వామ్మో జగనా …

వామ్మో జగనా …

పవన్ కల్యాణ్‌ను ఎదుర్కోడానికి, ఆయన మాజీ భార్య రేణూదేశాయ్ దగ్గర ఇంటర్వ్యూ తీయిస్తావు. మళ్లీ అదే ఆమెచేత రైతుల మీద ప్రోగ్రాం లు అంటావు. ఆమెకు ఏమి తెలుసు?

సరే అక్కడ కేటీఆర్ తో కలిసి చేసిన కుట్రకు, డాటా అనలిస్ట్ లోకేశ్వర రెడ్డి అనే పాత్రను ప్రవేశ పెట్టి, కంప్లైంట్ ఇప్పించావు. నీ తెలివి కోడి కత్తి డ్రామాలో వెలగబెట్టుకొన్నావు. అయినా బుద్ది రాలేదు. ఇంకా బాగా గడ్డి మేసి, భలే దొరికావు. నువ్వు తాజాగా మళ్లీ బపూను అయ్యావు.

ఆ లోకేశ్వర రెడ్డి తెలంగాణా ఓటరు అనే ప్రాథమిక విషయం మరిచిపోయి, వాడితో ఎ2 విజయసాయి రెడ్డి ని పంపి, కంప్లైంట్ ఇప్పించి తగులుకొన్నావు. కోర్టులో నిలుస్తుందా? ఇది రాజకీయ కుట్ర అని తుపుక్ మనదా కోర్టు. ఎటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని, తెల్లకాగితాలు చూపిన ధృతరాష్ట్ర గుడ్డి ప్రభుత్వంగా, కోర్టుతో చివాట్లు తినిపించావు.

ఇక ఆ లోకేశ్వర రేడ్డి ఎవరు అంటే, మీ సోదరి షర్మిల మొదటి మాజీ మొగుడుకు, తరువాత రెండో పెళ్లాంగా వచ్చినామె, తాజా భర్త.

అంటే షర్మిల మొదటి భర్త & మీ మేనమావ తమ్ముడు కూడా అయిన ఆయన చనిపోతే, ఆయన భార్యను చేసుకొన్న మొగుడును వాడేవు. ఆయన ఎఫ్ఐఆర్ లో ఇచ్చిన అడ్రస్స్ దగ్గర కొంపలు కోట్లలో వుంటాయి. అక్కడ ఒక డాటా అనలిస్ట్ ఎలా వుంటాడు అని ఎవ్వడికీ ఎలా అనుమానం రాదని ఎలా అనుకొన్నారు.

అయినా ఓ పాడు పని చేయడం, దొరికిపోవడం నీకు కొత్త కాదు. పైగా 16 నెలలు చిప్పకూడు తినివచ్చి పాదయాత్ర చేసినా, ఇంచి మారలేదు. మొత్తం ఆ మైలేజిని పోగొట్టుకొని, మీ వైకాపా ఓ క్రిమినల్ పార్టీగా ముద్రవేయించుకొన్నావు.

మీ వైకాపా ఊరికే వున్నా, వేసేవాళ్లు కొందరు వున్నారు. వాళ్లు కూడా వుమ్మేసేలా ఇట్టాంటి ఉపాయాలు ఎక్కడి నుండి వస్తాయో?

పాపం ఆ కేసీఆర్,ప్రశాంత్ కిషోర్ & మోడీ ముగ్గురు కలిసి , ఎంతో అండదండలు ఇచ్చినా, జాకీతో లేపినా, నీ ప్రక్కనే వున్న విజయ సాయిరెడ్డి నిన్ను, రాజకీయంగా పాతాళంలోతుకు పాతేసి, ఉప్పు పాతర వేసేస్తున్నాడు, రోజు రోజుకూ.

అక్కడ పనిచేసే మన ఆంధ్రా ఉద్యోగుల ఇంటిలో,చీరకట్టించి మఫ్టీలో లేడీ పోలీస్ లను లోపల ఒకరిని, బయట ఒకరిని పెట్టి, అంత భయపెట్టి వేధించడం, ఎలా బయటకు తెలియదు అనుకొన్నారు. మీ ఫ్యాక్షన్ కి మించిన భయం, హైదరాబాదులో వున్న మన ఆంధ్రా వాళ్ల మీద చూపిస్తే, ఇక్కడ మీ నాయకులు జగనన్న వస్తున్నాడు అంటే, భయపడి హడలిపోరా జనం.

మీ తాతా & నాన్న ఇద్దరూ కలిసి వున్నప్పుడే, వారి రాజకీయ కుట్రలను చూసిన చంద్రబాబు గారి ముందు నీ కుప్పి గంతులు. ఇంకో విషయం, ఆంధ్రాలో అన్ని పార్టీలు పోటీ నుండి తప్పుకొని, ఇండిపెండెంట్లు నిలబడ్డా, నీకు కాకుండా, నోటాకైనా వెయ్యించే నోరు & తెలివితేటలు నీ స్వంతం.

మీ అభిమాని గురవా రెడ్డి గారు, అట్లాంటా నుండి అలా అప్పుడు ఎందుకు నెత్తీ నోరు బాదుకొని, ఆడిటర్ ఆటలో జగన్ చిక్కొకొన్నాడు, ఖచ్చితంగా గెలవడు అని ఎఫ్ బి ల లో పోస్ట్ లు పెట్టాడో, నీ అభిమానులు అందరూ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొంటున్నారు. …చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “వామ్మో జగనా …”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 892,685

తడి ఆరని ఉతుకులు

మార్చి 2019
సో మం బు గు శు
« ఫిబ్ర   ఏప్రి »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: