పొగకు పాము ఉక్కిరిబిక్కిరై పుట్టనుండి వచ్చినట్టుంది జగన్ పరిస్థితి

పొగకు పాము ఉక్కిరిబిక్కిరై పుట్టనుండి వచ్చినట్టుంది జగన్ పరిస్థితి

టిడిపి వాళ్లు పెద్ద ఎత్తున ఓట్లను తొలగించేసారు అని కేంద్ర & రాష్ట్ర ఎన్నికల కమీషన్లు అన్నీ తిరిగి, ఫిర్యాధులు చేసామని, తమ మీడియాలో గగ్గోలు పెట్టారు. రోజూ అదే రోత పాట పాడుతుంటే సాధారణంగా ఎవడికైనా అనుమానం వస్తుంది. పైగా పొరుగు రాష్ట్రంలో మాయల్ ఫకీర్ చేసిన పని, దాని ఫలితాల పర్యవసానాలతో స్వయంగా కంగుతిన్న తెలుగు తమ్ముళ్లకు అనుమానం వస్తుంది. పైగా జగన్ బ్యాచ్ ఎప్పుడూ, రక్త కన్నీరు నాగభూషణం నుండి రావుగోపాలరావు & సత్యనారాయణ వరకు పండించిన విలనిజం పాత సినిమాలు చూసి కుట్రలు పన్నుతారని తెలుసు కాబట్టి ఆ విధంగా ఆలోచించారు.

అసలే టిడిపి లో పార్టీ ప్రెసిడెంట్ నుండి గ్రామంలో సేవా మిత్ర వరకు టెక్ బ్యాచ్. పెద్ద ఎత్తున ఓటర్లు తొలిగిస్తున్నారని, ఉప్పెనలా సోషల్ మీడియా హోరెత్తింది. అందరూ చెక్ చేశారు. ఫారం 7 తో పెద్ద ఎత్తున లక్షల్లో తొలగించమని అభ్యంతరాలు వచ్చాయని గుర్తించారు.

అప్పుడు కూడా వైకాపా మేకపోతు గాంభీర్యంతో, మా ఓట్లు తొలగించేస్తున్నారని గగ్గోలు పెట్టింది. కొంచం పరికించి చూస్తే నెల్లూరు & ప్రకశం జిల్లాలలో తక్కువగా ఫారం 7 ఫిర్యాధులు అందినట్టు తెలుసుకొంది టిడిపి. ఎన్నికల కమీషన్ ను కలిసి గట్టిగా నిలదీసే సరికి, నకిలీ ఫిర్యాధులు పెద్ద ఎత్తున ఏ ఐపి అడ్డ్రెస్స్ నుండి వచ్చాయో, వాళ్లమీద కేసులు పెట్టండి అని ఆదేశాలు వచ్చాయి. మొత్తం 45 చోట్ల జరిగాయైని 45 కేసులు పెట్టారు.

అనుమానం రాకుండా వివేకనంద రెడ్డి తో పులివెందులలో నాటకం మొదలెట్టారు. తరువాత, నాకు తెలియకుండా నా పేరుతో, ఎవరో ఫారం 7 లు అప్లోడ్ చేసారు, నేను అమాయ్కుడిని అని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాధులు ఇవ్వమని అదే దొంగలకు వాట్సాప్ లలో టెంప్లేట్ లు పంపారు.

మధ్యలో టిడిపి కొన్నేళ్లుగా, సేకరిస్తున్న డాటా మీద కన్నుపడింది. అదే తెలంగాణాలో కెసీఅర్ & కేటీఅర్ సహకారంతో ఎలా కొట్టేయాలో ప్రణాళికలు వేసారు. వారి వుద్దేశం వోట్లను చెక్ చెయ్యకుండా టిడిపి సేవా మిత్రలను బ్లాక్ చెయ్యడం, ఆ డాటా లోని టిడిపి బూతు స్థాయి వ్యక్తులకు కాల్ చేసి మీరు చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు, పాదయాత్ర సమయంలో జగన్ మీ గురించి తెలుసుకొన్నారు. కలుస్తారా, జగన్ కు సలహాలు ఇస్తారా అని కాల్ సెంటర్లతో, మైండ్ గేం మొదలెట్టారు. ఒకటి, మన డాటా జగన్ దగ్గర వుంది అని బయపెట్టడం. కలిస్తే ఏమన్నా డబ్బు వస్తుందేమో అని ఆలోచించేలా మైండ్ గేం అన్నమాట.

అక్కడ చాలా రోజుల ముందే ఐటి గ్రిడ్ కంపెనీదగ్గర పోలీసులు మఫ్టీలో రావడం, నువ్వేం చేస్తావు గట్రా ప్రశ్నలతో అడగడం, సాయి రెడ్డి మీడియా కు తెలియజేయడం, మరుసటి రోజు, షర్మిల & జగన్ మేయర్ మేన మామ తమ్ముడి భార్య మొగుడు లోకేశ్వర రెడ్డి తో ఫిర్యాధు చేసి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు గట్రా పట్టుకుపోవడం జరిగాయి. కోర్టుకు వెళ్లి అక్షింతలు వేసుకొని, వారి మీదే కేసులు అయ్యేల తప్పుడు పనులతో వైకాపా & తెరాస బండారం బయటకు వచ్చింది.

రాజకీయ ఆరోపణలు & ప్రత్యారోపణలతో హోరెత్తింది. నిన్నటి వరకు హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే స్థాయిలో సోషల్ మీడియా వార్ జరిగింది. కేటీఅర్ కు తన తప్పు ఏమిటో తెలిసి వచ్చింది. తట్టుకోలేక పోయి, మళ్లీ ఓ ప్రెస్స్ మీట్ పెట్టాడు, అటు పోలీసులతో పెట్టించాడు. ఇటు టిడిపి తగ్గలేదు, జరిగింది మొత్తం టెక్నిగల్ గా క్యాడర్ మొత్తానికి చెప్పారు. గంటల్లో మొత్తం సమాచారం పంచుకొన్నారు.

పొద్దున నుండి మళ్లీ వార్ మొదలయ్యింది. ఎవరో, ఇంతకు ముందు అమెరికా భారత కార్యాలయానికి & కేటీఅర్ కి ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాధుల పుట్టతో పాటు అంతా కదిలించారు. టిఆరెస్ లో అలజడి మొదలయ్యింది. ఇది అంతర్జాతీయంగా మెడకు చుట్టుకొనేలా వుందని, మేక పోతు గాంభీర్యంతో, సైబర్ క్రం కింద, ట్విట్టర్ కు ఫిర్యాధులు చేస్తామని, సమాచారం వదిలారు.

ఇటు మరింత రెచ్చిపోయారు. కేటీఅర్ లైస్ అని కీటీఅర్ దొంగ కన్నీరని మనదేశం & అంతర్జాతీయంగా ఆంధ్రా అంతా ఏకమయ్యింది. మొన్న ఇండియా ట్రెండింగ్ & ఈ రోజు అదే ఆంధ్రా ఎమోషన్. మధ్యలో వైకాపా పైడ్ బ్యాచ్ కూడా కేటీఆర్ ని కాపాడలేకఫోయింది.

జగన్ కు తిట్లు పడ్డట్టున్నాయి. ఇక్కడ చూస్తే 45 కేసులు. ప్రతి వైకాపా అభిమాని కొంపలనుండి నువ్వు కూడా జగన్ లా జైలుకు పోతావా అని, ఊర్లలో నోటీసులు వచ్చాయని తెలిసి, జగన్ పార్టీ కదా, జైలుకు పంపే పనులే కదా వైకాప చెయ్యించేసి అని ఎగతాళి, వెరసి నాయకుల స్థాయిలో ఇబ్బందులు, అన్నీ జగన్ ను లోటస్ పాండ్ పుట్టలో నుండి బయటకు వచ్చేలా చేసింది.

వచ్చిందే తడవు చంద్రబాబు మీద యధావిధిగా బరస్ట్ అయ్యాడు. ప్రెజర్ తట్టుకోలేక తమ పార్టీ చెయ్యించిన నకిలీ ఫిర్యాధుల తొలగింపును, దానిని కూడా చంద్రబాబు తప్పు పడ్తున్నాడని, కక్కేసి, భారం దించుకొన్నాడు. పనిలో పనిగా, చంద్రబాబు ఓటేయని వారిని చంపేస్తాడని & గ్రామాలు తగలెట్టేస్తాడని అనాలోచితంగా వాగేశాడు. ఈ మాట అంటే తన తాత రాజ రెడ్డి నుండి తన వరకు నేరాలు అన్నీ ప్రజలు గుర్తుకు తెచ్చుకొంటారు అనే కామన్ సెన్స్ కూడా జగన్ కోల్పోయాడు.

దాంతో పాటు ప్రజలందరి డాటా చంద్రబాబు దగ్గర వుంది అని బెదిరించాడు. అంటే, జగన్ మాటలు వింటే, మనం చంద్రబాబు కు ఓటేయకపోతే పెన్షన్ కూడా తీసేస్తారేమో అనే స్థాయిలో చంద్రబాబు తరపున వకల్తాలా జగనే జనాన్ని భయపెట్టాడు. వైకాపా లో కొంచం తెలివైన వాళ్లు తలలు పట్టుకొంటున్నారు. ….చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “పొగకు పాము ఉక్కిరిబిక్కిరై పుట్టనుండి వచ్చినట్టుంది జగన్ పరిస్థితి”  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 892,685

తడి ఆరని ఉతుకులు

మార్చి 2019
సో మం బు గు శు
« ఫిబ్ర   ఏప్రి »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: