జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు.

మన జీవితాలకు ఇతరుల మీద అనవసరంగా ద్వేషం పెంచుకొనే సమయం లేదు. ఎవడన్నా వుండబట్టలేక మన ఆశల మీద, బతుకు మీద & పరువు మీద భంగం కలిగించేలా ప్రవర్తిస్తేనే మనకు కోపం వచ్చేది. అలా చేసిన వాడు మన కులపోడు అయినా, బంధువు అయినా, ఇంట్లో వాళ్లు అయినా మనము ఊరుకోము.

జగన్ మోహన్ రెడ్డి మనకు ఇరుగు & పొరుగున లేడు. మనకు వ్యక్తిగత శత్రుత్వం లేదు. తన బతుకు కోసం తండ్రితో దోచుకొన్నాడు. బతకడానికి దోచుకొని వుంటే, ఓ జేబు దొంగల ముఠా అనుకొని వదిలేసి వుండవచ్చు. కానీ వ్యవస్థలనే ధ్వంసం చేశారు. సంపద అనుభవిస్తూనే న్యాయ పరీక్షకు నిలబడ్డాడు. వ్యవస్థ అంతా అలాగే వుంది కదా, నా మీద మాత్రమే కుట్ర చేసారని, మీ జీవితాలను మార్చడానికి అవకాశం ఇవ్వండి అని అంటున్నాడు.

న్యాయ వ్యవస్థలోని ఆలస్యాన్ని అవకాశంగా మలచుకొని మనలను అర్థిస్తున్నాడు. అక్కడ దోషి అని చెప్పే వరకు నేను దోషి కాదు అని ఓ పార్టీ పెట్టి మరీ తన నాయకుల ద్వారా ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని కేసులు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద నమోదై వున్నాయి. అతను దోషి అని ప్రాషిక్యూషన్ నిర్ధారణ చేయక్కరలేదు. ఆ కేసుల్లో జగన్ తనకు తానే దోషి కాదని నిరూపించుకోవాలి. ఆ బాధ్యత జగన్ మీద వున్నది అని, జనానికి ఈ విషయం తెలియదు అని, జగన్ అనుకొంటున్నాడు. కోర్టు శిక్షకు గురయ్యే రోజుకు మధ్య రోజులు, నెలలు & సంవత్సరాలు దొంగలిస్తూ నెట్టుకొస్తున్నాడు, ప్రజలిచ్చిన రాజకీయ పలుకుబడిని వాడుతూ.

పరపతితో రాష్ట్రపతిని కలిసే అవకాశం వున్నా, దోషి కాదని నిరూపించుకోలేని మనిషి, నేరస్థుడు కాకుండా పోడు. శిక్ష పడిన రోజే నేరస్తుడని, నమ్మిన జనం నాలుక కరుచుకోనక్కరలేదు. ముందస్తుగా కూడా ఎక్కువ మంది జనం జగన్ పట్ల జాగ్రత్త పడుతుంటే, అసహనం పెంచుకొంటున్నాడు. దానితో సమాజంలో విద్వేషం ఎగ దోస్తుంటే, అందరూ వేడుక చూస్తూ వుండరు.

ఓ అనుభవం వున్న పాలకుడు చేసే ప్రతి పనీ అందరికీ నచ్చాలి అని లేదు. ప్రతిదీ నచ్చదు కూడా. అలా వున్నప్పుడు, ఆ నచ్చని పనిని కూడా ఇంకా బాగా చేయగల సమర్థుడు ఎవడు అని ఆలోచన వున్న వారు ఆశిస్తారు. అలా ఆలోచించేప్పుడు, జగన్ నేను వున్నా అని ముందుకు వచ్చినప్పుడు, ఏమి చెయ్యగలడు అని ఆలోచిస్తే, రాష్ట్ర సంపదను పందేరం చేయగల అర్హత మాత్రమే నాకుందని చెప్పుకొన్నాడు.

నేను అవినీతి చెయ్యను అని జగన్ చెప్పడం లేదు. ప్రస్తుత పాలన మీద జగన్ చేస్తున్న వినూత్న ఆరోపణలను విన్నప్పుడల్లా, జగన్ వస్తే ఇలా చేస్తాడేమో అని భయపడేలా వున్నాయి అవి. ఇక రాష్ట్రం పట్ల ఏ సమస్య మీద సానుకూల దృక్పథం & ఆలోచనను పంచుకోలేదు ఎప్పుడూ.

రైతులు తమ భూములనే త్యాగం చెయ్యడానికి వచ్చినప్పుడు, లోపాలు వుంటే చెప్పడం మాని, అసలు అమరావతి అన్నదే వుండకూడదనే రాక్షసత్వాన్ని జనానికి అర్థం అయ్యేలా, తన ప్రవర్తనతో చాటాడు. పోలవరం, పట్టిసీమ నుండి ప్రతి నీటి ప్రాజక్టు మీద అలాగే ప్రవర్తించాడు. దానితో పాటు ప్రతి కులంలో & మతంలో కొందరిని పోగేసి, నిత్యం సాక్షి మీడియా ద్వారా, విషం చిమ్ముతూ మరింత భయపెట్టాడు.

మన ఆంధ్రాకు వున్న అద్భుత వనరులు, అది సముద్రం తీరం కావచ్చు, పుట్టుకతో వచ్చిన తెలివితేటలు & ఉన్నత విద్యార్హతలు కాని, వ్యవసాయ విధానం కావచ్చు, ఆక్వా రంగం కావచ్చు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయాలతో కూడిన పర్యాటక రంగం కావచ్చు, ఇలా ఎన్నో మనకు మాత్రమే స్వంతమైన & ప్రత్యేకతను సంతరించుకొన్న మన బలాల గురించి ఏరోజూ తన ఆలోచనలు కాని, ప్రశంసా పూర్వకంగా ప్రవర్తించడం గాని, వాటితో ఏమి చేయవచ్చో కాని, ఏ రోజూ నోరు తెరవలేదు. కాని పంచుకొన్న ప్రతి ఆలోచన విధ్వంసకర ఆలోచనే. ఖూనీ, కాల్చడం, హత్య, ఉరెయ్యడం ఇలా మాట్లాడిన మాటలు మొత్తం పగతో రగిలే ఉన్మాదాన్ని చాటేవే.

ఓ 10 శాతం నుండి 30 శాతం వరకు ప్రస్తుత పాలకుడు చేసేవి నచ్చడానికి ప్రత్యామ్నాయనికి ఆలోచిస్తే, జగన్ కులపరంగా తప్పితే, మిగిలిన వారు ఎవరైనా, ఎందుకు ఎంచుకోవాలో ఆలోచించేంత ఆలోచన కూడా జగన్ కు లేదు. ప్రక్క నున్న వారు చెప్పినా విననంత మూర్ఖత్వమే.

డబ్బుతో & కులంతో గెలవాలనే తాపత్రయం తప్ప, తనకు ఆ తాహతు వుందా అని తనను తాను అద్దంలో చూసుకొని, ఏ రోజూ ప్రశ్నించుకోని మానసిక రోగిలానే, మరింత ముదిరినట్టు కనిపిస్తున్నాడే కాని, కొంత కూడా ప్రజలు సానుకూలతగా ఆలోచించేలా, పాదయాత్ర చేసినా మార్పు వచ్చినట్టు కనిపించలేదు.

ఈ విషయంలో, చంద్రబాబు గారు గతంలో నేను మారాను, నన్ను నేను మార్చుకొన్నాను, ముందులా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చెయ్యను అని పదే పదే చెప్పేవారు. అలాగే చేతల్లో చూపాడు. గేట్లు ఎత్తేసి రెండు వేలు పెన్షన్ ఇచ్చేసి నిజంగా పెద్ద కొడుకులా, వైఎస్ వేసిన విశ్వసనీయత ముద్రను చెరుపుకొని, బ్రహ్మాండంగా ఇచ్చే నిలువెత్తు మంచితనం వున్న మనిషి అని, ఈ దఫా పాలనలో నిరూపించుకొన్నాడు.

పట్టిసీమతో మొదలెట్టిన విజయాలను, అమరావతి లోనూ అలుపెరగని కృషి చేస్తున్నట్టు, అనంత పురం వరకు నీరు తీసుకుపోయి, ఊహించని సొంత చిత్తూరుకు కూడా తీసుకువెళ్లి దేన్నైనా సాధించే రాజకీయ నేతగా నిరూపించుకొన్నాడు. దేశ స్థాయిలో మోడీ మీద తిరగబడ్డం నుండి ప్రపంచ స్థాయి కియా మోటార్స్ వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ సాధించడం అటుంచితే, ఏకంగా జాతీయ & అంతర్జాతీయ ఆరువందలకు పైగా అవార్డులు సాధించి దేశాన్నే నివ్వెరపర్చి & ఆశ్చర్యపోయే పరిపాలనా విశ్వరూపం చూపాడు.

ఈ విషయంలో జగన్ ను చూస్తే మరుగుజ్జు కాదు కదా, ఆయన కాలి గోటికి కూడా పనికిరాక పోగా. ఇప్పటి వరకు చంద్రబాబు పడ్డ శ్రమ అంతా ధ్వంసం చేసే ఉన్మాదం వున్న మనిషి జగన్ అని, తనకు తానే జనం మనసుల్లో ముద్రవెయ్యించుకోవడం జగన్ స్వయంకృతం.

మన ఆంధ్రా ఆశల మీద, రాష్ట్ర మనుగడ మీద & రాష్ట్ర పరువు, ప్రతిష్ట, గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తిస్తేనే, వ్యక్తిగతంగా మనిషికి వచ్చే కోపం, సమాజానికి వస్తుందని జగన్ తెలుసుకోకపోవడం ఆయన తప్పిందం.

స్వకులపోడు అయినా, బంధువు అయినా, ఇంట్లో వాళ్లు అయినా, మన అంతరాత్మే ఒప్పుకోనప్పుడు, ఎవ్వడూ తెలిసి తెలిసీ, వారి జీవితాలకు & భావితరానికి ముడిపడిన సిఎం పదవి కోసం జగన్ ను ఎంచుకోడు. అదే స్థితిలో రాష్ట్రం వుంది.

తను ఓ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు. తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా జగన్ ఇవ్వలేదు. అందుకే స్వచ్చమైన శ్రేయోభిలాషి కూడా లేని ఒంటరి జగన్. శ్రేయోభిలాషులు వున్నారని చెప్పుకొంటే, అంతకన్నా మనసును చంపుకోవడం ఇంకొకటి లేదు. వారు తమకు తాము ఆశించే తప్పుడు శ్రెయోభిలాషులే కాని సమాజం గురించి ప్రక్కన బెడితే, అసలు జగన్ కు కూడా నిజంగా మంచి చేసే ఆలోచన లేని వారే వారంతా. …చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “జగన్ ప్రమాదకారి అని తన సాక్షిలో తెలియక పోవచ్చు, తెలుసుకొనే స్వేచ్చను తనను నమ్మిన శ్రేయోభిలాషులకు కూడా ఇవ్వలేదు.”


 1. 1 RSN 3:40 సా. వద్ద ఫిబ్రవరి 14, 2019

  Babu garu,

  To those who say CBN back stabbed NTR – which is not true.
  Here is the link where the YSR congress party founder shiv shankar accused jagan of backstabbing him.

  http://www.andhrajyothy.com/artical?SID=712372

  Try to circulate as a slap on those faces who talk rubbish about CBN.

  మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s
ట్విటర్ కబుర్లు

వీక్షణలు

 • 900,539

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2019
సో మం బు గు శు
« జన   మార్చి »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: