చంద్రబాబు గారిని చంపేస్తే బావున్నని ఓ నిర్ణయానికి వచ్చారా విజయసాయి రెడ్డి గారు,

చంద్రబాబు గారిని చంపేస్తే బావున్నని ఓ నిర్ణయానికి వచ్చారా విజయసాయి రెడ్డి గారు,

మీ జగన్ ఏమో కాల్చాలా? ఊరెయ్యాలా? అని చివరికి ఎక్కడైనా పై నుండి దూకి చనిపొమ్మని చంద్రబాబు గారికి చెబుతాడు.

మీరేమో ఇంతకీ శవం ఎవరు నీదా మీ నాన్నదా అని ఆత్రంగా లోకేష్ ని అడుగుతున్నారు.

ఈ రోజు మీ సాక్షిలో ఏమో చంద్రబాబు తనకు భద్రత పెంచమని & ఎవరినీ కలవనీయవద్దని వ్రాయించారు. ఆయనను చంపడానికి మీరు ఎవరికైనా కాంట్రాక్టు ఇచ్చి నియమించారా? రెక్కీ చేసిన వారు ఇచ్చిన సమాచారంతో ఇలా వ్రాసారా?

మీకు నరేంద్ర మోడీ గారి అండ వుంది. ఇక్కడ మీ పార్టీలో ఎవరెవరు చేరుతున్నారో అనే చిన్న చిన్న విషయాలను & ప్రతిదీ కూడా ఆయనకు చేరవేసి, గుజరాత్ మీడియాలలో కూడా వ్రాయిస్తున్నారు. కేసీఆర్ తో సహా, చాలా నెట్వర్క్ పెంచి, సమన్వయంతో వ్యూహాత్మకముగా చేస్తున్నారు.

మీ జగన్ & మీరు ఎదురుగా వుంటే మీ కాళ్లు పట్టుకొని అడిగేవాడిని. దయచేసి ఆయనను ప్రాణాలతో వుంచండి సార్లూ అని. మీరు బిజెపి మరియు ఇతరులతో చేరి ఎలాగైనా ఓడించేయండి. కానీ ఆయనను శవంగా చూడాలని ఆశపడకండి.

ఇప్పటికే అలిపిరిలో శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల ప్రాణాలు దక్కించుకొని ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యి, ప్రజలకు తన జీవితాన్ని ధారపోశాడు. తన ఆనందం కోసం ఏమి బతికాడు తన పిచ్చితనంతో సార్.

ఇంకా ఇంకా పనిచేసి నదులు అనుసంధానించి, అమరావతి కట్టేసి, పోలవరం పూర్తిచేసి ఏమేమో చెయ్యాలని పరిగెడుతూనే వున్నాడు, ఇంత వయసు వచ్చినా. దయచేసి చంపకుండా, ప్రాణాభిక్ష పెట్టి, ఓడించి విశ్రాంతి ఇవ్వండి సార్.

కనీసం శేషాచలం తరువాత ఆయన శేషాజీవితాన్ని వారి కుటుంబానికి దక్కేలా చేసిన పుణ్యం మీకు వుంటాది. మీరు గతంలో చెప్పినట్టు ఆయనది ఏ పుట్టుక అయినా రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆయన శేష జీవితం చూసి, మనకు ఇంతచేసిన మనిషి అని కొంచమైనా ఆనందపడనివ్వండి.

మీరే రాజ్యం ఏలండి. కావాలంటే కట్టిన ప్రతి ప్రాజెక్టును కూలగొట్టి, మోటార్లు & పంపులు తుక్కు కింద అమ్మి సొమ్ము చేసుకోండి. అమరావతిని ఆక్రమించి అమ్ముకొని, ఇంకెక్కడైనా రాజధాని పెట్టుకోండి. మా ఆస్తులు కొల్లగొట్టుకోండి.

కానీ మీ కులం కోసం, కులాల మధ్య గొడవలు పెట్టి ఒకరిని ఒకరు చంపుకొనేలా చేయకండి. వారికీ ప్రాణాభిక్ష పెట్టి ఆంధ్రా బయటకు తరిమెయ్యండి.

మా బతుకులు దుర్భరమైనా పర్లేదు. చంద్రబాబు గారు తన కుటుంబంతో వుండే ఫోటో వస్తే, పొరుగు రాష్ట్రాల్లో భిక్షం ఎత్తుకొంటూ అయినా మేము సంతోషిస్తాము.

మాకోరికను మీరు మన్నించండి. ఆ వేంకటేశ్వరుని కూడా కోరుకొంటూ కన్నీళ్లతో కనికరించమని ఆశిస్తున్నా. ..చాకిరేవు.

ప్రకటనలు

0 Responses to “చంద్రబాబు గారిని చంపేస్తే బావున్నని ఓ నిర్ణయానికి వచ్చారా విజయసాయి రెడ్డి గారు,”



  1. వ్యాఖ్యానించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 900,539

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2019
సో మం బు గు శు
« జన   మార్చి »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: