావంతో కొన ఊపిరిలోని ఆ వృత్తిని కాపాడుతున్నారు.. ప్రశాంతంగా వార్తలు గాని విశ్లేషణలు గానీ జరగాలి… ఆలోచన లోతులను చూపాలి, ప్రేక్షకుడికి ఆ భావాలను పంచాలి… సచ్చి పోలేదు చూడండి కొన్ని చానల్స్ ను…

ఓ నాడు కలం అంటే ప్రభుత్వాలు పడిపోయేవి… బోఫోర్సుల కన్నా.. ఎక్కువగా శతఘ్నులను, రాజకీయ నాయకుల గుండెల్లో దింపేవి. నేడు రాఫెల్ లాంటి స్కాండల్స్ మీద కూడా, జనం మీడియాని చూసి నవ్వుకొంటున్నారు.

అమేజాన్ & గూగుల్ లాంటి కంపెనీలు, అమెరికా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ కు కూడా, అడగంగానే డాటా ఇవ్వరు. మా ఇండియాలోనే, మా దేశం డాటా వుండాలని మన నాయకులు చెబుతున్నా, ఇంకా దేకలేదు.

ఆ రంగంలో కనీస పరిజ్ఞానం వున్న ఒక్క జర్నలిస్ట్ అయినా, అలా ఎలా ఇస్తారని ఎదురు ప్రశ్న వేశారా? అసలు ఆ రంగమే కాదు, ఏ రంగం అయినా అలాగే అఘోరిస్తున్నారు జర్నలిస్ట్‌లు.

ఆ మైకు అక్కడికి పట్టుకు పోయి, రికార్డు చేసుకొచ్చే ట్రూపును జర్నలిజం అందామా?

స్టుడియో విశ్లేషణలో, కుక్కను మరిపించే వారి మైక్ కట్ చేసి, కరెక్ట్ గా విశ్లేషణ చేసే వారితో, చేయించే సమర్థుడిని పెట్టక, అమ్ముడు పోయిన పార్టీకి, తెలివిగా మైకు ఇచ్చే సామర్థ్యం వున్న వాడిని నిర్వాహక జర్నలిస్ట్ ని పెట్టి, ఎంతమంది ప్రేక్షకులు అసహ్యించుకొంటూ, చానల్ మార్చేస్తున్నారో మీకు తెలుసా?

అమ్ముడు పోయిన పార్టీకి అనుకూలంగా ఊదరగొట్టినా పర్లేదు, జనాల బాధ, సంతోషం, ఆశ, ఆశయం, ఆలోచన మీద కార్యక్రమాలను క్లుప్తంగా అయినా పెట్టని దౌర్భాగ్య మీడియాలకు ఈ పోస్ట్ అంకితం. …చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “దరిద్రగొట్టు పరిణామక్రమంలో గొట్టపు మీడియాలు”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 892,685

తడి ఆరని ఉతుకులు

మార్చి 2019
సో మం బు గు శు
« ఫిబ్ర   ఏప్రి »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: