నా జీవితకాలం అంతా మీతో ప్రయాణించాలన్నదే నా ఉద్దేశం – జగన్

నా జీవితకాలం అంతా మీతో ప్రయాణించాలన్నదే నా ఉద్దేశం – జగన్

జగన్ రెడ్డీ,

సినిమాలో టీనేజి అమ్మాయికి చెప్పిన లెక్కన, నీతో కలిసి ప్రయాణిద్దాం రమ్మంటే, నేను ఏడ వచ్చేది జగన్ రెడ్డి. నా కష్టంతో బతికే నాకు, వేలకోట్ల కుబేరుడివి నువ్వు, ఎలా కుదురుతుంది?

నీతో వస్తే, ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు రావాలి. ఆ కోర్టు దయ తలిస్తే, జీవిత ఖైదు పడి చీకటి గదిలోకి వెళతావు. అక్కడ కలిసి ఎలా చిప్పకూడు తినమంటావు.

అది తప్పించుకోడానికి, బయట వున్నన్ని నాళ్లు, మోడీ నుండి దొంగ సాముల వరకు, వారి పాదాలు పట్టుకొంటావు. నువ్వు పట్టుకొంటుంటే, ప్రక్కన నేను నీలుక్కొని వుంటే, నాకు గర్వం అనుకొంటారు.

ఉత్తి పుణ్యానికి, నా కష్టానికి, అలాంటి మాటలు వినిపించుకోవడం నాకు అవసరమా. ఎవడన్నా దొంగోడు పారిపోతుంటే, పట్టిచ్చే సగటు మనిషిని. నీతో పాటు ప్రక్కన వున్నా అని, నన్ను కూడా తరుముకొంటే ఎంత అవమానం.

ఐఎయెస్ శ్రీ లక్ష్మి నుండి పారిశ్రామిక వేత్తల వరకు, అంతా మా కర్మ అనుకొంటుంటే, ఇంకా నీతో వస్తే, అన్నీ చూసిన నన్ను, లోకం కబోధి అనదా?

నువ్వే చెప్పు జగన్ రెడ్డి. నీకు న్యాయంగా వుందా నన్ను పిలవడం.

నన్ను ఒగ్గేయి. సమాజంలో నన్ను కనీసం ఓ పౌరుడిగా బతకనివ్వు. హీనంగా చూడనివ్వకు. దయచేసి, ఇంకెప్పుడూ అలాంటి తప్పుడు కోరిక కోరకు. ..చాకిరేవు.

ప్రకటనలు

1 Response to “నా జీవితకాలం అంతా మీతో ప్రయాణించాలన్నదే నా ఉద్దేశం – జగన్”


  1. 1 తాడిగడప శ్యామలరావు 2:42 సా. వద్ద ఫిబ్రవరి 6, 2019

    జీవితకాలం తనతో ప్రయాణం చేసేవారు తనకు జీవితకాలం ప్రయాణానికి ఇంధనం అందిస్తారు!

    మెచ్చుకోండి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s




ట్విటర్ కబుర్లు

వీక్షణలు

  • 892,685

తడి ఆరని ఉతుకులు

ఫిబ్రవరి 2019
సో మం బు గు శు
« జన   మార్చి »
 123
45678910
11121314151617
18192021222324
25262728  

నెలవారీ ఉతికినవి

ప్రకటనలు

%d bloggers like this: